Home / జన సేన / జ‌న‌సేన అండ్ కో బంద్ దెబ్బ‌తో దిగివ‌చ్చిన రాష్ట్ర ప్ర‌భుత్వం.. టీడీపీ నిర్ణ‌యం వెనుక‌—?

జ‌న‌సేన అండ్ కో బంద్ దెబ్బ‌తో దిగివ‌చ్చిన రాష్ట్ర ప్ర‌భుత్వం.. టీడీపీ నిర్ణ‌యం వెనుక‌—?

జ‌న‌సేన‌, కాంగ్రెస్‌, వామ‌ప‌క్ష పార్టీల బంద్ దెబ్బ‌కి రాష్ట్ర ప్ర‌భుత్వం దిగివ‌చ్చింది.. పెట్రోల్‌, డీజిల్‌పై రాష్ట్రం బాదుడు నుంచి రెండు రూపాయిలు మిన‌హాయింపు ఇచ్చింది.. రోజు రోజు పెరుగుతున్న పెట్రోల్ ధ‌ర‌ల‌కు కుదేల‌వుతున్న సామాన్యుడికి ఇది ఊర‌టే అయినా., ప్ర‌భుత్వం న‌ష్టం భ‌రిస్తుంద‌న్న మాట మాత్రం అవాస్త‌వం.. ఇది ఖ‌చ్చితంగా కంటి తుడుపు చ‌ర్య మాత్ర‌మే.. విభ‌జ‌న అనంత‌రం రాష్ట్రం క‌ష్టాల్లో ఉంద‌న్న వంక‌తో గ‌త నాలుగేళ్లుగా చంద్ర‌బాబు స‌ర్కారు రాష్ట్ర ప్ర‌జ‌ల నుండి అద‌నంగా 4 రూపాయిల వ్యాట్‌ని ముక్కుపిండి మ‌రీ వ‌సూలు చేస్తోంది.. మామూలుగా పెట్రోల్ మీద వేసే 31 శాతం వ్యాట్‌కి, డీజిల్ మీద వేసే 22.25 శాతం వ్యాట్ కాకుండా ఇది ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నివ‌సిస్తున్న పెట్రో వినియోగ‌దారుల‌పై అద‌నంగా వేస్తున్న భారం.. ఇప్పుడు ఆ బాదుడు నుంచి రెండు రూపాయిలు త‌గ్గించి., ఆ న‌ష్టం ఏదో రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే భ‌రిస్తుంది అని చెప్ప‌డం ఖ‌చ్చితంగా జ‌నాన్ని మోసం చేయ‌డ‌మే..

ఇక బంద్ రోజు కూడా పెట్రో, డీజిల్ ధ‌ర‌లు య‌ధావిధిగా పెరుగుతూ వ‌చ్చాయి.. జ‌న‌సేన పార్టీ మ‌రియు కాంగ్రెస్‌-వామ‌ప‌క్షాలు చేప‌ట్టిన నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌ల‌తో పాటు అధికార తెలుగుదేశం పార్టీ కూడా పెట్రో మంట‌పై మ‌రో క‌ప‌ట నిర‌స‌న‌కి తెర‌తీసింది.. ఆ నాలుగు రూపాయిల సంగ‌తేంటో ముందు చెప్పండి అంటూ అడుగ‌డుగునా జ‌న‌సైనికులు ప్ర‌శ్న‌లు గుప్పించ‌డంతో., దిద్దుబాటు చ‌ర్య‌గా టీడీపీ స‌ర్కారు అద‌న‌పు దోపిడి నుంచి ఓ రెండు రూపాయిలు త‌గ్గించి., జ‌నం దృష్టిని పూర్తిగా కేంద్రం వైపు తిప్పే ప్ర‌య‌త్నం చేసింది.. అయితే ఇక్క‌డ ఇంకో రెండు రూపాయిల అద‌న‌పు భారం సంగ‌తి మాత్రం జ‌నం గ‌మ‌నించ‌ర‌న్న భ్ర‌మ‌లో భ్ర‌మ‌రావ‌తీధీసులు వున్న‌ట్టున్నారు.. ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్షాని సంగ‌తి వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు… ఊరంద‌రిది ఒక దారి అయితే ఉలిపిరిక‌ట్ట‌ది మ‌రో దారి అన్న చందంగా త‌యారైంది వైసీపీ.. కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీతో సంబంధాల నేప‌ధ్యాన్ని రుజువు చేస్తూ., అధికారం సాధించ‌డం మిన‌హా ప్ర‌జా సంక్షేమంతో త‌మ‌కి ప‌ని లేద‌ని చాటుత పెట్రో బంద్‌ని ఏకంగా బ‌హిష్క‌రించింది.. జ‌నం ఎట్టా పోతే మ‌న‌కెందుకు ., మ‌న‌కి సిఎం ప‌ద‌వి వ‌స్తే చాలు అంతేకదా..

ఉద్య‌మం కేంద్రానికి కుట్టినా, కుట్ట‌కున్నా రాష్ట్రానికి ఎంతోకొంత సెగ తాకింది.. మ‌రి కింక‌ర్త‌వ్యం.. కేంద్రంపై మ‌రింత ఒత్తిడి పెంచేలా ప్ర‌జా క్షేత్రంలో ఉద్య‌మించ‌డం.. మంకుప‌ట్టు వీడ‌ని నేప‌ధ్యంలో ప్ర‌జ‌ల్లో ఆ పార్టీ తీరుని ఎండ‌గ‌ట్ట‌డం. జ‌న‌సైనికులు ప్ర‌స్తుతం అదే ప‌నిలో వున్నారు.. కేంద్రం పెట్రో ధ‌ర‌ల్ని జీ.ఎస్టీ ప‌రిధిలోకి తేవాల‌న్న డిమాండ్‌తో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం అద‌నంగా బాదుతున్న ఆ రెండు రూపాయిల్ని కూడా త‌గ్గించాలంటూ శాంతియుత నిర‌స‌న‌ల‌తో విష‌యాన్ని ప్ర‌జ‌ల దృష్టిలో పెడుతున్నారు.. జ‌రుగుతున్న‌ది ఏంటో ప్ర‌జ‌ల‌కి తెలియాలి క‌ధా మ‌రి..

Share This:

1,032 views

About Syamkumar Lebaka

Check Also

స్థానిక ఎన్నిక‌ల్లోనూ జీరో బ‌డ్జెట్ -జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

రాబోయే రోజుల్లో జ‌న‌సేన పార్టీ ఓ స్ప‌ష్ట‌మైన విజ‌న్‌తో ముందుకు వెళ్తుంద‌ని సిబిఐ మాజీ జేడీ, విశాఖ ఎంపి అభ్య‌ర్ధి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three + two =