Home / జన సేన / జ‌న‌సేన క‌వాతుకి కామ్రెడ్ల సంగీభావం.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌కు సై..

జ‌న‌సేన క‌వాతుకి కామ్రెడ్ల సంగీభావం.. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఉమ్మ‌డి కార్యాచ‌ర‌ణ‌కు సై..

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న స‌మ‌స్య‌ల్ని గుర్తించ‌డంలో జ‌న‌సేన పార్టీయే నంబ‌ర్ వ‌న్‌.. నిత్యం జ‌నంతో మ‌మేక‌మై పోరాటాలు చేసే కామ్రెడ్లే ఆ విష‌యాన్ని ఒప్పుకున్నారు.. శ‌నివారం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో స‌మావేశం సంద‌ర్బంగా ఇరు పార్టీల నేత‌లు, అదే అంశాన్ని పంచుకున్నారు.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఉన్న స‌మ‌స్య‌ల్ని జ‌న‌సేన పార్టీ చాలా వ‌ర‌కు గుర్తించింది అని.. ఇప్పుడు తెలుగు రాష్ట్ర‌ల్లో ప్ర‌జ‌లు ఎదుర్కొంటున్న ప్ర‌ధాన స‌మ‌స్య‌లు.. ఈ స‌మ‌స్య‌ల‌పై ఐక్య పోరాటం చేయాల్సిన ఆవ‌శ్య‌క‌త అనే అంశాల‌పై ప‌వ‌న్‌క‌ళ్యాణ్ నివాసంలో ఆయ‌న‌తో వామ‌ప‌క్ష నేత‌లు సుమారు రెండు గంట‌ల పాటు చ‌ర్చ‌లు జ‌రిపారు.. క‌వులు రైతులు, భూ నిర్వాసితుల స‌మ‌స్య‌లు, పంచాయితీ ఎన్నిక‌లు, రాయ‌ల‌సీమ క‌రువు, ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల సంద‌డి, నాలుగో తేదీ నుంచి కొన‌సాగుతున్న మునిస్ప‌ల్ కార్మికుల స‌మ్మె.. ప్ర‌కాశం జిల్లా రామాయ‌ప‌ట్నం పోర్టుని మేజ‌ర్ పోర్టుగా అప్‌గ్రేడ్ చేయ‌డం.. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌ల‌పై పోరాటం.. చివ‌రి అంశం కీల‌కం.. కింది స్తాయిలో చిన్న చిన్న స‌మ‌స్య‌ల్ని సైతం గుర్తించి క్లియ‌ర్ చేయ‌డం.. ఈ అంశం చ‌ర్చ‌కు వ‌చ్చిన‌ప్పుడు.. జ‌న‌సేన గ్యారేజ్‌కి వ‌చ్చిన ఎన్నో స‌మ‌స్య‌ల ప్ర‌స్థావ‌న వ‌చ్చింది. ఒక్క స‌మ‌స్య ప‌రిష్క‌రిస్తే, వంద స‌మ‌స్య‌లు ఎదుర‌వుతున్న విష‌యం.. అదే స‌మ‌యంలో చాలా వ‌ర‌కు స‌మ‌స్య‌లు జ‌న‌సేన దృష్టిలో ఉన్న విష‌యంపై సుదీర్ఘ చ‌ర్చ సాగింది.. క‌మ్యునిస్టు పార్టీల‌తో క‌ల‌సి పోరాటం చేసే అంశానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేస్తున్న అంశాన్ని జ‌న‌సేనాని దృవీక‌రించారు కూడా.. క‌రువు స‌మ‌స్య‌, శ్రీకాకుళం జిల్లాలో తుపాను బీభ‌త్సంతో పాటు 8 అంశాలు చ‌ర్చ‌కి వ‌చ్చాయ‌న్నారు.. పార్టీ పెద్ద‌ల‌తో సంప్ర‌దింపుల అనంత‌రం త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న విడుద‌ల చేస్తామ‌ని తెలిపారు..

అయితే సిపిఎం, సిపిఐ నేత‌లు ప‌నిలో ప‌నిగా అక్టోబ‌ర్ 15న జ‌ర‌గ‌బోయే జ‌న‌సేన పార్టీ ధ‌వ‌ళేశ్వ‌రం క‌వాతుకి సంఘీభావం ప్ర‌క‌టించారు.. ముఖ్యంగా ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక విధానాల‌ని కామ్రెడ్లు త‌ప్పుప‌డుతున్నారు.. రెయిన్ గ‌న్స్ అంటూ ప్ర‌చారం చేసుకుంటున్న చంద్ర‌బాబు, అబ‌ద్దాల‌తో ప్ర‌భుత్వాన్ని న‌డుపుకొస్తున్నార‌న్న‌ది రామ‌కృష్ణ ఆరోప‌ణ‌.. మునిస్ప‌ల్ కార్మికుల స‌మ్మె వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వ వైఖరి , ప్ర‌జా స‌మ‌స్య‌ల్ని ప‌ట్టించుకోని త‌నంపై వారు మండిపడుతున్నారు.. టీడీపీ-వైసీపీ యేత‌ర మూడో ప్ర‌త్య‌మ్నాయంలో భాగ‌స్వాములు అయ్యేందుకు త‌హ‌త‌హ‌లాడుతున్న‌ట్టు కూడా క‌న‌బ‌డుతోంది.. రాష్ట్రంలో మూడో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తిగా ఆవిర్భ‌వించ‌గ‌ల శ‌క్తి జ‌న‌సేన‌కి మాత్ర‌మే ఉంద‌న్న‌ది వారి అభిప్రాయం.. అందుకే జ‌న‌సేన‌తో క‌ల‌సి ప్ర‌యాణం చేస్తే, త‌మ‌కీ క‌ల‌సి వ‌స్తుంద‌ని భావిస్తున్న‌ట్టు కూడా క‌న‌బడుతోంది.. ఇక సిపిఎం కార్య‌ద‌ర్శి మ‌ధు మాట‌ల్లో ఆ భావం స్ప‌ష్టంగా క‌న‌బ‌డుతోంది.. మూడు పార్టీలు క‌ల‌సి ప్ర‌త్య‌క్ష ఆందోళ‌న‌లు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించామ‌న‌డంతో పాటు ప్ర‌జ‌లు మూడో రాజ‌కీయ ప్ర‌య్యామ్నాయం కోసం ఎదురు చూస్తున్నార‌నే విష‌యాన్ని కూడా వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.. తాము ఆ మూడో ప్ర‌త్యామ్నాయానికి మ‌ద్ద‌తు తెలుపుతామ‌న్నారు.. ఇప్పుడు 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌మ‌స్య‌ల‌పై ఆందోళ‌న‌లు చేప‌ట్టాల‌న్న నిర్ణ‌యం.. అదీ మూడు పార్టీలు క‌ల‌సి.. జ‌న‌సేన అధినేత పార్టీ పెద్ద‌ల‌తో చ‌ర్చించాలంటున్నా., కామ్రెడ్లు మాత్రం రెడీ అయిపోయారు.. ఇక సిపిఎం కూడా క‌వాతుకి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌డంతో పాటు వివిధ వ‌ర్గాల నుంచి వ‌స్తున్న స్పంద‌న‌ని తెలియ‌చెప్పే ప్ర‌య‌త్నం చేశారు.. మొత్తానికి గ‌త కొంత కాలంగా క‌ల‌సి న‌డుస్తున్న మూడు పార్టీలు… ముందు ముందు కూడా ఆ స్నేహ‌భావాన్ని కొన‌సాగించే ప్ర‌క్రియ సాగుతోంది..

Share This:

969 views

About Syamkumar Lebaka

Check Also

ప‌రిమిత వ‌న‌రుల‌తో బ‌ల‌మైన పార్టీల‌తో త‌ల‌ప‌డ్డాం.. ఇదే స్ఫూర్తిని కొన‌సాగిద్దాం-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌

జ‌న‌సేన పార్టీ జిల్లాల వారీ స‌మావేశాల్లో భాగంగా రెండ‌వ రోజు శ్రీకాకుళం, విజ‌య‌న‌గ‌రం, తూర్పుగోదావ‌రి జిల్లాల నుంచి పార్టీ త‌ర‌ఫున …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × four =