Home / జన సేన / జ‌న‌సేనుడికి గిరి”జ‌న” హార‌తి.. బొబ్బిలిలో గర్జించిన బెబ్బులి..

జ‌న‌సేనుడికి గిరి”జ‌న” హార‌తి.. బొబ్బిలిలో గర్జించిన బెబ్బులి..

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ పోరాట యాత్ర అడుగ‌డుగునా జ‌న‌నీరాజ‌నం మ‌ధ్య ప్రారంభ‌మైంది.. బొబ్బిలిలో మ‌ధ్యాహ్నం రెండు గంట‌ల‌కి బ‌య‌లుదేరిన జ‌న‌సేనాని, నేరుగా కురుపాం నియోజ‌క‌వ‌ర్గ కేంద్రానికి వెళ్లారు.. మార్గం మ‌ధ్య‌లో జ‌న‌సేన అధినేత వ‌స్తున్నార‌న్న వార్త విన్న గ్రామాల ప్ర‌జ‌లు ర‌హ‌దారికి అడ్డుగా నిల‌బ‌డి మ‌రీ, ఆయ‌నతో మాట్లాడేందుకు ఎగ‌బ‌డ్డారు.. బొబ్బిలి నుంచి కురుపాం వ‌ర‌కు వెళ్లే స‌మ‌యంలో, తిరుగు ప‌మ‌నంలో 20కి పైగా గ్రామాల ప్ర‌జ‌లు ఊరు ఊరంతా ర‌హ‌దారిపై బైఠాంచి జ‌నసేనుడి కాన్వాయ్‌ని అట‌కాయించారు.. ప్ర‌తి చోటా జ‌న‌సేనాని కారు నుంచి బ‌య‌టికి వ‌చ్చి, ప్ర‌జ‌ల‌కి అభివాదం చేస్తూ ముందుకి సాగారు.. యువ‌త‌తో పాటు వ‌య‌సు మీద‌ప‌డిన వారు కూడా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని చూసి సిఎం..సిఎం అంటూ నినాదాలు చేశారు..

కురుపాంలో గిరిజ‌నుల స‌మ‌స్య‌ల‌పై ప్ర‌భుత్వాన్ని నిల‌దీసిన జ‌న‌సేనాని., అడ‌వి బిడ్డ‌ల్ని కేవ‌లం ఓట్లుగా మాత్ర‌మే చూస్తున్నాంటూ విమ‌ర్శించారు.. గిరిజన గ్రామాల్లో వంతెన‌ల నిర్మాణానికి ప్ర‌భుత్వం ద‌గ్గ‌ర డ‌బ్బు ఉండ‌దు గానీ, న‌వ నిర్మాణ దీక్ష‌ల పేరుతో చేసే డ్రామాల‌కి మాత్రం క‌ట్టే స్టేజిలు, పందిళ్ల కోసం కోట్ల‌కి కోట్లు త‌గ‌లేస్తారంటూ మండిప‌డ్డారు.. ఎవ‌డ‌బ్బ సొత్త‌ని ఇష్టారాజ్యంగా ఖ‌ర్చులు చేస్తారంటూ ప్ర‌జాక్షేత్రం నుంచి ప్ర‌శ్నించారు.. మేం క‌ట్టే ట్యాక్సుల‌కి మాకు లెక్క‌లు చెప్పాల్సిందేన‌ని జ‌న‌సేన అధినేత డిమాండ్ చేశారు.. గిరిజ‌న యూనివ‌ర్శిటీ ఎక్క‌డంటూ జ‌న‌సేనాని ప్ర‌శ్నించారు.. అనంత‌రం పార్వ‌తీపురం చేరుకున్న ఆయ‌న‌కు జ‌న‌సంద్రం స్వాగ‌తం ప‌లికింది.. ప్ర‌ధాన ర‌హ‌దారి సుమారు కిలోమీట‌ర్ మేర కిక్కిరిసింది.. వేలాది మంది క‌దిలిరాగా, జ‌న‌సేన అధినేత నిర‌స‌న క‌వాతు నిర్వ‌హించారు.. ఈ నిర‌స‌న క‌వాతు కేంద్రానికి తాకి తీరుతుంద‌ని ఆయ‌న ఆకాంక్షించారు.. పార్వ‌తీపురం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఆయ‌న దృష్టికి వ‌చ్చిన బోధ‌కాలు, తాగునీరు, నిరుద్యోగం , వ‌ల‌స‌లు లాంటి స‌మ‌స్య‌ల‌పై రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించారు.. పార్వ‌తీపురం మునిస్పాలిటీ న‌ల్లాల్లో వ‌స్తున్న నీటిని ఒక్క‌సారి చంద్ర‌బాబు నాయుడుగారికి తాగిస్తే., ఇక్క‌డ ప్ర‌జ‌ల ఇక్క‌ట్లు ఆయ‌న‌కి తెలుస్తాయ‌న్నారు..

బొబ్బిలిలో జ‌న‌సేనాని బెబ్బులిలా గ‌ర్జించారు.. ఆశేష జ‌న‌వాహినితో క‌ల‌సి రైల్వే స్టేష‌న్ జంక్ష‌న్‌లో క‌వాతు చేసిన ప‌వ‌న్‌., జూట్ మిల్లుల మూసివేత‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కుపెట్టారు.. ఉన్న ఉపాధి కాస్తా ఊడ‌పీకిన మీకు ఎందుకు ఓట్లు వేయాలో చెప్పాల‌ని ముఖ్య‌మంత్రిని డిమాండ్ చేశారు.. క‌నీసం ర‌హ‌దారులు కూడా స‌రిగాలేని దుస్థితిని ప‌వ‌న్ ఎత్తిచూపారు.. ప్ర‌జా స‌మ‌స్య‌లు పాల‌క ప‌క్షం ప‌ట్టించుకోకున్నా, ప్ర‌జ‌ల త‌రుపున ప్ర‌తిప‌క్షం పోరాడ‌కున్నా., జ‌న‌సేన మాత్రం గ‌ళం విప్పేందుకు సిద్ధంగా ఉంటుంద‌న్నారు.. తోట‌ప‌ల్లి, జంఝావ‌తి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు ప్ర‌భుత్వం వ‌ద్ద నిధులు ఉండ‌వ‌న్న జ‌న‌సేనా అధినేత‌, హైద‌రాబాద్‌లో ముఖ్య‌మంత్రి నివాసం పేరుతో 150 కోట్లు క‌ట్టేస్తారు.. ఇదెక్క‌డి పాల‌న అంటూ ప్ర‌శ్నించారు.. ప్ర‌త్యేక హోదా విష‌యంలో 36 సార్లు మాట‌మార్చార‌న్న ప‌వ‌న్‌., ఒకే మాట మీద నిల‌బ‌డే నాయ‌కుడి అవ‌స‌రం ఉంద‌న్నారు..

ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుకి కార‌ణాలు ఏంటో, ఇక్క‌డి మేధావులు లెక్కిస్తున్నార‌న్న జ‌న‌సేనుడు, ఇక్క‌డ ఉద్య‌మ సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయ‌న్నారు.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కి కొన్ని స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇచ్చారు.. ప్ర‌తి గిరిజ‌న గ్రామానికీ వెళ్ల‌డంతో పాటు అక్క‌డ స‌మ‌స్య‌లు గుర్తించాల‌ని.. వాటిపై జ‌న‌సేన బ‌లంగా పోరాటం చేస్తుంద‌ని తెలిపారు.. ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌ల‌కి జ‌న‌సేన ఎప్పుడూ అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా ఇచ్చారు.. అశోక‌గ‌జ‌ప‌తి రాజుపై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు ఎక్కుపెట్టారు.. ఓవ‌రాల్‌గా విజ‌య‌న‌గ‌రం డేవన్ సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది..

Share This:

2,752 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fourteen + 19 =