Home / జన సేన / జ‌న‌సేన అన్నం బండి.. పేద‌ల పాలిట పెన్నిది.. త్వ‌ర‌లో మ‌రింత విస్తృతంగా..

జ‌న‌సేన అన్నం బండి.. పేద‌ల పాలిట పెన్నిది.. త్వ‌ర‌లో మ‌రింత విస్తృతంగా..

తిన‌డానికి తిండి దొర‌క్క రోజుల త‌ర‌బ‌డి ప‌స్తులుండే వారికి ఓ పూట క‌డుపు నింప‌డానికి మించిన పుణ్యం ఏముంటుంది.. డొక్క‌లు మాడిన ఆ ముఖాల్లో విరిసే చిరున‌వ్వుకి మించి త‌న్మ‌య‌త్వం ఏముంటుంది.. అయితే ఎదుటి వాడి ఆక‌లి గుర్తించాలంటే సేవా స్ఫూర్తి అవ‌స‌రం.. అది ఒక‌రికి ఉండ‌డం వేరు.. ఓ స‌మూహానికి నింప‌డం వేరు.. అలాంటి శ‌క్తి ఒక్క జ‌న‌సేన అధినేత‌కి మాత్ర‌మే ఉంది.. ప్ర‌పంచ వ్యాప్తంగా సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంలో జ‌న‌సేనాని, జ‌న‌సైన్యానికి ఎవ్వ‌రూ సాటి రారు.. ఇక ఎదుటి మ‌నిషి క‌డుపు మంట‌ని గుర్తించి, వారి ఆక‌లి తీర్చాలి అంటే అలాంటి సేవా స్ఫూర్తే అవ‌స‌రం.. సేవా స్ఫూర్తి ఉన్నా., అంత మంది నిర్భాగ్యుల ఆక‌లి తీర్చే శ‌క్తి ఎంత మందికి ఉంటుంది.. కానీ ఎలాంటి ప్ర‌య‌త్న‌మైనా ఒక్క అడుగుతోనే మొద‌ల‌వుతుంది.. ఆ ఆలోచ‌న నుండి పుట్టిందే జ‌న‌సేన అన్నం బండి(జ‌న అక్ష‌య‌పాత్ర‌).. ప‌ర‌బ్ర‌హ్మ స్వ‌రూపంగా భావించే అన్నాన్ని వృధా చేయ‌కుండా., ఫంక్ష‌న్లు, వివిధ కార్య‌క్ర‌మాల్లో మిగిలిన ఆ ప‌దార్ధాల‌ను సేక‌రించి., పూట గ‌డ‌వ‌ని ఆ క‌డుపేద‌ల‌కి ఓ పూట క‌డుపు నిండా అన్నం పెట్ట‌డ‌మే దీని ల‌క్ష్యం..
ఎన్ఆర్ఐ జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు రూప‌క‌ల్ప‌న చేసిన ఈ కార్య‌క్ర‌మం ఎప్పుడో కార్య‌రూపం దాల్చింది.. ఓ సెకండ్ హ్యాండ్ మారుతీ ఒమినీ వ్యాన్ కొని, నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌లు స్థానికంగా యాక్టివ్‌గా ఉన్న కొంత మంది కార్య‌క‌ర్త‌ల‌కి అప్ప‌గించ‌డం ద్వారా జ‌న అక్ష‌య‌పాత్ర‌ని నిర్వ‌హిస్తారు.. పెళ్లిళ్లు, ఇళ్లు, ఫంక్ష‌న్ హాల్స్‌లో జ‌రిగే ఇత‌ర ఫంక్ష‌న్ల వ‌ద్ద మిగిలిన ఆహారాన్ని ఈ బండి ద్వారా సేక‌రించి అనాధ శ‌ర‌ణాల‌యాలు, ఓల్డ్ ఏజ్‌హోమ్స్‌తో పాటు శివారుల్లో నివ‌సించే సంచార జాతుల‌కి చెందిన నిరుపేద‌ల‌కి పంపిణీ చేస్తారు.. మొద‌ట‌ నెల్లూరు, ఈస్ట్ గోదావ‌రి, ప్ర‌కాశం జిల్లాల్లో మొద‌ల‌య్యింది.. ఇప్పుడు కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఓ నెల రోజుల క్రితం ఈ జ‌న‌సేన అన్నం బండి కార్య‌క‌లాపాలు మొద‌ల‌య్యాయి..
ఓ య‌జ్ఞంలా అక్ష‌య‌పాత్ర నిర్వ‌హ‌ణ‌..
ఆక‌లితో ఉన్న వాడి క‌డుపు నింపాల‌న్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్ఫూర్తితో పుట్టిన జ‌న అక్ష‌య‌పాత్ర కార్య‌క‌లాపాలు.. ముందు రోజు ఫోటోల‌కి ఫోజులిచ్చి రెండు రోజులపాటు హ‌డావిడి చేస్తారులే అని భావించిన వారిని ఆశ్చ‌ర్యానికి గురిచేస్తూ.. ఆక‌లితో న‌క‌న‌క‌లాడుతున్న వారి క‌డుపు నింప‌డం కోసం జ‌న‌సైన్యం పోటీ ప‌డుతున్నారు.. సుమారు 40 రోజుల వ్య‌వ‌ధిలో ఒక్క కృష్ణా జిల్లా అవ‌నిగ‌డ్డ‌లో ఉన్న జ‌న‌సేన అన్నంబండి ద్వారా 12 సార్లు పేద‌ల క‌డుపు నింపారు.. ఈ అన్నం బండి ఏర్పాటుకి ఎన్నారై జ‌న‌సేన‌కి చెందిన చంద్ర రాజ్‌గిరి చేయూత‌నివ్వ‌గా, అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన జ‌న‌సేన కార్య‌క‌ర్త బండ్రెడ్డి హ‌రి నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌లు భుజానికి ఎత్తుకున్నారు.. పేద‌ల క‌డుపు నింపే ఈ కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌కి సంబంధించిన వివ‌రాలు అంద‌రికీ తెలిసేలా నియోజ‌క‌వ‌ర్గం మొత్తం పెద్ద పెద్ద పోస్ట‌ర్లు వేయ‌డంతో ఫంక్ష‌న్ల‌లో ఆహార ప‌దార్ధాలు మిగిలిన ప్ర‌తి ఒక్క‌రూ వారిని సంప్ర‌దిస్తున్నారు.. దీంతో పాటు కొంద‌రు జ‌న‌సైనికులు పేద‌ల క‌డుపు నింపే ఈ కార్య‌క్ర‌మానికి స్వ‌చ్చందంగా ముందుకి వ‌చ్చి., ఒక్కో రోజు నిర్వ‌హ‌ణా బాధ్య‌త‌లు భుజాన వేసుకుంటున్నారు.. మొత్తం నాలుగు జిల్లాల్లో ఈ కార్య‌క్ర‌మం ఓ య‌జ్ఞంలా సాగుతోంది..
డొక్కా సీత‌మ్మ గారి ఆద‌ర్శం..
పేద‌ల పాలిట క‌ల్ప‌త‌రువు.. ఆక‌లితో వ‌చ్చిన వారికి లేద‌న‌కుండా పెట్ట‌డంలో డొక్కా సీత‌మ్మ‌గారి త‌ర్వాతే ఎవ‌రైనా., దైవ‌ద‌ర్శ‌నానికి వెళ్తూ మార్గం మ‌ధ్య‌లో ఎవ‌రో ఆక‌లితో త‌మ స‌త్రానికి వ‌స్తున్నార‌ని తెలిసి తిరిగి వెళ్లి వారి క‌డుపు నింపిన ఘ‌న‌త ఆమెది.. బ్రిటీష్ రాణి ఆమె ఫోటోని ప‌క్క‌న పెట్టుకుని ప‌ట్టాభిషేకం చేయించుకున్నారంటే., ఆమె ఎంత మంది క‌డుపు నింపారో అర్ధం చేసుకోవ‌చ్చు.. ఇప్ప‌టికీ ఈమె స‌త్రం ఆక‌లితో వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌ర్నీ ఆద‌రిస్తుంది.. జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో పాటు ఆ ఆక‌లి అన్న ప‌దాన్ని పార‌ద్రోలిన డొక్కా సీత‌మ్మ గారి ఫోటోని కూడా ముద్రించుకుని నిత్యం స్ఫూర్తి పొందుతున్నారు జ‌న‌సైన్యం..
మరింత విస్తృతంగా సేవ‌లు..
ప్ర‌పంచ సేవా దినోత్స‌వం.. వ‌ర‌ల్డ్ స‌ర్వీస్ డేగా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు జ‌రుపుకునే సెప్టెంబ‌ర్ 2న‌ జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌న్మ‌దినాన‌, మ‌రిన్ని అన్నం బండ్ల‌ను పేద‌ల కోసం ప్రారంభించ‌నున్న‌ట్టు తెలుస్తోంది.. ఈ జ‌న అక్ష‌య‌పాత్ర నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి స్వార్ధ చింత‌నా లేదు.. జ‌న‌సేన అన్నం బండి ద్వారా క‌డుపు నింపుకునే వారిలో 20 శాతం మందికి కూడా ఓట్లు ఉండ‌వ‌న్న సంగ‌తి కామెంట్లు చేసేవారు గ‌మ‌నించాలి.. వీలైతే చూయూత‌నివ్వండి..

Share This:

770 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × one =