Home / జన సేన / జ‌న‌సేన కుటుంబంలోకి నాదెండ్ల‌కు ఆహ్వానం.. నేటి నుంచి నేను జ‌న‌సైనికుడిని అన్న‌మ‌నోహ‌ర్‌..

జ‌న‌సేన కుటుంబంలోకి నాదెండ్ల‌కు ఆహ్వానం.. నేటి నుంచి నేను జ‌న‌సైనికుడిని అన్న‌మ‌నోహ‌ర్‌..

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌ని జ‌న‌సేన పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానం ప‌లికారు ఆ పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.. విజ‌య‌వాడలోని త‌న వ‌స‌తి గృహం వ‌ద్ద ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో నాదెండ్ల‌కి పూల మాల వేసి పార్టీలోకి ఆహ్వానం ప‌లికిన జ‌న‌సేనాని, పార్టీ నేత‌ల్ని ఆయ‌న‌కి ప‌రిచ‌యం చేశారు.. బ‌ల‌మైన వ్య‌క్తిత్వం, చిత్త‌శుద్ది, అనుభ‌వం ఉన్న నాదెండ్ల మ‌నోహ‌ర్ చేరిక‌తో పార్టీకి అద‌న‌పు శ‌క్తి వ‌స్తుంద‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు. నాదెండ్ల‌ని త‌న అన్న‌తో పోల్చిన జ‌న‌సేనాని, ఆయ‌న అనుభ‌వం పార్టీకి క‌ల‌సి వ‌చ్చే అంశ‌మ‌న్నారు.. మ‌నోహ‌ర్ చిత్త‌శుద్దితో కూడిన ఆలోచ‌న‌లు ఉన్న వార‌ని, ఎప్ప‌టి నుంచో వారితో ప‌రియం ఉంద‌ని తెలిపారు. గ‌డ‌చిన నాలుగేళ్లుగా, పార్టీ పెట్టిన నాటి నుంచి తాను ఎక్క‌డ ఏం మాట్లాడినా, వాటిని ఫాలో అవ్వ‌డం.. ఏది త‌ప్పు, ఏది ఒప్పు అనే అంశాల‌ని వివ‌రించేవార‌ని తెలిపారు. జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీలో స‌భ్యులుగా ఉంచాల‌ని భావించినా, అందుబాటులో లేక‌పోవ‌డం వ‌ల్ల కుద‌ర‌లేద‌ని స్ప‌ష్టం చేశారు.. కేంద్రంపై విశ్వాసం పెట్టాల‌న్న త‌న డిమాండ్ వెనుక మ‌నోహ‌ర్‌తో చ‌ర్చించిన సంద‌ర్బం.. తెలిసిన విష‌యాలు ఉన్నాయ‌న్నారు.. పార్టీలో చేర‌మ‌ని గ‌తంలో ఒక‌సారి కోరిన‌ట్టు చెప్పిన జ‌న‌సేన అధినేత., ఎప్పుడూ ఒత్తిడి మాత్రం చేయ‌లేద‌ని తెలిపారు.. ఈ మ‌ధ్య కాలంలో నాలుగు రోజుల పాటు ఇద్ద‌రి మ‌ధ్య ప‌ర‌స్ప‌ర చ‌ర్చ‌లు సాగిన‌ట్టు చెప్పారు.. స‌మాజంలో బ‌ల‌మైన మార్పులు తీసుకువ‌చ్చేందుకు ఎలా ముందుకి వెళ్లాలి, న‌వ‌శ‌కం రాజ‌కీయాలు ఎలా ఉండాలి..? విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం న‌డ‌ప‌డం ఎలా అనే అంశాల‌పై చ‌ర్చించిన‌ట్టు స్ప‌ష్టం చేశారు. మ‌నోహ‌ర్‌తో త‌న ఆలోచ‌న‌లు క‌లిశామ‌న్న ఆయ‌న‌, క్లిష్ట ప‌రిస్థితుల్లో స‌భాప‌తిగా ప‌నిచేసిన అనుభ‌వం ఉన్న ఆయ‌న‌., క‌ల‌యిక త‌న‌కి సంతోషాన్నించింద‌న్నారు..

దేశంలో ప‌వ‌న్ లాంటి నాయ‌కుడు లేడు-మ‌నోహ‌ర్‌.

 

జ‌న‌సేన పార్టీ తీర్ధం పుచ్చుకున్న అనంత‌రం.. పార్టీ శ్రేణుల్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన నాదెండ్ల మ‌నోహ‌ర్ దేశం మొత్తం వెతికినా ప‌వ‌న్‌క‌ళ్యాణ్ లాంటి నాయ‌కుడు దొర‌క‌డ‌న్నారు.. ఆయ‌న ఆలోచ‌నా విధానం, స‌మాజానికి ఏదో చేయాల‌న్న త‌ప‌న త‌న‌కి తెలుస‌న్నారు. ఈ రోజు నుంచి తాను ఒక జ‌న‌సైనికుడ్న‌న్న ఆయ‌న‌, జ‌న‌సేన కుటుంబంలోకి ఇంత సాద‌రంగా ఆహ్వానించినందుకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.. రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎలాంటి మార్పు వ‌స్తుందో ఊహించ‌లేమ‌న్నారు.. అయితే ఓ క‌మిట్‌మెంట్‌తో ప‌ని చేసి జ‌నానికి దగ్గ‌ర‌గా ఉండాల‌న్నారు.. ఓ స‌దాశ‌యంతో పార్టీ న‌డిపిస్తున్న ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వెంట మ‌న‌మంతా ఉండాల‌ని పిలుపు నిచ్చారు.. జ‌న‌సేనుడి ఆలోచ‌నా విధానాలు, పార్టీ సిద్ధాంతాల‌ను నిత్యం ప్ర‌జ‌ల్లోకి తీసుకువెళ్లాల‌న్నారు.. జ‌న‌సైనికుల్లో మంచి క్ర‌మ‌శిక్ష‌ణ క‌నిపిస్తుంద‌న్నారు.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై నిత్య పోరాటం, ఎన్నిక‌ల్లో మ‌న‌ల్ని ప్ర‌జ‌ల ముందుంచుతాయని సూచించారు.. ప్ర‌పంచంలో ఆఫ్రికాలాంటి దేశాల్లో ఉన్న స‌మ‌స్య‌లే మ‌న‌కీ ఉన్నా, అక్క‌డ నేత‌ల్లో ఉన్న క‌మిట్‌మెంట్ మ‌న వారిలో క‌న‌బ‌డ‌ద‌న్నారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో జ‌రిగిన చ‌ర్చ‌లో ఐదు విష‌యాల్లో రాజీ ప‌డ‌వ‌ద్ద‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిపారు.. విలువ‌ల‌తో కూడిన రాజ‌కీయం. మాన‌వ‌త్వంతో కూడిన రాజ‌కీయం.. దేశ‌భ‌క్తి.. ప్రాధ‌మిక విలువ‌ల్ని వీడ‌క‌పోవ‌డం.. ప్రాంతాలు, మ‌తాలు, కులాల‌కు అతీత‌మైన అభివృద్ది. ప్ర‌తి కుటుంబాన్ని ఆర్ధికంగా నిల‌బెట్ట‌డం అనే అంశాల్లో ఇద్ద‌రి ఆలోచ‌న‌లు క‌లిశాయ‌న్నారు.. రాజకీయాల్లో ప్ర‌తి ఒక్క‌రికీ సంకల్పబలం ఉండాలని సూచించారు. మారుమూల ప్రాంతాల్లో ఇప్ప‌టికీ ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయ‌న్న మ‌నోహ‌ర్‌, జ‌న‌సైన్యం , నాయ‌కులు వాటిని గుర్తించి జ‌న‌సేనాని దృష్టిలో ఉంచాల‌ని సూచించారు.. అంశాల వారీగా.. స‌మ‌స్య‌ల వారీగా ప్రజాపోరాటం చేద్దామ‌ని తెలిపారు..

Share This:

2,341 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine − 7 =