Home / ఎడిటోరియల్స్ / జ‌న‌సేనుడిది కేవ‌లం ‘జ‌నం’ప‌క్ష‌మే.. విలువ‌లేని విమ‌ర్శ‌లు ప‌క్క‌న‌పెట్టండిక‌..

జ‌న‌సేనుడిది కేవ‌లం ‘జ‌నం’ప‌క్ష‌మే.. విలువ‌లేని విమ‌ర్శ‌లు ప‌క్క‌న‌పెట్టండిక‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌భుత్వాల‌కి కొమ్ముకాస్తున్నార‌న్న విమ‌ర్శ స‌రైన‌దేనా..? టీడీపీని విమ‌ర్శించ‌డం లేదు.. టిఆర్ఎస్‌ని విమ‌ర్శించ‌డం లేదు.. ఇది విమ‌ర్శ‌కుల వాద‌న‌.. వాస్త‌వానికి ఆయ‌న విమ‌ర్శించ‌డం లేదా..? విమ‌ర్శ‌కులు ఒక‌సారి గుండెల‌పై చెయ్యేసుకుని చెప్పండి.. అంటే తెల్ల‌వారి లేచిన ద‌గ్గ‌ర్నుంచి బూతులు తిట్టుకునే రాజ‌కీయాలు జ‌న‌సేన అధినేత చేయ‌డం లేదు.. అదే రాజ‌కీయం అయితే., అలాంటి రాజ‌కీయాలు నేను చేయ‌న‌ని చెప్ప‌డం వెనుక నిజాయితీని ఎంత మంది గ్ర‌హిస్తున్నారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట‌ల్లో తన గొంతు నుంచి ఒక మాట బ‌య‌టికి వ‌చ్చాక‌., ఖ‌చ్చితంగా దాన్ని నిల‌బెట్టుకోవాల్సిందే.. ఎందుకంటే ద‌శాబ్దాల అనుభ‌వం ఉన్న పార్టీలు హామీలు ఇచ్చి ఇచ్చి ., ప్ర‌జ‌ల్ని ఎలా మోసం చేయాలో ఆరితేరిపోయాయి.. అందేకే ఏళ్ల త‌ర‌బ‌డి హామీలు ఇస్తూనే ఉన్నారు.. ఎగ్గొడుతూనే ఉన్నారు.. కానీ జ‌న‌సేన అధినేత ఏదైనా స‌మ‌స్య‌ని భుజాన వేసుకుంటే., ఎప్పుడు చేస్తారు..? ఎన్నాళ్లు చేస్తారు..? బ‌్ర‌తిమ‌లాడ‌తారేంటి..? ఇలాంటి ప్ర‌శ్న‌లు విప‌క్షాల నుంచి గానీ, మీడియా నుంచి గానీ నిత్యం ఎదుర్కొన‌క త‌ప్ప‌ని ప‌రిస్థితి.. ఇంత‌కీ ఈ ప్ర‌శ్న‌లు వేసే వారికి ఆ అర్హ‌త ఉందా..? అన్న ప్ర‌శ్న ఎందుకు ఏ ఒక్క‌రూ త‌మ‌కి తాము వేసుకోరు.. వాస్తవానికి ప్ర‌జ‌ల‌తో ఓట్లు వేయించుకున్న మీకే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఎక్కువ బాధ్య‌త ఉంది.. అలాంటిది మీరు ఆయ‌న్ని చేయ‌డం లేద‌ని ఎందుకు ప‌దే ప‌దే ప్ర‌శ్నిస్తున్నారు.. అంటే మీ వ‌ల్ల కావ‌డం లేద‌నేదేగా నిజం..

రాజ‌కీయాల్లో ప్ర‌త్య‌ర్ధి చేసిన ప‌ని భాగుంటే, అందులో ప్ర‌జా శ్రేయ‌స్సు ఉంటే.. దాన్ని ఒప్పుకోవ‌డానికి చాలా ధైర్యం కావాలి.. నిజాయితీ కావాలి.. అలాంటి నిజాయితీ జ‌న‌సేనాని వ‌ద్ద వంద శాతం ఉంది.. అందుకే ప్ర‌జ‌ల‌కి మంచి జ‌రిగిన‌ప్పుడు ., అది ప్ర‌భుత్వాల ద్వారా జ‌రిగిన‌ప్పుడు ఇది మంచి అని ఒప్పుకుంటున్నారు.. ఇదేం చాటు మాటు వ్య‌వ‌హారం కాదు.. ఇక ప్ర‌భుత్వాలు విఫ‌లం అయ్యాయి అనుకున్న‌ప్పుడు.. ఖ‌చ్చితంగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ వైపు నుంచి క‌ఠిన‌మైన హెచ్చ‌రిక‌లు వినిపిస్తాయి.. గ‌తంలో చాలా సంద‌ర్బాల్లో ప్ర‌జ‌లు ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో జాప్యం జ‌రిగిన‌ప్పుడు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., విరుచుకుప‌డిన సంద‌ర్బాలు కొకొల్ల‌లు..

బుధవారం జ‌రిగిన ప్రెస్‌మీట్‌లో టీడీపీ-చంద్ర‌బాబుల‌పై జ‌న‌సేన అధినేత తీవ్రంగా స్పందించారు.. అనుభ‌వాన్ని చూసి మ‌ద్ద‌తిచ్చా.. ఏడాది-ఏడాదిన్న‌ర వెయిట్ చేశా.. పోరాటం ప్రారంభించా.. ప్యాకేజీ అన్నారు.. అది చాలా భాగుంద‌ని చంద్ర‌బాబు సైతం అంటే., ప్ర‌జ‌ల‌కి మంచి జ‌రుగుతుంది అనుకున్నా.. మ‌రి ఇప్పుడు భాగుంద‌న్న ఆ నోటితోనే బాగాలేద‌ని అంటున్నారు.. ఏంటీ తిక‌మ‌క‌.. ప్ర‌జ‌ల‌కి మీపై న‌మ్మ‌కం పోతోంది.. ఇవ‌న్నీ హెచ్చ‌రిక‌లు కాదా.. పొలిటిక‌ల్ థియ‌రీలో వీటిని ఏమంటారు.. ఓ వైపు డ‌బ్బు లేదంటున్నారు.. మ‌రోవైపు విప‌రీత‌మైన క‌రప్ష‌న్‌.. అదే అవినీతి ఉన్న రాష్ట్రం అని ప‌లు ఏజెన్సీలు రిపోర్టులు ఇస్తున్నాయి.. టీడీపీ స‌ర్కారు గురించి చేసిన ఈ వ్యాఖ్య‌లు విమ‌ర్శ‌లు కాదా.. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై వెన‌క్కి ఎందుకు వెళ్తున్న సంద‌ర్బంలో చేసిన ఈ వ్యాఖ్య‌ల్ని ఏమంటారు.. త‌ల తీస్తాం.. మొలేస్తాం.. మేం వ‌స్తే చేస్తాం.. అనేవి విమ‌ర్శ‌లా.. మీరు వ‌చ్చే వ‌ర‌కు ఆగాలంటే., ప్ర‌జ‌లు ఐదేళ్ల పాటు స‌మ‌స్య‌ల‌తో పోరాడాల్సిందేనా..? ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తన‌కి ఓటు కూడా అడ‌గ‌కుండా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేస్తున్నారుగా.. ప్ర‌జ‌ల దృష్టిలో ఆ పోరాటాన్ని త‌ప్పుగా చిత్రించే ప్ర‌య‌త్నం ఎందుకు చేస్తున్నారు..?

ఒక సుదీర్ఘం ల‌క్ష్యం ఆయ‌న ఎదుట ఉంది.. ఆవేశం-ఆందోళ‌న విడిచి.. జ‌న‌సేన అధినేత ఏ ల‌క్ష్యం కోసం అడుగులు వేస్తున్నారో ఆలోచించండి.. తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌తి పౌరుడి స‌మ‌స్య‌కి ప‌రిష్కారం దొర‌కాలి.. అందుకోసం త‌న గొంతుక‌.. త‌న బ‌లం చాల‌ద‌న్న‌ప్పుడు., ప్ర‌జ‌ల‌కి న్యాయం జ‌ర‌గ‌ద‌ని భావించిన‌ప్పుడు.. మ‌రో బ‌లాన్ని, బ‌ల‌గాన్ని క‌లుపుకుని బ‌లం పెంచుకుని పోరాడ‌టం త‌ప్పా..? ఆయ‌న ప‌క్షం ఎవ‌రి ప‌క్షం.. ప్ర‌తి పౌరుడి స‌మ‌స్య ప‌రిష్కారం కావాలి అన్న ఆయ‌న ల‌క్ష్యం ఎవ‌రి ప‌క్షం.. పాల‌క‌వ‌ర్గాల ప‌క్ష‌మా.. ప్ర‌జాప‌క్ష‌మా.. ఒక్క‌సారి ప్ర‌శాంతంగా కూర్చుని ఆలోచించండి.. ఆయ‌న ప‌క్షం ఎవ‌రి ప‌క్ష‌మో తెలుస్తుంది..

మొన్న‌క పాత్రికేయ మిత్రుడు ఉత్త‌మ రాజ‌కీయాల‌కి దారేది అని ప్ర‌శ్నించారు… అదే ప్ర‌శ్న మీకంటూ ఓ గుండె ఉంది అని భావిస్తే.. దానిపై చెయ్యేసుకుని మిమ్మ‌ల్ని మీరు స‌మాధాన ప‌ర్చుకోండి.. జ‌నాన్ని ఎన్ని మాట‌లు చెప్పి మాయ చేసినా ప‌ర్వాలేదు.. క‌నీసం మీక‌యినా తెలిస్తే చాలు.. ఉత్త‌మ రాజ‌కీయాలు అంటే ఎలా ఉంటాయో..

Share This:

891 views

About Syamkumar Lebaka

Check Also

ఎనిమిది రోజులు.. 13 జిల్లాలు.. ముగిసిన జ‌న‌సేన జిల్లా స్థాయి స‌మీక్షా స‌మావేశాలు..

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో త‌న సైన్యాన్ని కార్యోన్ముఖుల్ని చేసే ప్ర‌క్రియ‌లో భాగంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న తొలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen − fifteen =