Home / జన సేన / జ‌న‌సేన అభ్య‌ర్ధిత్వం కోసం క్యూ.. ఒక్క రోజులో 350 ద‌ర‌ఖాస్తులు.. అంతా విద్యాధికులే..

జ‌న‌సేన అభ్య‌ర్ధిత్వం కోసం క్యూ.. ఒక్క రోజులో 350 ద‌ర‌ఖాస్తులు.. అంతా విద్యాధికులే..

పాతిక కేజీల బియ్యం కాదు… మీ బిడ్డలకు పాతికేళ్ల భవిష్యత్ ఇచ్చేలా పాలన సాగిస్తాను అన్న జ‌న‌సేనాని పిలుపు ఎంతోమందిని కదిలించింది. ఆలోచింపచేసింది. ఏడు సిద్దాంతాల బలంతో ప్రజల్లోకి ప్రబలంగా దూసుకువెళ్లిన జనసేన పక్షాన సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోరుతూ వందలాది మంది ఆశావహులు స్క్రీనింగ్ కమిటీ ముందుకు వస్తున్నారు. వీరిలో అధిక సంఖ్యాకులు వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, విద్యావేత్తలు, ప్రవాసాంధ్రులే వున్నారు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు స్క్రీనింగ్ కమిటీ గ‌త మూడు రోజులుగా ఆశావహుల నుంచి బయో డేటాలను స్వీకరించి పరిశీలిస్తోంది.. మంచి రోజు కావడంతో శుక్రవారం ఒక్క రోజే 350 మంది ఆశావహులు త‌మ ద‌ర‌ఖాస్తులు స్క్రీనింగ్ క‌మిటీకి సమర్పించారు. గురువారం సైతం 200ల‌కి పైగా ద‌ర‌ఖాస్తులు వ‌చ్చాయి..

జనసేన తరఫున పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థిత్వం ఆశిస్తున్నవారిలో అత్యధికులు విద్యావంతులే. శుక్రవారం బయో డేటాలు ఇచ్చినవారిలో 25 మంది డాక్ట‌ర్లు ఉండ‌డం గ‌మ‌నార్హం.. మరో 30 మంది ఐటీ ప్రొఫెషనల్స్ ఉన్నారు. ఇతర రాష్ట్రాల్లో వైద్య వృత్తిలో స్థిరపడి, వైద్యాలయాలు నిర్వహిస్తున్నవారు సైతం ఇక్కడికి వచ్చి జనసేన తరఫున బరిలో నిలుస్తామని బయో డేటాలు సమర్పిస్తున్నారు.. పలువురు ప్రవాసాంధ్రులు, విద్యా సంస్థల నిర్వాహకులు, న్యాయవాదులు, ఇంజినీర్లు కూడా అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు.. కొందరు ప్రభుత్వ అధికారులు సైతం ఆశావహుల్లో ఉండటం విశేషం.. మహిళలు, యువతులు అభ్యర్థిత్వం ఆశిస్తున్నారు.. వికలాంగులు సైతం బయో డేటాలు ఇచ్చారు.. వీరితోపాటు మాజీ ప్రజా ప్రతినిధులు, రాజకీయాలు, ప్రజా క్షేత్రంలో ఉన్న పలువురు నాయకులూ బయో డేటాలు ఇచ్చినవారిలో ఉన్నారు.. తిరుప‌తి డాక్ట‌ర్ హ‌రిప్ర‌సాద్‌, మాజీ ఎమ్మెల్యే చింత‌ల‌పూడి వెంక‌ట‌రామ‌య్య‌, గిద్ద‌లూరు నుంచి చంద్ర‌శేఖ‌ర్ యాద‌వ్‌, మాజీ ఎంపి గిరిజాల వెంక‌ట‌స్వామి నాయుడు, మ‌రికొంద‌రు మాజీ ఎమ్మెల్యేలు సైతం బ‌యోడేటాలు స‌మ‌ర్పించిన వారిలో ఉన్నారు.. పవన్ పాలనలో సంస్కరణలు తీసుకురావడంతోపాటు ప్రజా సంక్షేమానికి కట్టుబడే నిబద్దత ఉన్న నాయకుడని, వారి ఆశయాలు తమను ఎంతగానో ఆకట్టుకున్నాయనీ, మార్పు అనేది పవన్ కళ్యాణ్ తోటే సాధ్యమవుతుందని విశ్వసిస్తున్నామని ద‌ర‌ఖాస్తు దారులు చెబుతున్నారు..

Share This:

807 views

About Syamkumar Lebaka

Check Also

జీరో బ‌డ్జెట్ పాలిటిక్స్ దిశ‌గా ప‌వ‌న్ అడుగులు.. గాజువాక ఖ‌ర్చు ఎంతో తెలుసా..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అభ్య‌ర్ధులు గెలుపు కోసం కోట్ల రూపాయిలు కుమ్మ‌రించి ఓట‌ర్ల‌ను ప్ర‌లోభ‌పెట్టేందుకు నానా పాట్లు ప‌డ‌తారు.. అయితే ఈ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

twenty + 16 =