Home / పాలి 'ట్రిక్స్' / జ‌న‌సేనాని హోదా పోరుకు లోక్‌స‌త్తా మ‌ద్ద‌తు..

జ‌న‌సేనాని హోదా పోరుకు లోక్‌స‌త్తా మ‌ద్ద‌తు..

14925352_546819562187506_6933492010368828568_n

కేంద్ర‌, రాష్ట్రాల్లో పాల‌క ప‌క్షాలు మిన‌హా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మిగిలిన అన్ని పార్టీలు ప్ర‌త్యేక హోదా కోసం త‌మ‌కు తోచిన విధంగా పోరాడుతూనే ఉన్నాయి.. అయితే ఆ పోరాటంలో నిబ‌ద్ద‌త, నిల‌క‌డ ఎంత అన్న‌దే ఇక్క‌డ ప్ర‌శ్న‌.. ఒక్కో పార్టీ కాసేపు ప్ర‌త్యేక హోదా అంటే., కాసేపు కాపు రిజ‌ర్వేష‌న్లు అంటున్నాయి.. ఆ త‌ర్వాత ఇంకో స‌మ‌స్య‌పైన పోరాటం, ఇంకా మాట్లాడితే బంద్‌లు, ధ‌ర్నాలు.. ఎక్క‌డో స‌మ‌స్య‌కి మ‌రెక్క‌డో జ‌నాన్ని ఇబ్బంది పెట్ట‌డం.. రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇలాంటివి నిత్య‌కృత్యంగా మారాయి.. ప్ర‌భుత్వం ఏం చేస్తుందో తెలియ‌డం లేదు.. ప్ర‌తిప‌క్షం ఏం చేస్తుందో అంత‌కంటే తెలియ‌డం లేదు.. ఇలాంటి ప‌రిస్థితులో విభ‌జ‌న హామీ ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గ‌ళం విప్పారు.. ఇన్నాళ్లు ఈ కాకి గోలంతా వినీవిన‌న‌ట్టు ప్ర‌వ‌ర్తించిన స‌ర్కారు., ప‌వ‌న్ బ‌రిలోకి దిగేస‌రికి కాస్త కంగారు ప‌డింది.. కాని క‌ల్ల‌బొల్లి క‌బుర్ల‌తో కాల‌క్షేపానికి ప్రాధాన్య‌త ఇచ్చింది.. హోదా విష‌యంలో మ‌డ‌మ తిప్ప‌ని జ‌న‌సేనాని., పోరు కొన‌సాగించేందుకే మొగ్గు చూపారు.. వ‌ప‌న్ దెబ్బ‌కి మ‌ళ్లీ హోదా వేడి ర‌గ‌ల‌డంతో ఇప్పుడు దాన్ని కాస్త హైజాక్ చేసి., ఆ క్రెడిట్ అంతా త‌మ ఖాతాలో వేసుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి.. ఇంత‌కీ ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కి మిన‌హా ఎవ్వ‌రికీ త‌మ ల‌క్ష్యంపై స్ప‌ష్ట‌త లేద‌న్న‌ది నిర్వివాదాంశం.. కానీ ఆ గ‌జిబిజి మొత్తం ఆయ‌న పైకి రుద్దేసేందుకు త‌మ అనుంగ మీడియా స‌హాయం తీసుకుంటున్నారు..

కానీ నిజం మాట్లాడుకుంటే., పాల‌కుల పీఠాలు క‌దిలించే శ‌క్తి జ‌న‌సేనాని సొంతం కాబ‌ట్టి., నిజంగా మ‌న నాయ‌కులు జ‌నం శ్రేయ‌స్సు కోరుకునే వారైతే., హోదా సాధించాల‌న్న నిబ‌ద్ద‌త వారికుంటే., కాసేపు ఈగోలు, స‌మీక‌ర‌ణాలు ప‌క్క‌నపెట్టి వారంతా ప‌వ‌న్ వెంట‌ న‌డ‌వాల్సిన అవ‌స‌రం ఉంది.. ఆ అవ‌స‌రాన్ని గుర్తెరిగారో ఏమో ఓ మాజీ ఐఏఎస్ అధికారి అధ్య‌క్షుడిగా ఉన్న‌ లోక్‌స‌త్తా జ‌న‌సేన వెనుక న‌డిచేందుకు రెడీ అయ్యింది.. ప్ర‌త్యేక హోదా సాధ‌నే ల‌క్ష్యంగా ఈ నెల 10న అనంత‌లో నిర్వ‌హించ‌నున్న సీమాంధ్ర‌ హ‌క్కుల చైత‌న్య స‌భ‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింది.. అయితే లోక్‌స‌త్తా ఇలా మ‌ద్ద‌తు ఇచ్చిందో లేదో., అలా రెండు పార్టీలు క‌లిసి న‌డ‌వాలంటూ వ్యాఖ్యానాలు మొద‌ల‌య్యాయి.. అవి ఉద్దేశ పూర్వ‌కంగా చేసిన‌వో., చేయించిన‌వో ప‌క్క‌న పెడితే., అదంతా జ‌ర‌గ‌డానికి చాలా స‌మ‌యం ఉంది.. ప్ర‌స్తుతానికి ఏపీకి హోదా సాధించే ల‌క్ష్యంతో చేస్తున్న పోరాటంలో ఎవ‌రు క‌ల‌సి వ‌చ్చినా., క‌లుపుకు పోవ‌డానికి జ‌న‌సేన సిద్ధంగా ఉంది..

Share This:

1,342 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రోసారి విజ‌య‌సాయి ‘దొంగ లెక్క‌లు’ బ‌య‌ట‌పెట్టిన జేడీ..(ప‌వ‌ర్ పంచ్‌)

జ‌గ‌న్‌రెడ్డిని గెలిపించి చంద్ర‌బాబుకు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తాన‌న్న కేసీఆర్ త‌న అనుంగ ప‌త్రిక న‌మ‌స్తే తెలంగాణ‌లో రాయించిన పిచ్చి రాత‌ల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 1 =