Home / పవన్ టుడే / జ‌న‌సేనుడి వాడికి ప‌చ్చ‌..ప్ర‌తిప‌చ్చాల మ‌ల్ల‌గుల్లాలు.. తెర‌వెనుక భాగోతంపై స‌త్య‌”కాల‌మ్‌”.!!!

జ‌న‌సేనుడి వాడికి ప‌చ్చ‌..ప్ర‌తిప‌చ్చాల మ‌ల్ల‌గుల్లాలు.. తెర‌వెనుక భాగోతంపై స‌త్య‌”కాల‌మ్‌”.!!!

న‌క్క‌జిత్తుల వ్యూహాలు.. వెన్నుపోటు రాజ‌కీయాలు నెర‌ప‌డంలో ఖాక‌లు తీరిన వీరులు.. వారి అనుంగ మీడియా.. జ‌న‌సేనుడి వేడికి తాడ‌లేక వ‌ళ్లు వాడి ప‌క్క‌న‌ప‌డ్డాయి.. ఇప్పుడు మేక‌పోతు గాంభీర్యాలతో ఘీంక‌రించే ప్ర‌య‌త్నాలు చేస్తూ.. తెర‌ముందు ప్ర‌య‌త్నాలు, తెర‌వెనుక కుటిల మంత్రాగాల‌కి ప‌దును పెడుతూనే ఉన్నాయి.. అయితే ప్ర‌తి చ‌ర్యా బూమ్‌రాంగ్ కావ‌డంతో ఇప్పుడు ఏం చేస్తున్నాయి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల‌పై సీనియ‌ర్ పాత్రికేయ విశ్లేష‌ణ‌.. తెర‌వెనుక‌-ముందు..

తెర వెనుక: ముందొచ్చిన చెవులకంటే వెనుకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్లు, ప్రశ్నిస్తాను అని వచ్చిన జనసేనుడు మన దొరల కుర్చీకే ఎసరు పెట్టేటట్టు ఉన్నాడు. ఇంతింతై వటుడింతై అన్నట్లు నానాటికి పెరుగుతూ, దూసుకుపోతున్న ప్రచండ పవనాలను ఆపుచేసే శక్తి మీడియా తెరలకు సన్నగిల్లుతున్నది. ఇంకెన్ని విష ప్రచార ప్రయోగాలు చెయ్యాలి? మావల్లకాదేమో అంటూ కమ్మని పచ్చ దొడ్డ దొరల కుల సమావేశములో మారుమోగుతున్న మీడియా అధిపతుల “పచ్చ విలాపాలు”… దొరల, ముసుగుయోధుల, మీడియా అధిపతుల రోదనలు వినలేక తలలు పట్టుకొని కన్నీళ్లను దిగమింగుకొంటున్న దొరల పార్టీల ఇద్దరు అధినాయకులు.

తెర ముందు: పోటుగాడు వస్తున్నాడు చూడు అన్నట్లు అన్న వచ్చి పార్టీని అమ్మేసి పోయాడు. ఇంక తమ్ముడు మిగిలిపోయాడు. ఏదో కోతుల సేన అంట. ఆ పార్టీకి జండా లేదు అజెండా లేదు. అయినా దొరల పార్టీల ముందు కోతుల పార్టీ నిలబడగలదా అంటూ నిరంతర మీడియా ప్రచారాలు. జనాలు రావడంలేదు అంటే సోషల్ మీడియాగాళ్ళు ఒప్పుకోరు. ఎదో పాతకాలపు ఆరోపణలే కొనసాగించాలి. పిల్లకాయలకేమి తెలుసు ఉండీలు దెబ్బ అన్నట్లు పిల్లల పార్టీకేమి తెలుసు, దొరల వైభోగము అంటూ దొరలను కీర్తిస్తూ, జనసేనుడిని అణచివేస్తూ మీడియా అధిపతుల కమ్మని తేనే పూసిన దొడ్డ ప్రచారాలు.

తెర వెనుక: అధికారము కోసము ఇప్పటివరకు అణచివేయబడ్డ కులాల్లో ఒకరినొకరిని కలవకుండా, వారిలోవారే కొట్టుకు చచ్చేలా మన దొరల పార్టీలు పాలసీలు తీసికొస్తూ మోసము చేస్తూ నెట్టుకొస్తున్నాము. వాల్ల కాళ్లమీద వాల్లు నిలబడకుండా, పరాన్నజీవులుగా దొరల మీదే ఆధారపడేటట్లు చేస్తూ మన అధికారము జారిపోకుండా కాపాడుకొంటూ వస్తున్నాము. నిన్నటివరకు మన పచ్చని దొడ్డ మీడియా చెప్పిందే వేదం. పాడిందే రాగము అన్నట్లు సాగింది. నేడు అణచివేయబడ్డ వర్గాల్లో వచ్చిన చైతన్యము, దూసుకుపోతున్న సోషల్ మీడియా, జనసేనుడి అండతో మన పచ్చని దొడ్డ మీడియా నిచ్చేష్టురాలై పోతున్నది. మన కుర్చీ జనసేనుడికి జారిపోయేటట్లు ఉన్నది అంటూ కమ్మని పచ్చ దొడ్డ దొరల కుల సమావేశములో మారుమోగుతున్న మీడియా అధిపతుల “పచ్చ రోదనలు”…

తెరముందు: కులాలను కలుపుతాను అంటూ, కులమీటింగులు పెడతాడు ఏమిటండి ఈ జనసేనుడు. బీసీలకు రిజర్వేషనులు పెంచుతాను అంటాడు. అగ్రవర్ణాలవారి కోసము ప్రత్యేక కార్పొరేషన్ అంటాడు. ఎస్సీ, బీసీ, కాపులకోసం రాజ్యాంగ సవరణకు పోరాటం చేస్తాను అంటాడు. ఇవన్నీ మా దొరల పార్టీలను తెలియదనుకొంటున్నాడా. అయినా పిల్ల కాకికి ఏమితెలుసు ఉండీలు దెబ్బ అన్నట్లు జనసేనుడికి ఏమి తెలుసు. జండా లేదు, అజెండా అంతకన్నా లేదు. స్పష్టత లోపించింది అంటూ అణచివేయబడ్డ వర్గాల పార్టీ అయిన జనసేనుడిపై తమ కమ్మని తేనెపూసిన దొడ్డ ఆరోపణలు కొనసాగిస్తారు. రాజ్యాధికారం దొరల వద్దనే ఉంటుంది అనే స్పష్టత దొరలకు లోపిస్తున్నదని చెప్పరు.

తెరవెనుక: ఎన్ని అణచివేత చర్యలు చేపెట్టిన, ప్రహ్లాదుడిలా తట్టుకొంటూ, గోకులంలో కృష్ణుడిలా పెరుగుతూ పోతున్నాడు. ఇక “హింసమామల” భరతమే మిగిలివుంది. ఇలాగైతే కమ్మని దొడ్డ దొరల మనుగడ కష్టం. ఏదోవిధంగా జనసేనుడిని అణచివేయాలి. ఎంత ఖర్చు అయినా పరవాలేదు అంటూ తమ వర్గ పార్టీల ఆదేశాలు మేరకు, కుల ప్రముఖుల విజ్ఞప్తి మేరకు తల గోకుంటూ బయటకొసున్న మీడియా అధిపతులు…

తెరముందు: జనసేనుడు చెప్పింది నిజమే. కులాలను కలపాలి. కానీ అది పార్టీ పెట్టే కలపాలా ఏమిటి? కుర్చీలు మోస్తూ కూడా కులాలను కలపవచ్చు. అయినా జనసేనుడి పార్టీకి స్పష్టత లేదు. జండా, అజెండా అంత కన్నా లేదు. మనుగడ కష్టము అంటూ ముసుగు మేధావులతో చర్చలు మొదలు పెడతారు. ఎలెక్షనుకోక పార్టీతో గడిపే చంద్రలోకాదీసుడుని, నేటి ఎలెక్షనుకి ఇద్దరితో (బీజేపీ, కాంగ్రెస్)తో గడపబోతున్న చంద్రలోకాధీశుడిని వదిలేసి, మూడు పెళ్లిళ్లు అంటూ జనసేనుడిపై పాత ఆరోపణలే కొనసాగిస్తారు.

జనసేనుడు పార్టీ ఉంటే, భవిషత్తులో తమ పచ్చని, దొడ్డ దొరల మనుగడ కష్టము అనేది మీడియా అధిపతుల, వారి అనుంగ జర్నలిస్టుల నుదుటిపై వస్తున్న జీరలను చూస్తే అర్ధము అవుతుంది. కానీ “సత్యమేవ జయతే” అన్నదానికి “ఆ”సత్యామే వజయతే” అని చెప్పగలిగే దొరల మీడియా ఉన్న రోజులివి. జనసేనుడా బహు పరాక్!!! బహు పరాక్!!!

Share This:

5,446 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one + one =