Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / జ‌న‌సేనాని సెల‌క్ట్ చేసిన పీస్ అది.. టార్గెట్ చేసిన ఓ వ‌ర్గం మీడియాని ముప్పుతిప్ప‌లు పెట్టిన మీడియా హెడ్..

జ‌న‌సేనాని సెల‌క్ట్ చేసిన పీస్ అది.. టార్గెట్ చేసిన ఓ వ‌ర్గం మీడియాని ముప్పుతిప్ప‌లు పెట్టిన మీడియా హెడ్..

బెజ‌వాడ రాజ‌కీయాలు.. ఈ మాట చ‌దివినంత సింపుల్‌గా మాట్లాడుకునే మాట కాదు.. రాష్ట్రంతో పాటు దేశ రాజ‌కీయాల్నే ఓ ఆటాడించిన శ‌క్తులు పుట్టిన గ‌డ్డ అది.. అంతే కాదు తెలుగింట బ‌ల‌మైన మీడియా శ‌క్తుల్ని త‌యారు చేసిన ప్రాంతం కూడా.. మ‌రి అలాంటి చోట రాజ‌కీయాల్లో ఓ నూత‌నాధ్యాయాన్ని లిఖిద్దామ‌ని బ‌య‌లుదేరిన పార్టీ అడుగు పెడితే., ఎలా ఉంటుంది.. నిత్యం ఆ పార్టీని అణ‌గ‌దొక్కాల‌న్న ఆలోచ‌న‌తో ఉండే ఓ వ‌ర్గం మీడియా ఊర‌క చూస్తూ ఊరుకుంటుందా..? త‌మ అనుంగ నేత‌ల‌కి కొర‌క‌రాని కొయ్య‌గా మారిన ఆ పార్టీని ఇరుకున పెట్టి., వెట‌కారాలు జోడించే ప్ర‌య‌త్నం చేస్తుందా..? సాధ్య‌మైనంత వ‌ర‌కు త‌ప్పులు వెతికే ప‌నిలోనే ఉంటుంది.. బెజ‌వాడ జ‌న‌సేన ఔత్సాహికుల వేదిక సంద‌ర్బంగా తొలి రోజు పార్టీ ప్ర‌తినిధుల‌కి అలాంటి ప‌రిస్థితే ఎదురైంది.. మీడియా స‌మావేశంలో ఇద్దరు పార్టీ పెద్ద‌లు మాట్లాడారు.. పార్టీ ఉపాధ్య‌క్షులు మ‌హేంద‌ర్‌రెడ్డి పార్టీ విధానాల‌పై మాట్లాడితే., మీడియా హెడ్ హ‌రిప్ర‌సాద్‌., ఔత్సాహిక వేదిక‌ల ఉద్దేశాన్ని చాటారు.. అయితే ముంద‌స్తు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకు వ‌చ్చిన మీడియా తాంత్రికులు.. ప‌వ‌న్ ప్ర‌తినిధుల స‌త్తాని ప‌రీక్షించే ప్ర‌య‌త్నం చేశారు..

ఔత్సాహికుల వేదిక‌కి వ‌చ్చిన వారిని ఏం చేస్తారు అని మొద‌లు పెట్టి., ఎక్క‌డెక్క‌డికో వెళ్లిపోయారు.. ఇందులో నుంచే ఎమ్మెల్యేలు, ఎంపిలు కూడా దొర‌కొచ్చు ., 60 శాతం కొత్త వారికే అవ‌కాశం అంటే.. మిగిలిన 40 శాతం పాత‌వారికే ఇస్తారా అంటూ య‌క్ష‌ప్ర‌శ్న‌లు ప్రారంభించారు.. పాత నాయ‌కుల్లో నిజాయితీ ప‌రులు లేరనా మీ ఉద్దేశం.. లేకుంటే ఆయా నాయ‌కుల‌కి మీ మీడియా సంస్థ‌లు ఎలా మ‌ద్ద‌తు ఇచ్చాయి.. మీరు మెచ్చిన పార్టీ కోసం విలువ‌లు చంపేశారా.. అయితే ఇక్క‌డ హ‌రిప్ర‌సాద్ మాత్రం వారు సంధించే ప్ర‌తి ప్ర‌శ్న‌కీ గూభ గుయ్యిమ‌నేలా బ‌దులిచ్చారు..

అక్క‌డి నుంచి పొత్తుల వైపు వెళ్లారు.. టీడీపీతో ఉన్న సంబంధం ఏంటంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.. ప్ర‌స్తుతం నిర్మాణంలో ఉంది కాబ‌ట్టి కొన్ని విష‌యాలు మాట్లాడేందుకు సుముఖంగా లేమ‌ని చెప్పినా వ‌ద‌ల్లేదు.. దీంతో ఆయ‌న కూడా 2014 వ‌ర‌కు మాత్ర‌మే ఎన్డీయే కూట‌మితో జ‌న‌సేన‌కి ఉన్న బంధం అని తేల్చేశారు.. ప్ర‌స్తుతం ఏ పార్టీతో సంబంధం లేద‌నే చెప్పారు.. అలా అయితే భ‌విష్య‌త్ స్టాండ్ అంటూ నానా యాగీ చేశారు.. ఎన్నిక‌ల‌కి చాలా స‌మ‌యం ఉంది కాబ‌ట్టి., అప్ప‌టి ప‌రిస్థితుల ఆధారంగా నిర్ణ‌యిస్తామ‌ని చెప్పినా సంతృప్తి చెంద‌లేదు.. దీంతో అన్నింటీకీ స‌రిప‌డా ఒక్క‌టే బ‌దులు చెప్పి అంద‌రి నోళ్లు మూయించారు.. నిర్మాణం పూర్త‌యినా కాకున్నా., ఈ క్ష‌ణంలో ఎన్నిక‌లు వ‌చ్చినా జ‌న‌సేన సిద్ధంగా ఉన్న‌ట్టు హరిప్ర‌సాద్ స‌వాల్ విసిరారు..

స‌రిప‌డా స‌మాధానం చెప్పినా సంతృప్తి మాత్రం ద‌క్క‌లేదు స‌ద‌రు మీడియా మిత్రుల నుంచి.. చివ‌రికి జ‌గ‌న్‌తో అయినా క‌లుస్తారా అంటూ కొత్త ప్ర‌య‌త్నం చేశారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం అయితే ఎవ‌రితో అయినా క‌ల‌సి న‌డిచేందుకు సిద్ధం అంటూ ఇర‌కున పెట్టే ప్ర‌య‌త్నం చేసిన వారి ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లారు..

జ‌న‌సేనాని, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏ బాధ్య‌త‌ను అప్ప‌గించారంటే.. వారికి ఏంతో స‌త్తా ఉండాలి.. ఓపిక ఉండాలి.. బెజ‌వాడ‌లో మీడియా హెడ్ హ‌రిప్ర‌సాద్ మీడియా విసిరే య‌క్ష‌ప్ర‌శ్న‌ల‌కి బ‌దులిస్తుంటే.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ ఎంపిక ఏ స్థాయిలో ఉంటుందో అంద‌రికీ తెలిసొచ్చింది.. ఎక్క‌డా ఎలాంటి ఛాన్స్ ద‌క్క‌క‌పోవ‌డంతో ., తెల్ల‌మోఖం వేయ‌డం స‌ద‌రు మీడియా వంత‌య్యింది..

Share This:

5,751 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని వ‌ల్లే టీడీపీ గెలిచింది.. ఆ విష‌యం అంద‌రికీ తెలుసు.. ప‌చ్చ నేత‌ల‌కి గృహిణి కౌంట‌ర్‌.

మేం ఎప్పుడు టీడీపీకి ఓటు వేసి ఎరుగం.. మీరు చెప్ప‌డం వ‌ల్లే ఓటు వేశామ‌ని ఓ గృహిణి జ‌న‌సేనానికి చెప్పింది.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen − three =