Home / జన సేన / జ‌న‌సేన‌కు జై కొడుతున్న ”కోన‌”సీమ తీర‌ప్రాంత యువ‌త‌..

జ‌న‌సేన‌కు జై కొడుతున్న ”కోన‌”సీమ తీర‌ప్రాంత యువ‌త‌..

img-20161225-wa0106 img-20161225-wa0107

కుల‌, మ‌త‌, వ‌ర్గ‌, ప్రాంతీయ విబేధాల‌కు అతీతంగా ఆవిర్భ‌వించిన పార్టీ జ‌న‌సేన‌.. పార్టీ అధినేత ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ త‌న తొలి ప్ర‌సంగం నుంచి ప్ర‌తి చోట చెప్పేది అదే.. చేసేదీ అదే.. పార్టీలో మాకు ప్రాధాన్య‌త ఉంటుందా అన్న అనుమానంతో వ‌చ్చే ప్ర‌తి ఒక్క‌రు., జ‌న‌సేనాని ఆద‌ర‌ణ చూశాక ఫిదా అయిపోతున్నారు.. ఆయ‌న్ని క‌లిసిన వాని అనుభ‌వాలు ఇవి.. మ‌రి జ‌న‌సేనానిని క‌ల‌వ‌లేని వారి ప‌రిస్థితో.. ఊహ తెలిసిన నాటి నుంచి వారంతా తెర‌పై ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హీరోయిజాన్నీ., రియ‌ల్ లైఫ్‌లో నిజాయితీతో కూడిన ఆయ‌న ఆశ‌యాల‌ను ఆరాధిస్తూ పెరిగారు.. ప‌వ‌న్ జ‌న‌సేన పార్టీ స్థాపించిన నాటి నుంచి ఆ జెండాని మోస్తున్నారు కూడా.. అయితే త‌మ‌కు పార్టీలో చోటు ఉంటుందా..? ఏదో మూల చిన్న అనుమానం.. అయితే ఆ అనుమానాన్ని ప‌టాపంచ‌లు చేసింది ముమ్మిడివ‌రం నియోజ‌క‌వ‌ర్గంలోని కాట్రేనికోన మండ‌లంలో జ‌రిగిన జ‌న‌సేన ఔత్సాహికుల స‌మావేశం..

img-20161225-wa0111 img-20161225-wa0112

కోన‌సీమ కోస్తా ప్రాంతంలో యువ‌త కుల‌,మ‌త‌, వ‌ర్గ విభేదాల‌కు అతీతంగా జ‌న‌సేన‌కు జై అంటున్నారు.. తీర ప్రాంతంలో పార్టీ జెండాను రెప‌రెప‌లాడిస్తున్నారు.. ఇక్క‌డ పార్టీ ఔత్సాహికుల సంఖ్య ఊహించ‌ని స్థాయిలో ఉంది.. అయితే అంద‌రిలో పార్టీ త‌మ‌ను గుర్తిస్తుందా అన్న అనుమానం కూడా ఉంది.. ఆదివారం కాట్రేనికోన వేదిక‌గా జ‌రిగిన ఔత్సాహికుల భేటీ ఆ అనుమానాన్ని మాయం చేసింది.. మండ‌లం చుట్టుప‌క్క‌ల గ్రామాల నుంచి భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌చ్చిన ఔత్సాహికులు., జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌, పార్టీ కోసం తాము ఎలాంటి త్యాగానికైనా సిద్దంగా ఉన్న‌ట్టు తెలిపారు.. మూరుమూల ప‌ల్లెల్లో పార్టీని బ‌లోపేతం చేసేందుకు త‌మవంతు కృషి చేస్తామ‌ని హామీ ఇచ్చారు.. ఓ వ‌ర్గం, ఓ కులం అన్న తేడాల‌కు అతీత‌మైన పార్టీ జ‌న‌సేన అన్న విష‌యాన్ని చాటాల్సిన అవ‌స‌రాన్ని ఇక్క‌డ యువ‌త ప్ర‌స్తావించారు..

ప్రజా స‌మ‌స్య‌ల‌పై పార్టీ శ్రేణులు దృష్టి సారించాల్సిన అవ‌రాన్ని ప‌లువురు ప్ర‌స్తావించ‌గా., పార్టీ త‌రుపున పోరాటం చేయాల్సిన ప‌రిస్థితులు ఉంటే., అంతా క‌లిసి చ‌ర్చించి ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడే విష‌యంలో వెనుక‌డుగు వేయ‌రాద‌ని ప‌లువురు సూచించారు.. దీంతో పాటు బూత్ స్థాయిలో వాలంటీర్ల నియామ‌కం., పార్టీ బ‌లోపేతానికి సంబంధించిన అంశాల కీల‌క చ‌ర్చ జ‌రిగింది..

 

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌జ‌ల్ని చంపే అభివృద్ది ఎవ‌రికోసం.. సోంపేట బాధితుల త‌రుపున జ‌న‌సేనుడి నిల‌దీత‌..

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పోరాట యాత్ర రెండో రోజు ఇచ్చాపురం నుంచి సోంపేట మీదుగా ప‌లాస‌కి చేరుకుంది.. సోంపేట చిత్త‌డి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × three =

%d bloggers like this: