Home / సేన సేవ / జ‌న‌”సేన‌”కు సేవే మార్గం.. రాజ‌ధాని అయినా.. రంప‌చోడ‌వ‌రం ఏజెన్సీ అయినా..

జ‌న‌”సేన‌”కు సేవే మార్గం.. రాజ‌ధాని అయినా.. రంప‌చోడ‌వ‌రం ఏజెన్సీ అయినా..

img-20161126-wa0007

ఆప‌ద‌లో ఉన్న‌వారిని ఆదుకోవ‌డ‌మే వారి మార్గం.. అదే ప‌వ‌న్ ఇజం.. అది ప‌ట్ట‌ణ‌మైనా, ప‌ల్లె అయినా, అడ‌వులు నిండిన ఏజెన్సీ ప్రాంత‌మైనా., అక్క‌డ జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమాని ఉన్నాడంటే అదో భ‌రోసా అంతే.. ఎందుకంటే ప‌వ‌న్‌ని అభిమానించే ప్ర‌తి ఒక్క‌రు ఆయ‌న పంధానే అనుస‌రిస్తారు.. ఎవ‌రికి ఏ క‌ష్ట‌మొచ్చినా అదుకునేందుకు ముందుంటారు.. అధికారం, డ‌బ్బు, కుల‌, మ‌త విభేదాలు జనసైనికుల‌ సేవ‌కు అతీతం.. త‌మ నాయ‌కుడి పుట్టిన‌రోజు వ‌చ్చింది పోస్ట‌ర్లు వేయాలి., బైక్‌ల‌తో ర్యాలీలు తీయాలి అనే అన‌వ‌స‌ర ఆలోచ‌న‌లను దూరంగా పెడుతున్న ప‌వ‌న్ అభిమానులు త‌మ‌కు ఉన్న‌దాన్లో సేవే మార్గంగా ఎంచుకుని దూసుకుపోతున్నారు.. న‌లుగురికీ స్పూర్తిగా నిలుస్తున్నారు..

img-20161126-wa0005

అలాంటి స్ఫూర్తి ప్ర‌ధాయ‌క‌మైన వార్త‌లు వింటే., అవి మ‌రికొంత మందిని సేవా కార్య‌క్ర‌మాల వైపు మ‌ళ్లిస్తాయి.. ప‌వ‌ర్‌స్టార్ అభిమానుల‌కి ఎల్ల‌లు లేవు.. అది రాజ‌ధాని న‌గ‌రం అయినా ఏజెన్సీ ప్రాంతం రంప‌చోడ‌వ‌రం అయినా ఒక‌టే.. ట్రీట్‌మెంట్‌లో మాత్రం తేడా ఉండ‌దు.. అదే రంప‌చోడ‌వ‌రం డివిజ‌న్‌లో ఓ మారు మూల ప‌ల్లెకు చెందిన బిక్కిన‌ వెంక‌ట‌ర‌మ‌ణ అనే జ‌న‌సైనికుడు., త‌న కొద్ద‌పాటి సంపాద‌న‌లో చేస్తున్న సేవా కార్య‌క్ర‌మాలు అంద‌ర్నీ ఆశ్చ‌ర్య చ‌కితుల్ని చేస్తున్నాయి.. త‌మ దేవుడి జ‌న్మ‌దినం అయితే ఆసుప‌త్రిలో రోగుల‌కి బ్ర‌డ్ల‌తో పాటు పాలు, ప‌ళ్లు పంచ‌డం., ర‌క్త‌దాన శిభిరాలు నిర్వ‌హించ‌డ‌మే కాదు.. ఆప‌ద‌లో ఉన్న అభాగ్యుల‌కి త‌న వంతు సాయం చేయ‌డంలో కూడా ముందుంటాడు.. ఇటీవ‌ల క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డుతున్న ఓ బాలుడికి జ‌న‌సేన యూత్ త‌రుపున 12 వేల రూపాయిల ఆర్ధిక సాయం అంద‌జేశాడు..

img-20161128-wa0015img-20161128-wa0016ప‌వ‌న్‌టుడే ఇత‌న్ని ప‌లుక‌రించిన‌ప్పుడు ప‌లు ఆశ్చ‌ర్య‌క‌ర విష‌యాలు వెలుగు చూశాయి.. ఈ ప‌వ‌న్ భ‌క్తుడు ఆస్తిప‌రుడూ కాదు, ఉద్యోగ‌స్తుడూ కాదు.. చ‌దువు సంధ్య‌లూ లేవు.. ఓ చిన్న‌పాటి ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ నిర్వాహ‌కుడు.. అందులో వ‌చ్చిన ఆదాయాన్ని రూపాయి రూపాయి కూడ‌బెట్టి., త‌న గాడ్ జ‌న‌సేనాని పేరిట న‌లుగురికీ సాయం చేస్తున్నాడు.. ఉన్న‌వాడు చేసే సాయంలో గొప్పేముంది.. మారుమూల ఏజెన్సీ ప్రాంతంలో ఓ చిరు వ్యాపారికి జ‌న‌సేనాని స్ఫూర్తి అయ్యాడంటే.. అది చెప్పుకోవాల్సిన విష‌య‌మే..

ఇంత‌కీ వెంక‌ట‌ర‌మ‌ణ ఎయిమ్ ఏంటో తెలుసా..? త‌న గాడ్‌ని క‌ల‌వ‌డ‌మే.. అంతేకాదు పోల‌వ‌రం ముంపు ప్రాంతాల్లో ఉన్న త‌మ వారి వెత‌లు ఆయ‌న‌కి వివ‌రించాల‌ని కూడా ఉందంట‌.. ఓ సారి జ‌న‌సేనాని నోటి వెంట త‌మ ముంపు ప్రాంతాల మాట వ‌స్తే., త‌మ‌కు ఏదో న్యాయం జ‌రుగుతుంద‌ని ఆత‌ని న‌మ్మ‌కం.. ఇలాంటి జ‌న‌సేవ‌కుల్ని ప్రోత్స‌హించాల్సిందే మ‌రి..

Share This:

1,297 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేవ‌కి క‌దిలిన జ‌న‌సైన్య‌పు స‌మూహం.. విశాఖ తీరంలో భ‌క్తుల‌కి ప్ర‌సాద విత‌ర‌ణ‌..

మార్పు రావాలంటే ఓ స‌మూహం ఒక్క‌టై ముందుకి క‌ద‌లాలి.. నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేయాలి.. అప్పుడే ఎంత‌టి క‌ష్ట‌మైన ప‌నిలో అయినా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

8 − five =