Home / ఎడిటోరియల్స్ / జ‌న‌సేనుడు అడిగిన లెక్కలు ఎక్క‌డ‌..? కేంద్ర‌-రాష్ట్రాల‌కి పెట్టిన డెడ్‌లైన్ మ‌రికొద్ది గంట‌ల్లో ముగుస్తోంది..

జ‌న‌సేనుడు అడిగిన లెక్కలు ఎక్క‌డ‌..? కేంద్ర‌-రాష్ట్రాల‌కి పెట్టిన డెడ్‌లైన్ మ‌రికొద్ది గంట‌ల్లో ముగుస్తోంది..

విభ‌జ‌న హామీలు, రాష్ట్రానికి ద‌క్కాల్సిన నిధుల వ్య‌వ‌హారంలో కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల భిన్న వాద‌న‌ల నేప‌ధ్యంలో., ఎవ‌రు చెప్పేది నిజం.. ఎవ‌రిమాట అబ‌ద్దం అన్న విష‌యాన్ని ప్ర‌జ‌ల ముందు ఉంచేందుకు జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ క‌నుగున్న ఫార్ములా JFC(Joint Fact Finding Committee).. కేంద్రం ఇప్పటికే చాలా నిధులు ఇచ్చామంటుంది.. రాష్ట్రం ఇవ్వ‌లేదంటోంది.. కేంద్రం ఇచ్చిన‌వాటికి లెక్క‌లు కావాలంటుంది.. రాష్ట్రం మ‌రిన్ని నిధులు కావాలంటుంది.. ఈ మాటల్లో నిజానిజాలు ఏంట‌నే విష‌యం తేల్చేందుకు రాజ‌కీయాల‌కి అతీతంగా ఈ క‌మిటీని ఏర్పాటు చేశారు జ‌న‌సేనాని.. JFC విధివిదానాలు కూడా దాదాపు ఖ‌రారు చేశారు.. ఇన్నాళ్లు నోటి లెక్క‌ల‌తో ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్న ప్ర‌భుత్వాల అస‌లు స్వ‌రూపాన్ని అదే ప్ర‌జ‌ల ముందు ఉంచాల‌న్న‌దే జ‌న‌సేనుడి టార్గెట్‌..

JFC(Joint Fact Finding Committee)కి సంబంధించి ఇద్ద‌రు ముఖ్య స‌భ్యుల‌తో చ‌ర్చ‌ల అనంత‌రం., ఎవ‌రి లెక్క ఏంటో స‌మ‌ర్పించాల‌నే డిమాండ్‌ను మీడియా ముఖంగా ఇరు ప్ర‌భుత్వాల ముందు ఉంచారు.. అందుకు ఫిబ్ర‌వ‌రి 15వ తేదీ డెడ్‌లైన్ కూడా పెట్టారు.. 15వ తేదీ లోపు విభ‌జ‌న హామీల్లో ఎన్ని అమ‌లు చేశారు..? ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ఎంత ఇచ్చారు అనే అంశంపై ఇరు ప్ర‌భుత్వాల నుంచి శ్వేత‌ప‌త్రం విడుద‌ల చేయాలని ప‌వ‌న్ కోరారు.. లేదా JFC(Joint Fact Finding Committee)కి లెక్క‌లు చెప్పినా ప‌ర్వాలేద‌ని తెలిపారు.. అప్పుడు ఎవ‌రి లెక్క ఏంటో JFC నిర్ధారిస్తుంద‌న్న‌ది జ‌న‌సేన అధినేత అభిప్రాయం.. నిజంగా ఇచ్చి ఉంటే ఆ లెక్క‌లు చెప్ప‌డానికి కేంద్రానికి గానీ, పుచ్చుకున్నా, పుచ్చుకోకున్నా., కేంద్రం నుంచి వ‌చ్చిన సాయం ఇంతే అని చెప్ప‌డానికి రాష్ట్ర ప్ర‌భుత్వానికి ఉన్న అభ్యంత‌రం ఏంటో అర్ధం కాని విష‌యం.. ఐదు కోట్ల ఆంధ్రులే కాదు.. తెలంగాణ ప్ర‌జ‌ల్లో కూడా ఇదే అంశంపై విస్తృతంగా చ‌ర్చ సాగుతోంది..

మీ పాల‌న‌లో ఖ‌చ్చితంగా పార‌ద‌ర్శ‌క‌త ఉంటే., ప్ర‌జ‌ల‌కి నిజాలు చెప్ప‌డానికి వ‌చ్చిన ఇబ్బంది ఏంటి..? ప్ర‌జ‌ల ఓట్ల‌తో గ‌ద్దెనెక్కిన మీరు ఆ ప్ర‌జ‌ల‌కి జ‌వాబుదారీ కాదా..? లేక లెక్క‌ల్లో ఏమైనా భారీగా అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయా..? జ‌రిగితే ఆ అవ‌క‌త‌వ‌క‌లు ఎక్క‌డ జ‌రిగాయి..? ఏపీలో అవినీతి పెచ్చుమీరింద‌న్న ఏజెన్సీల మాట‌లు వాస్త‌వ‌మేనా..? ఇలాంటి ఆలోచ‌న‌ల‌న్నీ జ‌నాన్ని తొలిచేస్తున్నాయి.. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై ఓ వినూత్న పోరాటానికి జ‌న‌సేనాని రెడీ అయ్యారు.. కేంద్ర‌-రాష్ట్ర ప్ర‌భుత్వాల గెలుపులో త‌న భాగ‌స్వామ్యం కూడా ఉంది కాబ‌ట్టి., త‌నకి తాను ప్ర‌జ‌ల‌కి జ‌వాబుదారీగా భావిస్తున్నారు.. ఇరు ప్ర‌భుత్వాల వాద‌న‌ల‌కి సంబంధించి వాస్త‌వాలు ప్ర‌జ‌ల‌కి తెలియ‌జేయాల‌నుకుంటున్నారు.. ప్ర‌భుత్వాలు-పాల‌న అంటే ప్ర‌జ‌ల‌కి అర్ధంకాకుండా చేసేదేం కాదుగా.., ప్ర‌జ‌ల సొమ్ముపై ప్ర‌జ‌ల‌కి లెక్క చెప్పేందుకు మీకొచ్చిన ఇబ్బందులు ఏంటి..?

ఒక‌వేళ జ‌న‌సేన అధినేత ఇచ్చిన గ‌డువులోపు లెక్క‌లు ఇవ్వ‌కుంటే., ఎవ‌రి లెక్క‌లు ఎలా తేల్చాలో ఆయ‌న‌కి భాగా తెలుసు.. ప్ర‌జ‌లు కూడా ఈ విష‌యంపై గ‌ట్టి న‌మ్మ‌కంతోనే ఉన్నారు.. JFCకి స‌హ‌క‌రిస్తే స‌రి., లేకుంటే లెక్క‌లు రాబ‌ట్టేందుకు మ‌రో విధానం కూడా జ‌న‌సేన అధినేత వ‌ద్ద ఉంది.. ప్ర‌జ‌ల ముందు మీ నిజాయితీ నిరూపించుకోవాలంటే., స్వ‌యంగా మీరే లెక్క‌లు చెబితే బాగుంటుంది.. ప్ర‌జ‌లు కూడా మీ నొటి ఉంచే వినాల‌ని కోరుకుంటున్నారు.. లేదంటే మీరు చెప్పేవ‌న్నీ అబ‌ద్దాలేన‌ని ఫిక్స్ అయిపోతారు మ‌రి..

డెడ్‌లైన్ ఫిబ్ర‌వ‌రి 15 ముగిసేందుకు మ‌రికొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది.. మీరేమో ప్ర‌జ‌ల్ని ఇంకే మోసం చేద్దామ‌నుకుంటున్నారో అర్ధం కావ‌డం లేదు.. అర్ధిక రంగ అధికారుల మ‌ధ‌నం అనంత‌రం ముఖ్య‌మంత్రి తేల్చిన లెక్క 16 వేల కోట్ల పైచిలుకు సాయం మాత్ర‌మే కేంద్రం నుంచి అందాల‌ని చెబుతున్నారు.. కేంద్రం అది కూడా కాదు అంటోంది.. ఇంత‌కీ ప్ర‌త్యేక ప్యాకేజీ అంటే అంతేనా..? మ‌రి బీజేపీ అధ్య‌క్షుడు అమిత్‌షా చెప్పిన ల‌క్ష కోట్లకు పైగా నిధుల మాటేంటి.. అది కేవ‌లం మాటేనా.. కేవ‌లం నాలుగు వేల కోట్ల కోసమే కొట్లాట అయితే., వివిధ స‌ద‌స్సుల్లో ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు రాబ‌ట్టామ‌ని చెబుతున్న రాష్ట్రానికి అది పెద్ద మేట‌ర్ కాదుగా..?

ఇవ‌న్నీ ఒక ఎత్త‌యితే., పార్ల‌మెంటులో మ‌న ఎంపిలు యుద్ధం చేసి సాధించిన కోట్ల సాయానికి ఇక్క‌డ బ్యాండు బాజాలు.. జ‌నం చూసి న‌వ్విపోతారు అన్న జ్ఞానం కూడా లేని వీరు నాయ‌కులు ఎలా అయ్యారో కూడా అర్ధంకాని ప‌రిస్థితి.. అయితే ఇవ‌న్నీ ప్ర‌స్తుతం ఎవ‌రికీ అవ‌స‌రం లేదు.. ఆయ‌న ఓ స‌మ‌స్య లేవ‌నెత్తితే కోట్ల మందికి చేరుతుంది.. ఇప్పుడు ఆయ‌న అడిగిన ప్ర‌శ్న కూడా కోట్ల మందికి చేరింది.. మీకు ఖ‌చ్చిత‌మైన జ‌వాబుదారీ త‌నం ఉంటే., జ‌న‌సేనానికి లెక్క‌లు చెప్పండి.. లేదంటే అదే కోట్లాది మంది ముందు మీ భండారాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి.. పాల‌కులారా ఈ హెచ్చ‌రిక మీకే.. మీలో నిజాయితీ నిరూపించుకోండి..

Share This:

2,059 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 + 16 =