Home / పవన్ టుడే / జ‌న‌సేనాని @ 1 మిలియ‌న్‌

జ‌న‌సేనాని @ 1 మిలియ‌న్‌

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మిలియ‌నిర్ అయ్యారు.. ఇప్పుడు మిలియ‌నిర్ అవ్వ‌డ‌మేంటి అనుకుంటున్నారా.. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న ఫాలోవ‌ర్ల సంఖ్య ఇప్పుడు ప‌ది ల‌క్ష‌ల‌కు చేరింది.. రెండేళ్ల కాలంలోనే రికార్డు స్థాయిలో ఆయ‌న్ని ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియ‌న్‌కి చేరింది.. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఆయ‌న స్పందించ‌డం చాలా అరుదే అయినా., ఫాలోవ‌ర్ల సంఖ్య మాత్రం రోజు రోజుకీ పెరుగుతూ వ‌చ్చింది.. రెండేళ్ల‌లో ఆయ‌న చేసిన ట్విట్ల సంఖ్య కేవలం వందే.. తాజాగా పెద్ద నోట్ల ర‌ద్దు అంశానికి సంబంధించి ఆయ‌న కేంద్రానికి ప‌లు సూచ‌న‌లు చేస్తూ త‌న వందో ట్విట్ చేశారు.. ఈ వంద ట్వీట్ల‌లో త‌న సినిమాల‌కి సంబంధించి గాని, మ‌రే అంశాల‌కు సంబంధించి గాని ఎప్పుడు, ఎలాంటి ప్ర‌మోష‌న్ ఇచ్చుకున్న దాఖ‌లాలు లేవు.. కేవ‌లం సామాజిక‌, రాజ‌కీయ అంశాల‌కు సంబంధించి అవ‌స‌రం అనుకున్న‌ప్పుడు మాత్ర‌మే జ‌న‌సేనాని స్పందిస్తూ వ‌చ్చారు.. తాను పోరాడే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కి సంబంధించిన అభిప్రాయాల‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా పలు సంద‌ర్బాల్లో ప్ర‌స్తావించారు కూడా.. ప‌వ‌న్ ట్విట్ట‌ర్ ఫాలోవ‌ర్ల సంఖ్య ఒక మిలియ‌న్‌గా ఉంటే., సోష‌ల్ మీడియాలో ఆయ‌న అభిమానులు ఏర్పాటు చేసిన గ్రూపుల్ని ఫాలో అయ్యేవారి సంఖ్య ఐదు మిలియ‌న్ల‌కు పైగా ఉండ‌టం మ‌రో రికార్డు.. నిత్యం సెర్చ్ ఇంజ‌న్‌లో ఆయ‌న గురించి వార్త‌ల కోసం కూడా ల‌క్ష‌లాది మంచి వెతుకుతూ ఉన్నారు.. తెలుగులో ఓ హీరోకి గురించిగాని, రాజ‌కీయ నాయ‌కుడి గురించిగాని మాధ్య‌మాల్లో ఇంత మంది వెత‌క‌డం, ఫాలో అవ‌డం లేదంటే., ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌ర్ ఏంటో అర్ధమ‌వుతుంది..

Share This:

613 views

About Syamkumar Lebaka

Check Also

రామ‌చంద్ర‌పురం జ‌న‌సేనాని పోరాట‌యాత్ర.. ప‌బ్లిక్ మీటింగ్ ఎక్స్‌క్లూజివ్ ఫోటోస్‌..

పాల‌కుల‌కీ-ప్ర‌జా నాయ‌కుడికి మ‌ధ్య వ్య‌త్యాసం ఎంత అంటే., అవి రెండు ఎప్ప‌టికీ క‌ల‌వ‌ని రైలు ప‌ట్టాలే.. పాల‌కుల‌కి నిర్ధేశించిన అస‌లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fourteen − 14 =