Home / జన సేన / జ‌న‌సేనుడి మ‌హా పాద‌యాత్ర‌కు స‌ర్వం సిద్ధం.. అష్ట‌దిగ్బంధ‌నానికి జ‌న‌సైన్యం రెఢీ..

జ‌న‌సేనుడి మ‌హా పాద‌యాత్ర‌కు స‌ర్వం సిద్ధం.. అష్ట‌దిగ్బంధ‌నానికి జ‌న‌సైన్యం రెఢీ..

ప్ర‌త్యేక హోదా-విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంలో కేంద్ర ప్ర‌భుత్వం చేసిన న‌మ్మ‌క ద్రోహానికి నిర‌స‌న‌గా జ‌న‌సేన‌-వామ‌ప‌క్షాలు సంయుక్తంగా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన మ‌హా పాద‌యాత్ర‌కు స‌ర్వం సిద్ధం అయ్యింది.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పిలుపు మేర‌కు ఉద‌యం నుంచి జాతీయ ర‌హ‌దారుల‌పై న‌డిచేందుకు ఆంధ్ర‌ప్ర‌దేశ్ వ్యాప్తంగా ఆ పార్టీ కార్య‌క‌ర్త‌లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. జిల్లాలు, మండ‌లాల‌తో పాటు గ్రామ స్థాయిలో కామ్రేడ్‌ల‌ను స‌మ‌న్వ‌య ప‌రుచుకుంటూ ముందుకి రోడ్లెక్కేందుకు రెఢీ అంటున్నారు.. ఉద‌యం 10 గంట‌ల‌ నుంచి జ‌న‌సైనికులు, వామ‌ప‌క్షాల నాయ‌కుల‌తో ర‌హ‌దారులు నిండిపోనున్నాయి.. జ‌న‌సేనాని ఆదేశాల మేర‌కు శాంతియుత నిర‌స‌నల‌ సెగ ఢిల్లీని తాకేలా ఆందోళ‌న‌లు చేప‌ట్టేందుకు జ‌న‌సైనికులు స‌మాయ‌త్తం అవుతున్నారు..

జ‌న‌సేనుడు ఉద‌యం 10 గంట‌లకి బెంజ్ స‌ర్కిల్ నుంచి ప‌దం క‌ల‌ప‌నుండ‌గా., ఆయ‌న‌కి తోడుగా, ఆయ‌న అడుగులో అడుగు వేసేందుకు వేలాది మంది సిద్ధం అవుతున్నారు.. ఇక ఈ మ‌హాపాద్ర యాత్రని ఓ వ‌ర్గం మీడియా చిన్న చూపు చూస్తున్నా., సోష‌ల్ మీడియా అదే సామాజిక మాధ్య‌మాల్లో మాత్రం వైర‌ల్‌గా మారింది.. జ‌న‌సేన శ‌త‌గ్ని టీం రూపొందించిన ఓ ఫొటోని ట్యాగ్ చేస్తూ ఇచ్చాపురం నుంచి త‌డ వ‌ర‌కు చిత్తూరు నుంచి హిందూపురం వ‌ర‌కు ఉన్న జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు మొత్తం రోడ్ల‌పైకి వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌య్యారు..

విజ‌య‌వాడ ప‌రిసర జిల్లాల జ‌న‌సైనికులంతా పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి మ‌ద్ద‌తుగా బెజ‌వాడ చేరుకునేందుకు రెడీ అవుతున్నారు.. ఎక్క‌డ ఎవ‌రు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఛ‌లో బెంజ్ స‌ర్కిల్ అంటూ క‌థం తొక్కుతున్నారు.. శుక్ర‌వారం ఉదయం ఓ జ‌న‌ప్ర‌వాహం ఒక‌రి వెనుక ఒక‌రు అడుగులు వేసుకుంటూ జాతీయ ర‌హ‌దారిపై వామ‌ప‌క్షాలు, జ‌న‌సేన అధినేతల‌తో క‌ల‌సి మ‌హా పాద‌యాత్రగా క‌ద‌ల నుంది..

పాద‌యాత్ర స‌మ‌యంలో పాటించాల్సిన జాగ్ర‌త్త‌లను ఇప్ప‌టికే జ‌న‌సేన పార్టీ విడుద‌ల చేసింది.. ఈ క్రింది ఫోటోలో ఉన్న జాగ్ర‌త్త‌ల‌ను రోడ్ల‌పై పాద‌యాత్ర‌లు చేప‌ట్టే ప్ర‌తి జ‌న‌సేన కార్య‌క‌ర్త త‌ప్ప‌క పాటించాల్సి ఉంటుంది.. ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా, శాంతియుతంగా పాద‌యాత్ర‌ను విజ‌య‌వంతంగా పూర్తి చేసేందుకు ఈ జాగ్ర‌త్త‌లు ఉప‌యోగ‌ప‌డతాయి..

Share This:

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనకి కామ‌న్ సింబ‌ల్(లాంత‌ర్) అనే ప్ర‌చారం అబ‌ద్దం.. పార్టీ శ్రేణులు న‌మ్మ‌వ‌ద్దు..

జ‌న‌సేన పార్టీ శ్రేణుల‌ని గంద‌ర‌గోళానికి గురి చేసేందుకు ప్ర‌త్య‌ర్ధులు రోజుకో కొత్త ప్ర‌య‌త్నంతో ముందుకి వ‌స్తున్నారు.. జ‌న‌సేన పార్టీకి ప్ర‌ధాన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − 8 =

%d bloggers like this: