Home / ఎడిటోరియల్స్ / జ‌న‌సేనుడి పాద‌యాత్ర‌పై ప‌చ్చ ప్ర‌భుత్వం కుట్ర‌.. జ‌న‌ప్ర‌భంజ‌నంతో పార‌ని పాచిక‌..

జ‌న‌సేనుడి పాద‌యాత్ర‌పై ప‌చ్చ ప్ర‌భుత్వం కుట్ర‌.. జ‌న‌ప్ర‌భంజ‌నంతో పార‌ని పాచిక‌..

జ‌నం డ‌బ్బుతో ఏర్పాటు చేసిన భారీ స్టేజీ.. సెట్టింగులు.. 50 వేల‌కు పైగా ఖాళీ కుర్చీలు.. జ‌నం లేక వెల‌వెల బోయిన ప్రాంగ‌ణం.. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కి పైసా కూడా ఉప‌యోగం లేని ఈ కార్య‌క్ర‌మం కోసం ఉద‌యం నుంచి బెజ‌వాడ బెంజ్ స‌ర్కిల్ కూడ‌లిని బంద్ చేసేశారు.. జ‌నం ఇబ్బందుల్ని ప‌క్క‌న‌పెట్టి వాహ‌నాల రాక‌పోకల్ని ఇష్టారాజ్యంగా మ‌ళ్లించేశారు.. ఆఖ‌రికి అత్య‌వ‌స‌ర స‌ర్వీసులని కూడా అడ్డుకున్న ప‌రిస్థితి.. జ‌నం కంటే ఖాకీలు ఎక్కువ‌గా క‌న‌బ‌డిన ఈ కార్య‌క్ర‌మానికి అంత హ‌డావిడి చేయ‌డం ఎందుకంటే ప్ర‌జ‌ల‌కి ప‌నికిరాని కార్య‌క్ర‌మ‌మే అయినా స్వ‌యానా ప్ర‌భుత్వాధినేత పాల్గొన్న కార్య‌క్ర‌మం క‌ధా..

మొన్న‌టికి మొన్న ఒంటిమిట్ట‌లో వ‌డ‌గండ్ల వాన‌లో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల్ని గంట‌ల త‌ర‌బ‌డి నిలిపేసిన ఘ‌ట‌న‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పాద‌యాత్ర అన‌గానే గుర్తుకు వ‌చ్చిన సైకిల్ యాత్రకి ర‌హ‌దారులు పూర్తిగా దిగ్బంధించేశారు..

క‌ట్ చేస్తే.. అదే బెంజ్‌స‌ర్కిల్.. ప్ర‌త్యేక హోదా విష‌యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి కేంద్ర-రాష్ట్ర ప్ర‌భుత్వాలు చేసిన న‌మ్మ‌క ద్రోహానికి నిర‌స‌న‌గా రాష్ట్ర ప్ర‌జ‌ల త‌రుపున చేప‌ట్ట త‌ల‌పెట్టిన పాద‌యాత్ర‌.. కోట్లాది మంది అభిమానుల మ‌ద్ద‌తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌ల‌పెట్టిన పాద‌యాత్ర‌.. జాతీయ ర‌హ‌దారిపై పాద‌యాత్రకు ముంద‌స్తుగానే అన్ని అనుమ‌తులు తీసుకున్నారు కూడా.. మ‌ద్ద‌తుగా ఉద‌యం నుంచే వేల సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తున్న జ‌న ప్ర‌భంజ‌నం.. ముందుగానే మోహ‌రించిన ఖాకీలు.. పాల‌కుల ఆదేశాలను తూచా త‌ప్ప‌కుండా పాటించేశారు.. అన్ని వేల మంది ఒక్క చోట చేరినా ఎక్క‌డా నామ‌మాత్ర‌పు భ‌ద్ర‌తా చ‌ర్య‌లు కూడా చేప‌ట్ట‌లేదు.. క‌నీసం ట్రాఫిక్‌ని కూడా మ‌ళ్లించ‌క‌పోగా, వస్తున్న జ‌నాన్ని అదుపు చేసే ప్ర‌య‌త్నాలు చేశారు..

జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ బ‌య‌టికి వ‌స్తున్నారంటే., ఆయ‌న‌కి మ‌ద్ద‌తుగా త‌ర‌లివ‌చ్చే జ‌నాన్ని కంట్రోల్ చేయ‌డం ఎంత క‌ష్ట‌మో అందిరికీ తెలిసిన విష‌య‌మే.. స్వ‌యంగా ఆయ‌న రంగంలోకి దిగే స‌మ‌యంలో కూడా పోలీసులు జ‌నాన్ని అదుపు చేయ‌క‌పోగా, ట్రాఫిక్ మ‌ళ్లించే ప‌నిలో నిమ‌జ్ఞ‌మ‌య్యారు.. చివ‌రికి ఆయ‌న స్వీయ భ‌ద్ర‌త‌ను ప‌క్క‌న‌పెట్టి జ‌నం మ‌ధ్య‌కు వ‌చ్చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.. జ‌న‌సేన అధినేత‌కి చుట్టు ప‌క్క‌ల ఆయ‌న వ్య‌క్తిగ‌త సిబ్బంది మిన‌హా ఎవ్వ‌రూ పోలీసులు క‌న‌బ‌డ‌ని ప‌రిస్థితి., ప‌చ్చ స‌ర్కారు ఆదేశాల‌కు అద్దం ప‌డుతోంది..

ప్ర‌జ‌ల ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కేవ‌లం ర‌హ‌దారికి ఒక వైపు మాత్ర‌మే త‌న పాద‌యాత్ర‌ని ప‌రిమితం చేసేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.. పాద‌యాత్ర చివ‌ర్లో వామ‌ప‌క్ష నేత‌లు, జ‌న‌సేనాని సంయుక్తంగా జ‌నాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్న స‌మ‌యంలోనూ పోలీసులు పూర్తిగా ట్రాఫిక్‌ని వ‌దిలేసి క‌వ్వింపు చ‌ర్య‌ల‌తో కార్య‌క‌ర్త‌ల స‌హ‌నాన్ని ప‌రీక్షించారు.. జ‌న‌సేన అధినేత త‌మ ఎదురుగా ఉన్న స‌మ‌యంలో ఎలాంటి ఇబ్బందుల‌నైనా త‌ట్టుకునే స‌హ‌నం త‌మ సొంత‌మ‌ని చాటి చెప్పిన కార్య‌క‌ర్త‌లు పూర్తి నిబ‌ద్ద‌త‌తో కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేశారు..

ఇదంతా ఒక ఎత్త‌యితే., మీడియాలో ఓ వ‌ర్గం పూర్తిగా పాద‌యాత్ర‌ను క‌వ‌రేజ్‌ను ప‌క్క‌న‌పెట్టేసి, పార్ల‌మెంటు సాక్షిగా గ‌త కొద్ది రోజులుగా సాగుతున్న హైడ్రామాకే ప్రాముఖ్య‌త నిచ్చింది.. కేవ‌లం ఒక‌టి రెండు న్యూస్ చాన‌ళ్లు మాత్ర‌మే జ‌న‌సేనుడి పాద‌యాత్ర‌ను క‌వ‌ర్ చేశాయి.. మీడియా చూపుతున్న ప‌క్ష‌పాత ధోర‌ణిని ఓ సీనియ‌ర్ పాత్రికేయుడు స్వ‌యంగా లైవ్‌లో ప్ర‌స్థావించ‌డం ప‌రిస్థితిని తెలియ‌చెప్పింది.. అదీ ప‌చ్చ మీడియా అని సంబోధించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది..

దీంతో ప‌చ్చ ప్ర‌భుత్వ పాచిక‌లు ఎక్క‌డా ఫ‌లితాన్నివ్వ‌లేదు.. ప్ర‌జ‌లు అంతా నిశితంగా గ‌మ‌నిస్తూనే ఉన్నారు.. ప్ర‌జాశ్రేయ‌స్సుకి వ్య‌తిరేకంగా సాగుతున్న కుట్ర‌ల‌పై ఓ క‌న్నేసి ఉంచారు.. ఇలాంటి కుట్ర‌ల‌న్నింటికీ బుద్ది చెప్పే రోజు కోసం వెయిట్ చేస్తున్నారు.. కాచుకోండి..

Share This:

6,657 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twelve − 2 =