Home / జన సేన / జ‌న‌”సేన‌”కు సేవే మార్గం.. అదే ప‌వ‌న్ ”ఇజం”..

జ‌న‌”సేన‌”కు సేవే మార్గం.. అదే ప‌వ‌న్ ”ఇజం”..

15055750_531423480401196_4505078102337100457_n

క‌ష్టాల్లో ఉన్న వారిని చూస్తే ఆ క‌ళ్లు చెమ‌రుస్తాయి.. ఆక‌లితో ఉన్న వారిని చూస్తే., ఆ క‌డుపు మండుతుంది.. సమ‌స్య‌తో ఉన్న ప్ర‌జ‌ల్ని చూస్తే., ప‌రిష్కారం వైపు ఆయ‌న మ‌న‌సు సై అంటుంది.. అందుకోసం ఎలాంటి పోరాటానికైనా రెఢీ అంటుంది .. ఆయ‌న రాజైతే.. మ‌రి ఆయ‌న సైన్యం ఎలా ఉంటుంది.. సేవే మార్గంగా ముందుకి సాగుతుంది.. ఈ ల‌క్ష‌ణాల‌న్నీ పుణికిపుచ్చుకున్న రాజు జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అయితే., సేవే మార్గంగా ముందుకు సాగుతోంది జ‌న‌సైన్యం.. ర‌క్త‌దానాలు, అన్న‌దానాలు లాంటి సేవా కార్య‌క్ర‌మాలు సేన‌కు నిత్య‌కృత్యం.. ఇవే కాదు ఎక్క‌డ ఎవ‌రు ఏ స‌మ‌స్య‌లో ఉన్నా., అక్క‌డ వాలిపోవ‌డం., వారికి సాయం చేయ‌డం., బాధితుల క‌ళ్ల‌లో ఆనందం చూసి ఆనందించ‌డం వారికి అల‌వాటైపోయింది..

15135473_1291059590957815_1479898407_n 15139365_1291059574291150_924869814_n

ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య పెద్ద నోట్ల మార్పిడి., త‌మ వ‌ద్ద ఉన్న నోట్ల‌ను మార్చుకునేందుకు జ‌నం గంట‌ల త‌ర‌బ‌డి క్యూల్లో నిల‌బ‌డాల్సి వ‌స్తోంది.. ఈ క్యూ లైన్ల‌కు వ‌యోవృద్దులు, అత్య‌వ‌స‌రాలు ఉన్న‌వారు అన్న తేడా లేదు.. ఎవ‌రైనా నోట్లు మార్చుకునేందుకు గంట‌ల త‌ర‌బ‌డి బ్యాంకుల ముందు ప‌డిగాపులు కాయాల్సిందే.. అయితే ఇలాంటి ఆప‌న్నులకు సాయం చేసేందుకు జ‌న‌సైన్యం రంగంలోకి దిగింది.. ఐదేసి గంట‌ల పాటు బ్యాంకుల ముందు క్యూల్లో నిల‌బ‌డి., అలా మార్చిన డ‌బ్బును ఎమ‌ర్జెన్సీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి పంచుతోంది.. ఇదే ప‌వ‌నిజం అని చాటి చెప్పుతోంది..

ఆసుప‌త్రిలో ఉన్న త‌న భార్య‌కు మందులు కొనేందుకు బ‌య‌టికి వ‌చ్చి బ్యాంకు ఎదుట క్యూలో నిలుచున్న ఓ ముస్లిం సోద‌రుడి ఆవేద‌న‌ను తీర్చింది జ‌న‌సైన్యం.. త‌మ సాయానికి చెమ్మ‌గిల్లిన అత‌ని క‌ళ్లులో త‌మ నాయ‌కుడ్ని చూసి మురిసింది.. అలాగే క్యూలో నిల‌బ‌డ‌లేక ఇబ్బంది ప‌డుతున్న ఓ వృద్దుడికి., కాలేజీ ఫీజు ఆఖ‌రి రోజు స‌మ‌యం మించి పోతుంద‌న్న టెన్ష‌న్‌లో ఉన్న మ‌రో విద్యార్ధికి సేన సాయం చేసింది.. తమ క‌ష్టంతో ఎదుటివారి బాధ‌లు తీర్చి., ఆనందం పొంద‌మ‌న్న త‌మ సేనానే త‌మ‌కు స్ఫూర్తి అంటోంది.. సేన‌కు సేవే మార్గం మ‌రి..

Share This:

597 views

About Syamkumar Lebaka

Check Also

క‌వాతు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కాదు.. బాధ్య‌త‌గా ఉండ‌మ‌ని హెచ్చ‌రిక‌-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ క‌వాతు సూప‌ర్ స‌క్సెస్‌తో ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతుంటే., జ‌న‌సేనాని మాత్రం త‌న బాధ్య‌త‌ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × four =