Home / పవన్ టుడే / జ‌న‌సేనుడి ”షో”తో జ‌న‌సంద్ర‌మైన ఇఛ్చాపురం ర‌హ‌దారులు..

జ‌న‌సేనుడి ”షో”తో జ‌న‌సంద్ర‌మైన ఇఛ్చాపురం ర‌హ‌దారులు..

img-20170103-wa0131 img-20170103-wa0163

ఎవ్వ‌రికీ ఒక్క బిర్యానీ ప్యాకెట్ ఇవ్వ‌లేదు.. వంద నోటూ., మందు సీసా ఇవ్వ‌లేదు.. అయినా ఇసుక రాల‌నంత‌గా ఇఛ్చాపురం ర‌హ‌దారులు జ‌నంతో నిండిపోయాయి.. రోడ్డంతా పూల వ‌ర్షంతో త‌డిసి ముద్ద‌య్యింది.. జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాకే అందుకు కార‌ణం.. జ‌న‌సేనుడిపై జ‌నం గుండెల్లో గుడిక‌ట్టుకున్న అభిమానం ఇలా ఉప్పెన‌గా మారి., ఉవ్వెత్తున ఎగిసి ప‌డింది.. స్వ‌త‌హాగా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రోడ్ షోలు లాంటి వాటికి వ్య‌తిరేకి అయినా., త‌న‌ను చూడాల‌నుకుంటున్న జ‌నం కోసం ఓకే చెప్పారు.. ఉద్దానం కిడ్నీ బాధితుల ప‌రామ‌ర్శ అనంత‌రం కొద్దిదూరం రోడ్ షో నిర్వ‌హించేందుకు ఒప్పుకున్నారు.. జ‌న‌సేనాని త‌మ జిల్లాకి వ‌స్తున్నార‌ని తెలుసుకున్న సిక్కోలు వాసులు., విశాఖ నుంచి ఇచ్చాపురం వెళ్లే క్ర‌మంలో ర‌హ‌దారికి ఇరువైపులా నిల‌బ‌డి ఆయ‌న‌కి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.. పూల వ‌ర్షం కురిపించారు..

img-20170103-wa0168 img-20170103-wa0164

ఇంత మంది జ‌నం వ‌చ్చినా., జ‌న‌సైనికుల్లో అడుగ‌డుగునా క్ర‌మ‌శిక్ష‌ణ ఉట్టిప‌డింది.. అది జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నుంచి అల‌వ‌ర్చుకున్న‌దే.. ఓ నాయ‌కుడు జ‌నం ముందుకి రావాలంటే., డ‌బ్బిచ్చి మ‌రీ జ‌నాన్ని త‌ర‌లించాలి., వేదిక నిండాలి.. అంత వ‌ర‌కు ఎన్ని గంట‌లైనా ఎండ‌న‌క‌., వాన‌న‌క జ‌నం నిలువుకాళ్ల‌పై నిల‌బ‌డాల్సిందే.. అయితే ఇలాంటి సంస్కృతికి తిలోద‌కాలిచ్చారు జ‌న‌సేనాని.. ప‌బ్లిక్ మీటింగ్ అయినా., ప్ర‌యివేటు ప్రోగ్రాం అయినా., టైం అంటే టైమే.. ఇన్ని గంట‌ల‌కు స్టేజి పైకి వ‌స్తాన‌ని మాటిస్తే., ఒక నిమిషం ముందే వ‌చ్చేస్తారు.. అంతా షెడ్యూల్ ప్ర‌కారం కార్య‌క్ర‌మం పూర్త‌యిపోతుంది.. కిడ్నీ బాధితుల్ని క‌లుస్తారు అంటే., వానిరి ఓ టెంట్ వేసి దాని కింద కూర్చోబెట్ట‌లేదు.. ఏసీ థియెట‌ర్‌లో కూర్చోబెట్టారు.. టైంకి వ‌చ్చారు.. తాను వినాల్సింది విన్నారు.. ఏం చేస్తారో కూడా చెప్పి కార్య‌క్ర‌మాన్ని రెండు గంట‌ల్లో ముగించేశారు.. ఈ టైమింగే ఆయ‌న్ని లీడ‌ర్‌ని చేశాయి.. ఇదే క్ర‌మ‌శిక్ష‌ణ ఆయ‌న అభిమానులు, జ‌న‌సైనికులు కూడా పాటించేలా చేశాయి…

img-20170103-wa0167

ఇచ్చాపురం రోడ్ షో సంద‌ర్బంగా జ‌న‌సేనాని అభిమానులంతా ఎవ‌రికి వారుగా స్వీయ నియంత్ర‌ణ చేసుకున్నారు.. ఆయ‌న కాన్వాయ్ చుట్టూ అంత మంది ఉన్నా తోసుకోలేదు, తొక్కుకోలేదు.. జై ప‌వ‌ర్‌స్టార్ అన్న నినాదాలు మిన‌హా అక్క‌డ మ‌రేం విన‌బ‌డ‌లేదు.. ద‌టీజ్ ప‌వ‌ర్‌స్టార్ ఫ్యాన్స్‌., ద‌టీజ్ జ‌న‌సైన్యం అని చాటి., త‌మ‌ను విమ‌ర్శించే వారి నోటికి తాళాలు వేశారు.. దీన్ని జీర్ణించుకోవ‌డం విమ‌ర్శ‌కుల‌కే కాదు., పొలిటిక‌ల్ ప్ర‌త్య‌ర్ధుల‌కి కూడా కాస్త క‌ష్ట‌మైన పనే., కానీ త‌ప్ప‌దు.. ఈ జ‌నం నిజం., ఈ అభిమానం నిజం. ఈ స్పంద‌న నిజం., ఇది 2019లో ప్ర‌త్య‌ర్ధుల పీఠాలు కూక‌టి వేళ్ల‌తో పీకేసేది నిజం..

 

Share This:

About Syamkumar Lebaka

Check Also

JANASENA PARTY guidelines to party activists

1. Address respectfully. Do not engage in personal abuses during the debates, even when provoked. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty − 5 =

%d bloggers like this: