Home / పవన్ టుడే / జ‌న‌సేనాని సిక్కోలు ప‌ర్య‌ట‌న ర‌ద్దు..! జ‌య‌ల‌లిత అనారోగ్య‌ వార్త‌ల నేప‌ధ్యంలో నిర్ణ‌యం..

జ‌న‌సేనాని సిక్కోలు ప‌ర్య‌ట‌న ర‌ద్దు..! జ‌య‌ల‌లిత అనారోగ్య‌ వార్త‌ల నేప‌ధ్యంలో నిర్ణ‌యం..

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న‌., నేటి మీడియా స‌మావేశం ర‌ద్ద‌య్యాయి.. త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి జ‌య‌ల‌లిత ఆరోగ్య ప‌రిస్థితి విష‌మించింద‌న్న వార్త‌ల నేప‌ధ్యంలో జ‌న‌సేనాని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు తెలుస్తోంది.. ఆదివారం రాత్రి ఆమెకు తీవ్ర‌స్థాయిలో గుండెపోటు వ‌చ్చింది.. ఆమె ప‌రిస్థితి విష‌మంగా ఉన్నట్టు ఆసుప‌త్రి వ‌ర్గాలు వెల్ల‌డించాయి.. ఈ నేప‌ధ్యంలో ఆయ‌న ఉద్దానం ప‌ర్య‌ట‌న పోస్ట్‌పోన్ చేసుకున్నారు.. షెడ్యూల్ ప్ర‌కారం ఆయ‌న మంగ‌ళ‌వారం శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం డివిజ‌న్‌, ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల్ని ప‌రామ‌ర్శించాల్సి ఉంది.. అంతుప‌ట్ట‌ని రోగాల‌తో నానాయాత‌లు ప‌డుతున్న రోగుల‌తో మాట్లాడి., వారి స‌మ‌స్య‌లు తెలుసుకోవాల్సి ఉంది.. ఉద్దానం ప‌రిస‌రాల్లో ఆరు మండ‌లాల్లో సుమారు 70 వేల మందికి పైగా కిడ్నీ సంబంధిత వ్యాధుల‌తో బాధ ప‌డుతున్నారు.. భూగ‌ర్భ జిల్లాల్లో మోతాదుకి మించి ఉన్న సిలికా ప్ర‌భావంతో జ‌నం ఇలాంటి రోగాల భారిన ప‌డుతున్నారు.. ఇలాంటి దారుణ ప‌రిస్థితులు ఉన్నా., పాల‌కులు, ప్ర‌భుత్వాలు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు.. దీంతో ఏళ్లు గ‌డ‌చిన కొద్దీ ఈ స‌మ‌స్య‌, ఈ స‌మ‌స్య భారిన ప‌డి ప్రాణాలు విడిచేవారి సంఖ్య పెరుగుతూనే ఉంది.. ఇదే విష‌యాన్ని స్థానిక జ‌న‌సేన పార్టీ కార్య‌క‌ర్త‌లు ప‌వ‌న్ దృష్టికి తీసుకురాగా., ఆ ప్రాంతంలో ప‌ర్య‌టించి., బాధితుల్ని ప‌రామ‌ర్శించేందుకు ఆయ‌న రెఢీ అయ్యారు..  అయితే జ‌య‌ల‌లిత వార్త‌ల నేప‌ధ్యంలో ఈ ప్రోగ్రాంని మ‌రో రోజు పెట్టుకుందామ‌ని ప‌వ‌న్, జ‌న‌సేన పార్టీ వ‌ర్గాలు నిర్వాహ‌కుల‌కి తెలిపాయి..

jayalalithaa-icu-photo-jayalalithaa-appolo-hospital-photo-viral-whatsapp

ఇప్ప‌టికే జ‌య‌ల‌లిత తాజా ఆరోగ్య ప‌రిస్థితిపై జ‌న‌సేనాని చెన్నై అపోలో ఆసుప‌త్రి వ‌ర్గాల‌ను ఆరా తీశారు.. ఆమె త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఆకాంక్షించారు..

Share This:

505 views

About Syamkumar Lebaka

Check Also

నిజ‌మైన స‌ర్వే చేద్దాం రండి.. ప‌చ్చ‌-ప్ర‌తి ప‌చ్చ‌(సాక్షి) మీడియాల‌కి ఓపెన్ ఛాలెంజ్‌..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌ధ్యంలో.. స‌ర్వేలంటూ మీడియా హ‌డావిడి మొద‌లుపెట్టింది.. తెలంగాణ‌లో ప‌రిస్థితులు ఎలా వున్నా., ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

seventeen − eight =