Home / జన సేన / జ‌న‌సేన ఆవిర్భావ మ‌హాస‌భ‌కు స‌మాయ‌త్తం అవుతున్న మ‌హా”సేన‌”..

జ‌న‌సేన ఆవిర్భావ మ‌హాస‌భ‌కు స‌మాయ‌త్తం అవుతున్న మ‌హా”సేన‌”..

మ‌హాసేన స‌మాయత్తం అవుతోంది.. జ‌న‌సేనుడి పిలుపుతో మ‌హాస‌భ‌కి క‌దులుతోంది.. జిల్లాల వారీగా జ‌రిగే స‌భ‌ల‌కే స్వ‌చ్చందంగా ల‌క్ష‌లాదిగా త‌ర‌లివ‌చ్చే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానులు, ఆరాధ‌కులు, జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు ఎవ‌రూ ఊహించ‌ని స్థాయిలో క‌దులుతున్నారు.. జ‌న‌సేన అధినేత పార్టీ ఆవిర్భావం జ‌రిగిన నాలుగేళ్ల చ‌రిత్ర‌లో తొలిసారి ఓ బ‌హిరంగ స‌భ‌కి హాజ‌రుక‌మ్మంటూ పార్టీ శ్రేణుల‌కి పిలుపునిచ్చిన నేప‌ధ్యంలో.. ఆంధ్రుల రాజ‌ధానిపై జ‌న‌సంద్రం పెను ఉప్పెనై విరుచుకుప‌డేందుకు రెడీ అయ్యింది.. ఆయ‌న పిల‌వ‌కుండానే ల‌క్ష‌లాదిగా వ‌చ్చే జ‌నం., ఇప్పుడు పార్టీ నాలుగేళ్ల ప్ర‌స్థానం., భ‌విష్య‌త్ కార్యాచ‌ర‌ణ‌కి సంబంధించి దిశానిర్ధేశం చేయ‌నున్న నేప‌ధ్యంలో ప్ర‌తి కార్య‌క‌ర్తా ప‌య‌నానికి సిద్దం అవుతున్నారు..

వారం రోజుల క్రితం నుంచే., అంటే జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న రాకముందు నుంచే., గ్రామ స్థాయి నుంచి కార్య‌క‌ర్త‌లు త‌మ మంగ‌ళ‌గిరి మ‌హాస‌భ ప్ర‌యాణానికి సంబంధించిన‌ ఏర్పాట్ల‌లో నిమ‌జ్ఞ‌మ‌య్యారు.. ముఖ్యంగా గ్రామ స్థాయి, మండ‌ల స్థాయి, నియోజ‌క‌వ‌ర్గ స్థాయిల్లో పార్టీలో చురుగ్గా ప‌నిచేస్తున్న కార్య‌క‌ర్త‌లు., స‌భకి సంబంధించిన స‌మాచారాన్ని ప్ర‌తి కార్య‌క‌ర్త‌కి, ప్ర‌తి అభిమానికీ చేర‌వేసే ప‌నిని భుజాన వేసుకున్నారు.. నియోజ‌క‌వ‌ర్గ స్థాయిలో కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తున్న ముఖ్య కార్య‌క‌ర్త‌లు వేలాదిగా బ‌య‌లుదేరుతున్న త‌మ పార్టీ శ్రేణుల‌కి స‌భ‌కి త‌ర‌లివెళ్లే స‌మ‌యంలో గానీ., స‌భా ప్రాంగ‌ణం వ‌ద్ద‌గానీ ఎలాంటి ఇబ్బందులు క‌లుగ‌కుండా తిరిగి ఇంటికి చేరుకునేలా దిశానిర్ధేశం గావిస్తున్నారు..

ప్ర‌తి కార్య‌క‌ర్త స్వ‌చ్చందంగా ఓ వాలంటీర్‌గా మారి., త‌మ ప్రాంతం నుంచి వ‌చ్చే వారు ఇబ్బంది ప‌డ‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు.. ఓ వైపు పొలం ప‌నులు, మ‌రోవైపు ప‌రీక్ష‌ల స‌మ‌యం అయిన‌ప్ప‌టికీ జ‌న‌సేనుడి కోసం ప్ర‌యాణానికి సిద్ద‌మవుతున్న కార్య‌క‌ర్త‌లంతా రాత్రిళ్లు క‌ల‌సి స‌మావేశాలు నిర్వ‌హిస్తుండ‌డం ., అదీ స్వ‌చ్చందంగా., ప్ర‌భుత్వ నిఘా వ‌ర్గాల‌ను సైతం ఆశ్చ‌ర్యానికి గురిచేస్తోంది.. కేవ‌లం కార్య‌క‌ర్త‌లంతా కూడా స‌భ విజ‌య‌వంతం చేసేందుకు అవ‌స‌ర‌మైన చ‌ర్య‌ల‌కు మాత్ర‌మే పూనుకుంటున్నారు.. ఇక్క‌డ ఎక్క‌డా జ‌న‌స‌మీక‌ర‌ణ అనే ప‌దానికి తావులేదు.. ఇక స‌భ‌కి వ‌చ్చే వారు సైతం ఇద్ద‌రు క‌ల‌సి ఓ బైక్‌, నాలుగు నుంచి ప‌ది మంది క‌ల‌సి ఓ కారు ఎవ‌రికి వారు సిద్దం చేసుకుంటున్నారు..

ఉభ‌య తెలుగు రాష్ట్రాల‌తో పాటు చుట్టుప‌క్క‌ల రాష్ట్రాల నుంచి కూడా వేలాదిగా జ‌న‌సేన అభిమానులు, కార్య‌క‌ర్త‌లు త‌ర‌లిరానున్న‌ట్టు కూడా స‌మాచారం అందుతోంది.. అన్ని ల‌క్ష‌ల మంది వ‌చ్చే స‌భ‌కి వెళ్లి ఎందుకు ఇబ్బంది ప‌డాలి అన్న ఆలోచ‌న ఏ ఒక్క‌రు మ‌న‌సులోకి రానీయ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.. ప్ర‌తి ఒక్క‌రు తొలిసారి జ‌న‌సేన అధినేత స‌భ పెట్టుకుందాం రండి అని పిలుపునిచ్చిన నేప‌ధ్యంలో., ఆ ల‌క్ష‌ల మందిలో నేనుసైతం అన్న ఆలోచ‌న‌తోనే క‌దులుతున్నారు..

ఇక దేశవ్యాప్తంగా ఉన్న జ‌న‌సైనికుల సంగ‌తి ప‌క్క‌న‌పెడితే., దేశ‌పు ఎల్ల‌లుదాటి, స‌ప్త‌సుముద్రాల ఆవ‌ల ఉన్న ఎన్ఆర్ఐ జ‌న‌సేన స‌భ్యులు సైతం మ‌హాస‌హ‌కి రెక్క‌లు క‌ట్టుకువాలేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.. విదేశాల నుంచి వేల‌ల్లో జ‌న‌సైనికులు త‌ర‌లివ‌స్తున్న స‌మాచారం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తోంది.. అందుకోసం ప్ర‌త్యేక విమానాల‌ను కూడా సిద్ధం చేయించుకున్నారంట‌.. ఐదు ల‌క్ష‌ల‌కి పైగా స‌భ‌కి వ‌స్తార‌న్న‌ది పార్టీ శ్రేణుల్లో ఓ వ‌ర్గం అంచ‌నా కాగా., ఇప్పుడు ఆ సంఖ్య ప‌ది ల‌క్ష‌లు మించిపోనుంద‌న్న అంచ‌నాలు కూడా మొద‌ల‌య్యాయి.. అంటే జ‌న‌సేన ఆవిర్భావ మ‌హాస‌భ‌కి మ‌హాసేన మ‌హాస‌ముద్ర‌మై ముంచెత్త‌నుంద‌న్న‌మాట‌..

Share This:

5,933 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen + eighteen =