Home / పవన్ టుడే / జ‌న‌సేనుడ్ని క‌ల‌సిన అమ‌రావతి, పోల‌వ‌రం రైతులు.. అండ‌గా ఉంటాన‌ని ప‌వ‌న్ భ‌రోసా..

జ‌న‌సేనుడ్ని క‌ల‌సిన అమ‌రావతి, పోల‌వ‌రం రైతులు.. అండ‌గా ఉంటాన‌ని ప‌వ‌న్ భ‌రోసా..

18-01-2017-press-meet-selected-pictures-2

జ‌నం కోస‌మే పుట్టిన జ‌న‌సేనాని.. నిత్యం ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు.. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ప్ర‌తి స‌మ‌స్య‌కు ప‌రిష్కార మార్గాలు అన్వేషిస్తున్నారు.. సావ‌దాన దండోపాయాల‌ను ప్ర‌యోగించి., పాల‌కుల్ని లొంగ‌దీస్తున్నారు.. ముందుగా స‌మ‌స్య‌పై క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేయ‌డం., దానికి ప‌రిష్కార మార్గాలు ప్ర‌భుత్వం ముందు ఉంచ‌డం.. ప‌రిష్క‌రిస్తారా..? లేదా..? అంటూ ప్ర‌శ్నించ‌డం.. సానుకూలంగా స్పందించ‌కుంటే., ప్ర‌జ‌ల త‌రుపున పోరాటానికి సిద్ద‌ప‌డ‌డం.. అయితే ప్ర‌త్యేక హోదా అంశంపై మిన‌హా., అన్ని స‌మ‌స్య‌ల విష‌యంలో జ‌న‌సేనుడ్ని విజ‌య‌మే వ‌రించింది.. దీంతో నిత్యం జ‌న‌సేన పార్టీ కార్యాల‌యానికి చేరే స‌మ‌స్య‌ల చిట్టా పెరుగుతూ వ‌స్తోంది.. తాజాగా రాజ‌ధాని అమ‌రావ‌తి ప్రాంత నిర్వాసిత రైతులు, పోల‌వ‌రం నిర్వాసిత రైతులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని క‌లిసి త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు.. త‌మ‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతోందంటూ ఆయ‌న ఎదుట క‌న్నీరుమున్నీరుగా విల‌పించారు..

18-01-2017-press-meet-selected-pictures-1

అమ‌రావ‌తి ప్రాంతంలో లంక గ్రామాల‌యిన ఉద్దండ‌రాయుని పాలెం, లింగాయ‌పాలెం, తాళ్లాయ‌పాలెం, వెంక‌టాయపాలెం, ఉండ‌వ‌ల్లి త‌దిత‌ర గ్రామాల్లో 3, 500 ఎక‌రాల‌కు పైగా భూమిని ప్ర‌భుత్వం సేక‌రించింది.. ఇక్క‌డ ఉన్న అసైన్డ్ భూముల్లో గ‌తంలో ద‌ళితుల‌కి ప్ర‌భుత్వం ప‌ట్టాలు ఇచ్చింది.. నాలుగు త‌రాలుగా వీరు సాగుకూడా చేసుకుంటున్నారు.. అంతా ఎక‌రం, అరెకరం ఉన్న స‌న్న‌,చిన్న‌కారు రైతులే.. అయితే ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకున్న భూముల‌కు సంబంధించి న‌ష్ట‌ప‌రిహారం చెల్లించే విష‌యంలో తాము తీవ్ర‌మైన వివ‌క్ష‌కు గుర‌వుతున్నామ‌న్న‌ది ద‌ళిత రైతుల ఆరోప‌ణ‌.. ప్ర‌భుత్వం సేక‌రించిన భూముల‌కి ఏడాదికి 50 వేల కౌలు, 1450 గ‌జాల స్థ‌లం ఇస్తామ‌ని హామీ ఇచ్చింది.. అయితే త‌మ‌కు మాత్రం 600 గ‌జాలు మాత్ర‌మే ఇస్తామంటున్నార‌ని రాజ‌ధాని ప్రాంత రైతులు ప‌వ‌న్ ఎదుట వాపోయారు.. అదీ లాట‌రీ ప‌ద్ద‌తిలో కాక‌., ఇష్టం వ‌చ్చిన చోట ఇస్తామంటున్నార‌ని.. తాము ఇంత‌టి వివ‌క్ష బ్రిటీష్ కాలంలో కూడా చూడ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.. రాజ‌ధాని భూములు ఇచ్చి కూడా తాము ఊరిచివ‌రి బ‌తుకులే బ‌త‌కాలా అని ప్ర‌శ్నించారు.. జ‌న‌సేనాని వ‌ద్ద‌కు వ‌స్తే., న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కంతో వ‌చ్చామ‌ని., త‌మ గ్రామాల‌కు వ‌చ్చి త‌మ‌కు న్యాయం జ‌రిగేలా చూడాల‌ని ద‌ళిత రైతులు ప‌వ‌న్‌ని కోరారు..

18-01-2017-press-meet-selected-pictures-3

రాజ‌ధాని ప్రాంత రైతుల దుస్థితి ఇది.. అయితే పోల‌వ‌రం శివారు మూల‌లంక గ్రామ‌ రైతుల స‌మ‌స్య మ‌రోర‌కం..గ్రామంలోని 207 ఎక‌రాలు బ‌ల‌వంతంగా అన్యాక్రాంతం అయ్యాయి.. ఇందులో 148 మంది చిన్న‌రైతుల‌కి చెందిన ఈ పొలాల్లో పోల‌వ‌రం నిర్మాణంలో భాగంగా త‌వ్విన మ‌ట్టిని డంప్ చేస్తున్నారు.. వాస్త‌వానికి ఈ మ‌ట్టిని డంపింగ్‌కి కేటాయించిన 400 ఎక‌రాల బీడులో కుమ్మ‌రించాలి.. అయితే ర‌వాణా ఖ‌ర్చులు క‌లిసి వ‌స్తాయ‌ని కాంట్రాక్ట‌ర్లు., రైతుల భూములు నాశ‌నం చేస్తున్నారు.. ఇదేం అన్యాయం అని ప్ర‌శ్నిస్తే., దిక్కున్న‌చోట చెప్పుకోమంటున్నారు.. క‌నీసం న‌ష్ట‌ప‌రిహారం అడిగినా., మాట్లాడటం లేదు.. క‌లెక్ట‌ర్‌, మంత్రి ఎవ‌ర్ని క‌లిసినా ప్ర‌యోజ‌నం క‌లుగ‌లేద‌ని మూల్లంక రైతులు ఆరోపించారు.. మీరే న్యాయం జ‌రిగేలా చూడాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని వేడుకున్నారు..

18-01-2017-press-meet-selected-pictures-618-01-2017-press-meet-selected-pictures-8

ఇరు ప్రాంతాల రైతుల స‌మ‌స్య‌లు సావ‌ధానంగా విని., వారిచ్చిన విన‌తి ప‌త్రాలు ప‌రిశీలించిన ఆయ‌న‌., అభివృద్ది-ప్ర‌జాసంక్షేమం రెండూ జ‌న‌సేన‌కు రెండు క‌ళ్ల‌లాంటివ‌న్నారు.. అభివృద్ది ప‌నులు ఆగ‌కూడ‌ద‌ని., అదే స‌మ‌యంలో ప్ర‌జ‌లకు న‌ష్టం జ‌ర‌క్కూడ‌ద‌ని జ‌న‌సేనాని అభిప్రాయ‌ప‌డ్డారు.. వృత్తుల వ‌ల్ల ఏర్ప‌డిన మ‌న కుల వ్య‌వ‌స్థ‌, ప్ర‌భుత్వాలు తీసుకునే అనాలోచిన నిర్ణ‌యాల వ‌ల్ల‌., మూలాలు కోల్పోతోంద‌న్నారు.. ఇలాంటి ప‌రిస్థితులు కులాల కుమ్ములాట‌లు రేపే అవ‌కాశం ఉంద‌న్నారు.. ప్ర‌భుత్వాలు నిర్ణ‌యాలు తీసుకునే ముందు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌ని జ‌న‌సేనాని సూచించారు.. రైతుల గోడు విన్న ఆయ‌న‌., వారికి అండ‌గా ఉంటానాని హామీ ఇచ్చారు.. సంబంధిత మంత్రులతో చ‌ర్చించి న్యాయం జ‌రిగేలా చూస్తాన‌ని హామీ ఇచ్చారు.. ఇరుప్రాంతాల రైతుల స‌మ‌స్య‌ల‌పై పార్టీలో చ‌ర్చించి., త‌న రాక అవ‌స‌రం అనుకుంటే రెండు ప్రాంతాల్లో ప‌ర్య‌టిస్తాన‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హామీ ఇచ్చారు..

ప‌వ‌న్ హామీతో పుట్టెడు దుఃఖంతో జ‌న‌సేన కార్యాల‌యం త‌లుపు త‌ట్టిన నిర్వాసిత రైతులు., జ‌న‌సేన‌డి భ‌రోసాతో త‌మ‌కు న్యాయం జ‌రుగుతుంద‌న్న న‌మ్మ‌కంతో వెనుదిరిగారు..

Share This:

1,321 views

About Syamkumar Lebaka

Check Also

పెనుగొండ‌ని శ్రీ వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ‌గా మారుస్తాం-జ‌న‌సేనాని..

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పెనుగొండ ఊరి పేరును ‘శ్రీ వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ’గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × four =