Home / ఎడిటోరియల్స్ / జ‌న‌సేనాని సూచ‌నే స‌ర్కారుకి శాస‌నం.. ప‌వ‌న్‌పై ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డుతున్న న‌మ్మ‌కం..

జ‌న‌సేనాని సూచ‌నే స‌ర్కారుకి శాస‌నం.. ప‌వ‌న్‌పై ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డుతున్న న‌మ్మ‌కం..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారికి మా ప్రాంతంలో ఆక్వా ఫుడ్ పార్క్ పేరుతో నిర్మిస్తున్న భారీ ఫ్యాక్ట‌రీ వ‌ల్ల చుట్టు ప‌క్క‌ల 30 గ్రామాల ప్ర‌జ‌లు న‌ష్ట‌పోతున్నారు.. మా స‌మ‌స్య‌కి ప‌రిష్కారం దొరుకుతుంద‌ని మీ వ‌ద్ద‌కి వ‌చ్చాం.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారు మేం కొల్లేరు నిర్వాసితులం, మాకు న్యాయం చేస్తామ‌ని ఎన్నిక‌ల స‌మ‌యంలో పాల‌కులు హామీలు ఇచ్చి., ఆన‌క మ‌రిచారు.. మీరు త‌లుచుకుంటే మా బాధ‌లు తీర‌తాయి.. మా జిల్లాలో నీటి స‌మ‌స్య ఉంది.. మీరు మా జిల్లాలో అడుగు పెట్టండి.. మా బాధ‌లు చూడండి.. అయ్యా మీ జిల్లా మీ రాక‌కోసం ఎదురుచూస్తోంది.. ఒక్క‌సారి రండి ప్లీజ్‌.. ఇలా ఆయ‌న్ని క‌లిసేందుకు వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రు విజ్ఞాప‌న‌ల మీద విజ్ఞాప‌న‌లు ఆయ‌న ముందుంచుతున్నారు.. ప‌లు ప్రాంతాల నుంచి గుంపులు గుంపులుగా త‌ర‌లివ‌స్తున్న అభిమానులు, ప్ర‌జ‌లు ఆయ‌న ఎదుట త‌మ స‌మ‌స్య‌లు ఏక‌రువు పెడుతున్నారు.. ఈ సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది..

రాజ‌కీయాలే కాదు, ఇలా ప్ర‌జ‌లు కూడా ప‌వ‌న్ చుట్టూ చ‌క్క‌ర్లు కొట్ట‌డానికి కార‌ణం ఆయ‌న‌పై పెరుగుతున్న అపార‌మైన న‌మ్మ‌క‌మేన‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల అంచ‌నా.. జ‌న‌సేనాని క‌ల్పించుకుంటే త‌మ ప‌ని అయిపోయిన‌ట్టే., ప‌వ‌న్ ఏం చెప్పినా ప్ర‌భుత్వం త‌లాడించాల్సిందేన‌న్న న‌మ్మకం ప్ర‌జ‌ల‌కి పెరిగిపోయింది.. జ‌న‌సేన ప్ర‌తినిధి బృందం భీమ‌వ‌రం ఆక్వా ఫుడ్ పార్క్ ప్రాంతంలో ప‌ర్య‌టించిన‌ప్పుడు ఈ విధ‌మైన అభిప్రాయ‌మే అక్క‌డ బాధితుల నుంచి వ్య‌క్త‌మైంది.. ఆయ‌న క‌ల్పించుకున్నాకే మా ఊళ్ల‌లో మేం ఫ్రీగా తిర‌గ్గ‌లుగుతున్నాం అన్న వారి మాట‌లే అందుకు ఉదాహ‌ర‌ణం.. ఒక్క ఆక్వా ఫుడ్ పార్క్ బాధితులే కాదు., దాదాపు రాష్ట్రం మొత్తం స‌మ‌స్య‌ల్లో ఉన్న ప్ర‌తి ఒక్క‌రు జ‌న‌సేనాని స్పంద‌న కోరుకుంటున్నారు..

చేతిలో ఎలాంటి అధికారం లేకున్నా, త‌మ ఎమ్మెల్యేలు, ఎంపిలు, మంత్రులు చేయ‌లేని ప‌నిని ప‌వ‌న్ ఒక్క సైగ‌తో చేయ‌గ‌లుగుతున్నారు.. స‌ర్కారుకి ఆయ‌న చేసే ప్ర‌తి సూచ‌నా ఓ శాస‌న‌మే.. అందుకే జ‌న‌సేనానిని లీడ‌ర్‌గా కొలిచే వారి సంఖ్య పెరుగుతోంది.. నేటి రాజ‌కీయ నాయ‌కుల‌కి భిన్నంగా ఉన్న ప‌వ‌ర్‌స్టార్ శైలి జ‌నాన్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.. దీంతో ఆయ‌న్న నేరుగా చూడాల‌నే కోరిక బ‌లంగా ఉన్నా., త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి మాత్రం జ‌న‌సేనాని క‌దిలి రావాల్సిన అవ‌స‌రం లేద‌న్న నిర్ణ‌యానికి ప్ర‌జ‌లు వ‌చ్చేశారు.. షూటింగ్ స్పాట్‌లో ఉన్నా., పార్టీ కార్యాల‌యంలో ఉన్నా త‌మ విజ్ఞాప‌న ఆయ‌న వ‌ద్ద‌కు చేరితే చాలు.. జ‌న‌సేనాని క‌ల్పించుకుంటే చాలు అంటున్నారు.. దీంతో పాటు త‌మ జిల్లాకీ జ‌న‌సేనాని వ‌స్తే., త‌మ స‌మ‌స్య‌లు ప్ర‌పంచానికి తెలుస్తాయి అనుకునే వారి సంఖ్యా పెరుగుతోంది.. అందుకే ఆ రియ‌ల్ హీరో త‌మ జిల్లాకి, త‌మ గ‌ల్లీకి రావాల‌ని కోరుకుంటున్నారు.. జ‌న‌సేనానికి పెరుగుతున్న ఈ ఇమేజ్ ప్ర‌త్య‌ర్ధుల్ని కాస్త క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేసేదే అయినా.., ప్ర‌స్తుతం ప్ర‌జ‌ల‌కి ఆయ‌న అవ‌స‌ర‌మే ఉంది.. మీరు మారే వ‌ర‌కు.. మీ రాజ‌కీయాలు మారే వ‌ర‌కు వేచి చూసే ఓపిక జ‌నానికి లేదు.. నైతిక విలువ‌లు పూర్తిగా మరిచిపోయిన నేటి రాజ‌కీయాల‌కు కొత్త నెత్తురు ఎక్కించాల‌న్న ఉద్దేశంతో దూసుకువ‌స్తున్న జ‌న‌సేనానిని ఆపాలంటే మీరు మార‌డం మిన‌హా వేరే దారి లేదు..

Share This:

1,199 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని ”మౌనం” తుపాను ముందు ప్ర‌శాంత‌తే..

ఐదు సంవ‌త్స‌రాల క్రితం జ‌న‌సేన పార్టీని స్థాపించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం సాధించారు..? ఒక్క సీటు అయినా గెలుస్తారా..? అస‌లు ఎన్నిక‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen − two =