Home / జన సేన / జ‌న‌సేన‌లో చేరిక‌ల జోరు.. ఐదు జిల్లాల నుంచి అనుచ‌ర‌గ‌ణంతో క‌దిలి వ‌చ్చిన నేత‌లు..

జ‌న‌సేన‌లో చేరిక‌ల జోరు.. ఐదు జిల్లాల నుంచి అనుచ‌ర‌గ‌ణంతో క‌దిలి వ‌చ్చిన నేత‌లు..

జ‌న‌సేన బ‌లం రోజు రోజుకీ ఇంతై.. ఇంతింతై.. వ‌టుడింతై అన్న‌ట్టు పెరిగిపోతోంది.. అధికార పార్టీ కొక్కిరింపులు ఆ పార్టీకే బూమ్‌రాంగ్‌గా మారుతోంది. తెలుగు దేశం జెండాలు మోసిన నేత‌లు, కార్య‌క‌ర్త‌లు పెద్ద ఎత్తున జ‌న‌సేన‌లోకి క్యూ క‌డుతున్నారు.. పోరాట యాత్ర‌లో భాగంగా ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ప‌ర్య‌టిస్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో ఐదు జిల్లాలకి చెందిన వివిధ వ‌ర్గాల ప్ర‌ముఖులు, వివిధ పార్టీల నేత‌లు పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.. ఆయ‌న బ‌స చేసిన క్రాంతి క‌ళ్యాణ వేదిక‌లో అంద‌రికీ పేరు పేరునా స్వ‌యంగా కండువాలు క‌ప్పి మ‌రీ జ‌న‌సేనాని పార్టీలోకి ఆహ్వానించారు.. జ‌న‌సేన తీర్ధం పుచ్చుకున్న వారిలో ఎక్కువ మంది తెలుగు దేశం పార్టీ జ‌న్మ‌భూమి క‌మిటీల్లో ప‌ని చేసిన వారు ఉన్నారు.. వివిధ స్థాయిల్లో పార్టీ ప‌ద‌వులు అనుభ‌వించిన వారు ఉన్నారు.. టీడీపీ, వైసీపీల‌తో పాటు బీసీ కులాల నుంచి పెద్ద ఎత్తున నాయ‌కులు జ‌న‌సేన‌లో చేరారు.. వీరిలో మాజీ స‌ర్పంచుల‌తో పాటు తాజా స‌ర్పంచ్‌లు ఉండ‌డం గ‌మ‌నార్హం..

శుక్ర‌వారం పార్టీ తీర్ధం పుచ్చుకున్న వారి వివ‌రాల్లోకి వెళ్తే  ఏపీ 24*7 న్యూస్ ఛాన‌ల్ డైరెక్ట‌ర్ అంకెం ల‌క్ష్మీ శ్రీనివాస్‌తో పాటు పిఠాపురంకి చెందిన మాజీ రిటైర్డ్ ఛీఫ్ ఇంజినీర్ అనిశెట్టి సుబ్బారావు, ఎల్ఐసీ ఆఫ్ ఇండియాలో జోన‌ల్ ఆఫీస‌ర్‌గా ప‌నిచేసిన మందా కృపాక‌ర‌రావు, భీమ‌వ‌రంకి చెందిన ఎస్టీ మ‌హిళ మోడ్రెచ్ సుజాతా నాయ‌క్ , ఆఫ్ఘ‌నిస్థాన్ తెలుగు అసోసియేష‌న్ ప్రెసిడెంట్ పివివి రామ‌రాజు, పి.గ‌న్న‌వ‌రం మాజీ స‌ర్పంచ్ చుట్టుగుళ్ల ష‌ర్మిళా ర‌మణ, ఉంగుటూరుకి చెందిన ఘ‌ట్టెం రాధాకృష్ణ‌. ఆచంట‌కి చెందిన క‌ల‌గా ప్ర‌సాద్‌, రాష్ట్ర గౌడ క‌మిటీ స‌భ్యులు వై.వెంక‌ట‌నారాయ‌ణ‌, గౌడ క‌మిటీ ఎగ్జ‌కూటివ్ మెంబ‌ర్ అత్తిలి వెంక‌ట‌ర‌మ‌ణ‌, క‌డియంకి చెందిన వైసీపీ బీసీ సెల్ సెక్ర‌ట‌రీ దాస‌రి శేషు, డ‌బ్ల్యూజీ కేబుల్ ఛాన‌ల్ ఎండి చెన్న‌కేశ‌వుల రంగ‌నాథ్‌, దుర్గార‌మేష్‌, ఆర్‌టీఐ డెరెక్ట‌ర్‌, రాష్ట్ర బీసీ ఫెడ‌రేష‌న్ స‌భ్యులు మ‌ల్లాడి రాజు, ఆకుల ప్ర‌వీణ్‌కుమార్, వీరేష్ స‌త్య‌నారాయ‌ణ‌, కె. వ‌ర‌ల‌క్ష్మి, ఆర్‌టీఐ జిల్లా సెక్ర‌ట‌రీ, ఏపీ బీసీ సంఘం జిల్లా కార్య‌ద‌ర్శి, పెంకి ర‌వితేజ‌, స్టూడెంట్‌ జేఏసీ ప్రెసిడెంట్‌, సీర‌పు ఆదిల‌క్ష్మి, జ‌న్మ‌భూమి క‌మిటీ స‌భ్యురాలు, కాకినాడ‌, రాధిక‌ కాకినాడ జ‌న్మ‌భూమి క‌మిటీ స‌భ్యులు, దొండ‌పాటి దుర్గ‌, తెలుగు మ‌హిళ‌, లోవ‌రాజు, మ‌ల్లాడి రాజు, అనిశెట్టి అర్జ‌బాయి, క‌ర్నీడి శ్రీను, చొప్పెర్ల సునీల్, ఉంగ‌రాల వీర‌బాబు, కీర్తి చంటి, సోమిశెట్టి రాంబాబు, జున్నూరు కొండ‌య్య, బండారి వెంక‌టేశ్వ‌ర‌రావు, అయితాబ‌త్తుల వెంక‌ట‌కృష్ణారావు , అయితాబ‌త్తుల జ‌య, స‌ర్పంచ్‌, సాక రాంబాబు, న‌ర‌సాపురంకి చెందిన మ‌హిళా సంఘాల ప్రెసిడెంట్ జ‌డ్డు స్వాతి త‌దిత‌రులు ఉన్నారు.. పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు వెంట త‌ర‌లిరాగా, జ‌య‌జ‌య ధ్వానాల మ‌ధ్య వీరు జ‌న‌సేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు..

Advertisement.

Advertisement.

Share This:

2,158 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 + thirteen =