Home / ఎడిటోరియల్స్ / జ‌న‌సేనుడి ఆరేళ్ల ఆదాయం 75 కోట్లు.. క‌ట్టిన ప‌న్ను 25 కోట్లు.. నిజాయితీకి నిలువెత్తు నిద‌ర్శ‌నం..

జ‌న‌సేనుడి ఆరేళ్ల ఆదాయం 75 కోట్లు.. క‌ట్టిన ప‌న్ను 25 కోట్లు.. నిజాయితీకి నిలువెత్తు నిద‌ర్శ‌నం..

చిత్ర‌సీమ‌లో ఆయ‌నది నంబ‌ర్ వ‌న్ స్థానం.. రాజ‌కీయాల్లో కోట్లాది మంది ప్ర‌జ‌ల‌ గుండెల చ‌ప్పుడు.. కానీ ఆయ‌న సామాన్యుడు.. స్టార్ హోదా తెచ్చిపెట్టే కోట్ల రూపాయిల ఎండార్స్‌మెంట్ల‌కి ఆయ‌న దూరం.. ఒక్క మాట‌తో ప్ర‌జ‌ల తీర్పుని ప్ర‌భావితం చేయ్య‌గ‌ల స‌త్తా ఉన్నా., రాజ‌కీయాలతో వ‌చ్చే రాచ‌రిక సుఖాల‌కీ ఆయ‌న దూరం.. ఇక్క‌డ ఎవ‌రి గురించి చెబుతున్నార‌న్న విష‌యం వేరే విడ‌మ‌ర్చి చెప్ప‌న‌వ‌స‌రం లేక‌పోయినా., చెప్పాల్సిందే.. జ‌న‌సేనాని అని జ‌నం ముద్దుగా పిలుచుకునే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విష‌య‌మే ఇది.. ఇటీవ‌ల మీడియాతో చిట్‌చాట్‌లో త‌నపై ఐటీ దాడులు చేయించార‌ని ఆయ‌న చెప్పిన విష‌యం తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నంగా మారింది.. జ‌న‌సేన అధినేత‌పై ఐటీ దాడులు ఎవ‌రు చేయించారు అనే విష‌యాన్ని పక్క‌న‌పెడితే., ఆయ‌న ఆదాయం.. ఆస్తులు., జ‌న‌సేనుడు క‌డుతున్న టాక్స్‌ల వివ‌రాలు మాత్రం అంద‌ర్నీ సంబ్ర‌మాశ్చ‌ర్యాల‌కు గురిచేస్తున్నాయి..

జ‌న‌సేన అధినేత మాత్రం తాను ఏదైతే చెబుతారో అదే తూచా త‌ప్ప‌కుండా పాటిస్తారు.. ఒక మ‌నిషి బ‌త‌క‌డానికి అవ‌స‌ర‌మైనంత మాత్ర‌మే సంపాదిస్తే చాలు.. అంత‌కు మించి ఉంటే ఎదుటివారికి సాయ‌ప‌డ‌డానికి దాన్ని ఖ‌ర్చు చేసేయాలి.. ఇది ఆయ‌న సిద్ధాంతం.. అందుకు త‌గ్గ‌ట్టే ఒక స్టార్‌., ఓ జ‌నం మొచ్చిన లీడ‌ర్‌గా తాను., త‌న వ‌ద్ద ప‌నిచేస్తున్న వారి జీతాల‌కు స‌రిప‌డా మాత్రం తాను సంపాదిస్తే చాలు అన్న‌ట్టు ఉంది ఆయ‌న తీరు..
అవును గ‌డ‌చిన ఆరేళ్ల‌లో ఆయ‌న సంపాద‌న కేవ‌లం 75 కోట్ల రూపాయిలు.. అంటే ఓ స్టార్ హీరో ఏడాది సంపాద‌న‌లో స‌గం కంటే త‌క్కువ‌.. ఓ త‌ల‌పండిన రాజ‌కీయ నాయ‌కుడి సంపాద‌న‌లో ఎన్నోవంతో అంద‌రికీ తెలిసిందే.. పైగా అందులో 1/3 వంతు అంటే 25 కోట్లు ప్ర‌త్య‌క్షంగానో., ప‌రోక్షంగానో ప‌న్నుల రూపంలో ప్ర‌భుత్వానికి చెల్లించేస్తున్నారు.. ఆరేళ్ల కాలంలో ఆయ‌న‌కి మిగిలింది 50 కోట్ల రూపాయిలు..

జ‌న‌సేన అధినేత ప్ర‌తి అడుగులో నిజాయితీ, మాట‌లో నిబ‌ద్ద‌త కొట్టొచ్చిన‌ట్టు క‌న‌బ‌డ‌తాయి అన‌డానికి ఈ ఆదాయ వివ‌రాలు కూడా ఒక ఉదాహ‌ర‌ణ‌.. ఎందుకంటే కోట్ల సంపాద‌న‌కు అవ‌కాశం ఉన్నా., త‌న‌కు ఇది స‌రిపోతుంది అని స‌రిపెట్టుకునే త‌త్వం ఈ రోజుల్లో ఎంత మందికి ఉంటుంది.. అందుకే ఆయ‌న స్టార్ రూపంలో ఉన్న సామాన్యుడు..

Share This:

8,222 views

About Syamkumar Lebaka

Check Also

ఓట్ల మాయంపై రోడ్డెక్కిన జ‌నసేన‌.. మా ఓటు-మా హ‌క్కు అంటూ నిర‌స‌న‌..

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. ఓ వైపు ఎన్నిక‌ల సంఘం ప్ర‌తి నెలా డ్రైవ్‌లు పెట్టి మరీ 18 సంవ‌త్స‌రాలు నిండిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

four × two =