Home / ఎడిటోరియల్స్ / జ‌న‌సేనుడిపై ఆ ముస‌లి త‌ల్లికి అంత‌టి న‌మ్మ‌కం ఎందుకొచ్చిందంటే..?

జ‌న‌సేనుడిపై ఆ ముస‌లి త‌ల్లికి అంత‌టి న‌మ్మ‌కం ఎందుకొచ్చిందంటే..?

ఆయ‌న కీర్తి.. ఆకాశ‌మంత ఎత్తు.. అయినా ఆయ‌న కూర్చోవ‌డానికి నేల త‌ల్లి ఒడి చాలు.. పేరుకి పెద్ద నాయ‌కుడు అయినా., మూరు మూల గిరిజ‌నం అంటే ఇష్టం.. గూడెం గుడిసె వాసులంటే మ‌రీ ఇష్టం.. ప‌చ్చ‌టి నేల‌ల మ‌ట్టి వాస‌న మ‌రీ ఇష్టం.. క‌ప‌ట‌మెరుగ‌ని ఆ గిరిపుత్రుల్ని ప‌లుక‌రించ‌డం, వారి స‌మ‌స్య‌లు తెలుసుకుని ప‌రిష్కార మార్గాలు వెత‌క‌డం ఇంకా.. ఇంకా ఇష్టం.. అందుకే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని అదే క‌ప‌ట‌మెరుగ‌ని మ‌న‌సులో ఆ ముస‌లి త‌ల్లి మ‌హానుభావుడిగా గుర్తించింది..

ఆ ఊరికి మ‌హానుభావులైన నాయ‌కులు, అదే గిరిపుత్రుల ఓట్ల‌తో గెలిచిన నాయ‌కులు గ‌తంలో చాలా మందే వ‌చ్చారంట‌.. అయితే ఎవ‌రూ రోడ్డు దిగి త‌మ గూడెంలోకి అడుగుపెట్టే సాహ‌సం మాత్రం చేయ‌లేదంట‌.. మ‌ట్టి వాస‌న న‌చ్చ‌కో, మ‌ట్టి మ‌నుషులు న‌చ్చ‌కో తెలియ‌దు గానీ., ఈ మ‌హానుభావుడికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఓటెయ్య‌లేదు.. అయినా క‌ష్టం వ‌చ్చింది బాబు అని పిల‌వ‌గానే ఇంటికి వ‌చ్చి మ‌రీ ప‌లుక‌రించాడంట‌.. వారి క‌ష్టాలు తెలుసుకున్నాడంట‌.. తాగు నీరు ఇవ్వండి బాబూ అని ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వేడుకుంటున్నా, క‌నీసం మేమేం తాగుతున్నామో కూడా అతీప‌తీ క‌నుక్కున్న నాయ‌కుడు ఇంత వ‌ర‌కు క‌న‌బ‌డ లేదంట‌.. ఎక్క‌డో ఉండాల్సినోడు ఎక్క‌డికో వ‌చ్చి, మా పొలం గ‌ట్టెక్కాడు.. మా నీటి గ‌డ్డ‌లు చూసి, గుక్కెడు నీటి కోసం మేం ప‌డుతున్న క‌ష్టాన్ని చూశాడు.. మా క‌ష్టాలు తీరుస్తాన‌ని హామీ ఇచ్చాడు..

టీవీల్లో కూర్చుని ఏళ్ల‌కు ఏళ్లు పెద్ద పెద్ద క‌బుర్లు చెప్పే నాయ‌కులు ఎవ్వ‌రూ మాకేం చేసింది లేదు.. రోడ్డు దిగి మమ్మ‌ల్ని ప‌లుక‌రించినోడూ లేడు.. అందుకే నేను.. నా ఊరు మొత్తం ఈ మ‌హానుభావుడికే ఓటేస్తా.. ఈయ‌న ఖ‌చ్చితంగా మా క‌ష్టాలు తీరుస్తాడ‌న్న న‌మ్మ‌కం.. మా కోసం ఏదో ఒక‌టి చేస్తాడ‌న్న న‌మ్మ‌కం ఉంది.. ఏ ప్ర‌భుత్వ వ‌చ్చినా, ఏ పెద్దోళ్లు వ‌చ్చి అడిగినా అదే చెబుతాం..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ్య‌క్తిత్వం, ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉంటే స్పందించే గుణం, ఆయ‌న వ‌స్తే ప్ర‌జ‌ల‌కు ఏదో ఒక‌టి చేస్తాడ‌న్న న‌మ్మ‌కం.. ఎక్క‌డో మారు మూల కొండ‌ల్లో నాగ‌రిక‌త ఎరుగ‌ని పెద్దావిడ‌కి వ‌చ్చింది.. అయ్యా ముఖ్య‌మంత్రిగారి పుత్ర లోకేష్‌బాబూ, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం చేస్తున్నారో., ఏం మాట్లాడుతున్నారో.. వాళ్ల‌కి క్లియ‌ర్‌గా అర్ధం అయ్యింది.. మీకెప్పుడు అర్ధం అవుతుందో మ‌రి..

జ‌న‌సేనుడిపై ఆ ముస‌లి త‌ల్లికి అంత‌టి న‌మ్మ‌కం ఎందుకొచ్చిందంటే..?

ఆయ‌న ఎత్తు ఆకాశ‌మంత‌.. అయినా ఆయ‌న కూర్చోవ‌డానికి నేల త‌ల్లి ఒడి చాలు.. పేరుకి పెద్ద నాయ‌కుడు అయినా., మూరు మూల గిరిజ‌నం అంటే ఇష్టం.. గూడెం గుడిసె వాసులంటే మ‌రీ ఇష్టం.. ప‌చ్చ‌టి నేల‌ల మ‌ట్టి వాస‌న మ‌రీ ఇష్టం.. క‌ప‌ట‌మెరుగ‌ని ఆ గిరిపుత్రుల్ని ప‌లుక‌రించ‌డం, వారి స‌మ‌స్య‌లు తెలుసుకుని ప‌రిష్కార మార్గాలు వెత‌క‌డం ఇంకా.. ఇంకా ఇష్టం.. అందుకే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని అదే క‌ప‌ట‌మెరుగ‌ని మ‌న‌సులో ఆ ముస‌లి త‌ల్లి మ‌హానుభావుడిగా గుర్తించింది..

ఆ ఊరికి మ‌హానుభావులైన నాయ‌కులు, అదే గిరిపుత్రుల ఓట్ల‌తో గెలిచిన నాయ‌కులు గ‌తంలో చాలా మందే వ‌చ్చారంట‌.. అయితే ఎవ‌రూ రోడ్డు దిగి త‌మ గూడెంలోకి అడుగుపెట్టే సాహ‌సం మాత్రం చేయ‌లేదంట‌.. మ‌ట్టి వాస‌న న‌చ్చ‌కో, మ‌ట్టి మ‌నుషులు న‌చ్చ‌కో తెలియ‌దు గానీ., ఈ మ‌హానుభావుడికి ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రూ ఓటెయ్య‌లేదు.. అయినా క‌ష్టం వ‌చ్చింది బాబు అని పిల‌వ‌గానే ఇంటికి వ‌చ్చి మ‌రీ ప‌లుక‌రించాడంట‌.. వారి క‌ష్టాలు తెలుసుకున్నాడంట‌.. తాగు నీరు ఇవ్వండి బాబూ అని ద‌శాబ్దాల త‌ర‌బ‌డి వేడుకుంటున్నా, క‌నీసం మేమేం తాగుతున్నామో కూడా అతీప‌తీ క‌నుక్కున్న నాయ‌కుడు ఇంత వ‌ర‌కు క‌న‌బ‌డ లేదంట‌.. ఎక్క‌డో ఉండాల్సినోడు ఎక్క‌డికో వ‌చ్చి, మా పొలం గ‌ట్టెక్కాడు.. మా నీటి గ‌డ్డ‌లు చూసి, గుక్కెడు నీటి కోసం మేం ప‌డుతున్న క‌ష్టాన్ని చూశాడు.. మా క‌ష్టాలు తీరుస్తాన‌ని హామీ ఇచ్చాడు..

టీవీల్లో కూర్చుని ఏళ్ల‌కు ఏళ్లు పెద్ద పెద్ద క‌బుర్లు చెప్పే నాయ‌కులు ఎవ్వ‌రూ మాకేం చేసింది లేదు.. రోడ్డు దిగి మమ్మ‌ల్ని ప‌లుక‌రించినోడూ లేడు.. అందుకే నేను.. నా ఊరు మొత్తం ఈ మ‌హానుభావుడికే ఓటేస్తా.. ఈయ‌న ఖ‌చ్చితంగా మా క‌ష్టాలు తీరుస్తాడ‌న్న న‌మ్మ‌కం.. మా కోసం ఏదో ఒక‌టి చేస్తాడ‌న్న న‌మ్మ‌కం ఉంది.. ఏ ప్ర‌భుత్వ వ‌చ్చినా, ఏ పెద్దోళ్లు వ‌చ్చి అడిగినా అదే చెబుతాం..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వ్య‌క్తిత్వం, ప్ర‌జ‌లు క‌ష్టాల్లో ఉంటే స్పందించే గుణం, ఆయ‌న వ‌స్తే ప్ర‌జ‌ల‌కు ఏదో ఒక‌టి చేస్తాడ‌న్న న‌మ్మ‌కం.. ఎక్క‌డో మారు మూల కొండ‌ల్లో నాగ‌రిక‌త ఎరుగ‌ని పెద్దావిడ‌కి వ‌చ్చింది.. అయ్యా ముఖ్య‌మంత్రిగారి పుత్ర లోకేష్‌బాబూ, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఏం చేస్తున్నారో., ఏం మాట్లాడుతున్నారో.. వాళ్ల‌కి క్లియ‌ర్‌గా అర్ధం అయ్యింది.. మీకెప్పుడు అర్ధం అవుతుందో మ‌రి..

Share This:

1,448 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − four =