Home / జన సేన / జ‌న‌సేన‌లోకి మాదాసు గంగాధ‌రం.. ఆవిర్భావ దినోత్స‌వ ప‌ర్య‌వేక్ష‌కుడిగా బాధ్య‌త‌లు..

జ‌న‌సేన‌లోకి మాదాసు గంగాధ‌రం.. ఆవిర్భావ దినోత్స‌వ ప‌ర్య‌వేక్ష‌కుడిగా బాధ్య‌త‌లు..

జ‌న‌సేన పార్టీ నిర్మాణం ఏ స్థాయిలో ఉంటుంది.. అంతా యువ‌కులు, అనుభ‌వం లేని కార్య‌క‌ర్త‌లు.. ఇదేనా పార్టీ అన్న వారికి స‌మాధానాలు దొరికే రోజులు ద‌గ్గ‌ర‌ప‌డ్డాయా..? జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వేసే అడుగులు ప్ర‌త్య‌ర్ధుల గుండెల్లో ద‌డ పుట్టిస్తున్నాయా..? ప‌వ‌న్ పుట్టిస్తున్న ప్ర‌కంప‌న‌ల‌తో అదే ప‌రిస్థితులు క‌న‌బ‌డుతున్నాయి.. పార్టీకి సంబంధించి కొన్ని ప‌ద‌వులు ప్ర‌క‌టించాక‌., సుధీర్ఘ విరామం త‌ర్వాత నిర్మాణ ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా.,ప్ర‌త్య‌ర్ధుల పాలిట శ‌రాఘాతాలుగా మారాయి.. ఇప్ప‌టికే మాజీ ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, మేధావులు జ‌న‌సేన కోట‌రీలో ద‌ర్శ‌న‌మివ్వ‌గా., ఇప్పుడు అస‌లు నాయ‌కుల తెరంగేట్రం మొద‌లైంది.. తాజాగా మాజీ ఎమ్మెల్సీ , నెల్లూరు జిల్లాకి చెందిన నాయ‌కుడు మాదాసు గంగాధ‌రం జ‌న‌సేన తీర్దం పుచ్చుకున్నారు.. ప్ర‌స్తుతం ఏపీసీసీ ఉపాధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్న ఆయ‌న‌., శుక్ర‌వారం పార్టీ అధినేత స‌మ‌క్షంలో సేన‌లో చేరారు.. ఆ వెంట‌నే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు..

సుధీర్ఘ‌కాలం ప్ర‌జాజీవితం గ‌డ‌పిన మాదాసుకి., నిబ‌ద్ద‌త గ‌ల నాయ‌కుడిగా పేరుంది.. రెండు ద‌ఫాలు ఎమ్మెల్సీగా ప‌నిచేసినా పూర్తి స‌మ‌యం ప్ర‌జాసేవ‌కే కేటాయించారు.. ఆయ‌న్ని ఎప్ప‌టి నుంచే పార్టీలోకి ర‌మ్మ‌ని జ‌న‌సేనాని ఆహ్వానించ‌గా., ఇప్పుడు వ‌చ్చి పార్టీలో చేరారు.. జ‌న‌సేన పార్టీ కార్యాల‌యంలో అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పుష్ప‌గుచ్చం ఇచ్చి మ‌రీ పార్టీలోకి వెల్క‌మ్ ప‌లికారు..

మాదాసు గంగాధ‌రంతో త‌న‌ది 30 ఏళ్ల ప‌రిచ‌యం అని జ‌న‌సేన అధినేత తెలిపారు.. ఎమ్మెల్సీగా, ఎపీ పోలీస్ హౌసింగ్ కార్పొరేష‌న్ చైర్మ‌న్‌గా ప‌ని చేసిన అనుభ‌వం అయ‌న‌కున్న‌ట్టు చెప్పారు.. మాదాసు అనుభ‌వం, స‌ల‌హాలు, సూచ‌న‌లు పార్టీకి అవ‌స‌రం అని చాలా రోజులుగా ర‌మ్మ‌ని అడుగుతున్న‌ట్టు ప‌వ‌న్ స్ప‌ష్టం చేశారు.. ఇప్పుడు పార్టీలో చేరిన మాదాసుకు ఈ నెల 14న గుంటూరులో నిర్వ‌హించ త‌ల‌పెట్టిన ఆవిర్భావ దినోత్స‌వ మ‌హాస‌భ ప‌ర్య‌వేక్ష‌కులుగా బాధ్య‌త‌లు అప్ప‌గించిన‌ట్టు తెలిపారు..

ఏడాది కాలంగా క్రియాశీల రాజ‌కీయాల‌కి పూర్తిగా దూరంగా ఉన్న గంగాధ‌రం., అదే స‌మ‌యంలో జ‌న‌సేనాని త‌న‌ను పార్టీలోకి ర‌మ్మ‌ని ఆహ్వానించిన‌ట్టు చెప్పారు.. సెయింట్ జాన్స్ స్కూల్లో ప‌వ‌న్ చ‌దువుకునే రోజుల నుంచి ఆయ‌న‌తో త‌న‌కున్న అనుభ‌వాన్ని నెమ‌ర‌వేసుకున్నారు.. జ‌న‌సేనాని చిన్న‌త‌నం నుంచి ఎంతో నిబ‌ద్ద‌తో వ్య‌వ‌హ‌రించే వార‌ని., అదంటే త‌న‌కు ఎంతో ఇష్ట‌మ‌ని తెలిపారు.. తిరిగి జ‌నంలోకి రావాల‌న్న జ‌న‌సేనుడి పిలుపుతో పార్టీ గుమ్మం తొక్కిన‌ట్టు తెలిపిన ఆయ‌న‌., ఎలాంటి బాధ్య‌త‌లు అప్ప‌గించినా చేప‌ట్టేందుకు సిద్ధ‌మ‌ని., అభిమానుల‌తో కార్య‌క‌ర్త‌ల‌తో క‌ల‌సి ప‌నిచేసేందుకు సిద్ధంగా ఉన్న‌మ‌ని తెలిపారు.. ఇలాంటి త‌ల‌కాయ‌లు మ‌రో నాలుగైదు పార్టీ చేతిలో ప‌డితే., ప్ర‌త్య‌ర్ధుల‌కి ద‌బిడి దిబిడే..

Share This:

3,529 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

sixteen − five =