Home / జన సేన / జ‌న‌సేనాని JFCకి ఇద్ద‌రు ఒకే.. మ‌రి మిగిలిన స‌భ్యులు ఎవ‌రో తెలుసా..?

జ‌న‌సేనాని JFCకి ఇద్ద‌రు ఒకే.. మ‌రి మిగిలిన స‌భ్యులు ఎవ‌రో తెలుసా..?

విభ‌జ‌న కార‌ణంగా న‌ష్ట‌పోయిన రాష్ట్రానికి న్యాయం చేస్తార‌న్న కార‌ణంతో 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కేంద్రంలో బీజేపీకి, రాష్ట్రంలో టీడీపీకి మ‌ద్ద‌తు ప‌లికారు.. ఆ రెండు పార్టీల‌ను గ‌ద్దెనెక్కించ‌డంలో కూడా కీల‌క‌పాత్ర పోషించారు కూడా.. అయితే ఆయ‌న ఏదైతే ఆశించి ఆయా ప్ర‌భుత్వాల‌కి మ‌ద్ద‌తు ప‌లికారో., ప్ర‌జ‌లకి ఇచ్చిన హామీలు నెర‌వేర్చే అంశంలో దారుణంగా విఫ‌ల‌మ‌య్యాయి.. పైగా ప్ర‌జ‌ల్ని గంద‌ర‌గోళానికి గురి చేస్తూ కేంద్ర-రాష్ట్రాలు విభ‌జ‌న హామీల‌ను విస్మ‌రిస్తున్నాయి.. రియ‌ల్ పాలిటిక్స్‌.. పార‌ద‌ర్శ‌క‌త‌తో కూడిన రాజ‌కీయాలు చేస్తాన‌ని చెప్పిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌ద్ద‌తిచ్చిన పాపానికి., తానే జ‌వాబుదారి అయ్యాడు.. ప్ర‌జ‌ల‌కి నిజాలు తెలియ చేసేందుకు త‌న మార్క్ వ్యూహాల‌ని అమ‌లు ప‌రిచాడు.. Joint Fact Finding Committee ఉమ్మ‌డి నిజ నిర్ధార‌ణ క‌మిటీ.. ఇందులో రాజ‌కీయాల‌కి చోటు లేదు.. ప‌ర‌స్ప‌రం భిన్న‌ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్న కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల్లో త‌ప్పెవ‌రిది.. అర్ధ‌కాని లెక్క‌ల‌తో ప్ర‌జ‌ల్ని మాయ చేస్తున్న ప్ర‌భుత్వాల అస‌లు లెక్క తేల్చాలి.. ఇలాంటి ప‌ని చేయ‌డానికి దమ్ము కావాలి.. ద‌మ్ముతో పాటు వాస్త‌వాలు వెలికితీసే స‌త్తా ఉన్న ఎక్స్‌ప‌ర్ట్స్ కావాలి.. మ‌రి జ‌న‌సేన అధినేత వ‌ద్ద అలాంటి ఎక్స్‌ప‌ర్ట్స్ ఉన్నారా..?

జేఎఫ్‌సీ ఎర్పాటు ఆలోచ‌న ప్ర‌జ‌ల ముందు ఉంచిన‌ప్పుడు పవ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌క‌టించిన రెండు పేర్లు చెప్పేశాయి.. ఆయ‌న ఆలోచ‌న‌ని.. జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ అనే ఒక ఆలోచ‌న‌.. ఉండ‌వ‌ల్లి అరుణ్‌కుమార్ అనే ఒక అనుభ‌వం.. ఇంకా మ‌రికొంద‌రు ఆర్ధిక‌వేత్త‌లు, సామాజిక‌వేత్త‌లు, రాజ‌కీయ‌వేత్త‌లు, మేథావులు, ప్రొఫెస‌ర్లు.. వీరికి రాజ‌కీయాల‌తో సంబంధం ఉండ‌దు.. కేవ‌లం వారైతేనే ఈ ప‌నిని స‌మ‌ర్ధ‌వంతంగా చేయ‌గ‌లుగుతారు..

ఇంత‌కీ ఉండ‌వ‌ల్ల‌, జ‌య‌ప్ర‌కాష్ నారాయ‌ణ కాకుండా జ‌న‌సేనుడు చెబుతున్న టీంలో ఆ మిగిలిన స‌భ్యులు ఎవ‌రు..? రెండు రోజుల వ‌ర‌కు ఈ స‌స్పెన్స్ భ‌రించ‌క త‌ప్ప‌దు.. ఎందుకంటు రెండు రోజుల్లో జ‌న‌సేనాని క‌మిటీ యొక్క పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాన‌ని తెలిపారు కూడా.. ఉండ‌వ‌ల్లి మాట‌ల్లో Joint Fact Finding Committeeకి జ‌న‌సేనాని సూచించిన పేర్లు చాలా పెద్ద‌వి.. ఆ పేర్లు ఓ సామాన్య‌మైన వ్య‌క్తి పిలిస్తే వ‌చ్చేవి కావు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పిలిచాడు కాబ‌ట్టి త‌ప్ప‌కుండా వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయంట‌.. ఆ పేర్ల ఎంపిక ఎలా చేశారు..? అందుకు ఎవ‌రు స‌ల‌హా ఇచ్చారు అనే విష‌యం ఉండ‌వ‌ల్లి లాంటి సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త‌కే ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది.. అయితే ఈ క‌మిటీ ఖ‌చ్చితంగా నిజాన్ని మాత్ర‌మే వెలికి తీస్తుంద‌ని కూడా చెబుతున్నారు..

ఇక్క‌డ మ‌రో రెండు అంశాలు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.. ఒక‌టి చాలా గ‌ట్టి స‌భ్యులు అంటున్నారు.. ఎవ‌రువారు.. వారిని ట్రేస్ చేసే ప‌నిలో ప్ర‌త్య‌ర్ధులు నిమ‌జ్ఞ‌మైపోయారు.. త‌మ బంఢారాలు బ‌ట్ట‌బ‌య‌ల‌య్యే ప‌రిస్థితులు ఉత్ప‌న్న‌మైన నేప‌ధ్యంలో., క‌ల్ల‌బొల్లి క‌బుర్ల‌తో కాల‌యాప‌న చేసే ప‌రిస్థితులు లేక‌పోవ‌డంతో., జుట్టు ప‌ట్ట‌కుంటున్నాయి.. అయితే ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు ఎంచుకున్న ఆ పేర్ల‌లో ఇంకా కొంద‌రి నుంచి స్ప‌ష్ట‌త రావాల్సి ఉందంట‌.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పిలిస్తే రారా..? అన్న క్వ‌శ్చ‌న్ మార్క్ వ్య‌క్త‌మైనా., వారి స్థాయికి, అనుభ‌వానికి అంతా మ‌ర్యాద ఇవ్వాల్సిందే..

ఎక్క‌డ నెగ్గాలో కాదు.. ఎక్క‌డ త‌గ్గాలో కూడా జ‌న‌సేన అధినేత‌కి బాగా తెలుసు.. వీడి చ‌ర్య‌లు ఊహాతీతం శ‌ర్మా..

Share This:

3,840 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

One comment

  1. I think i will be lika ACF in tagore movie of the great annayya chiru

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fourteen − three =