Home / జన సేన / జ‌న‌సేన గ్యారేజ్‌కి వ‌చ్చిన మ‌త్స్య‌కారుల వెత‌లేంటి.. మంత్రి మ‌ల్లాడికి జ‌న‌సేనుడిపై ఉన్న భ‌రోసా ఏంటి..?

జ‌న‌సేన గ్యారేజ్‌కి వ‌చ్చిన మ‌త్స్య‌కారుల వెత‌లేంటి.. మంత్రి మ‌ల్లాడికి జ‌న‌సేనుడిపై ఉన్న భ‌రోసా ఏంటి..?

స‌ముద్ర‌పు ఒడ్డు, నదీ ప‌రివాహ‌క ప్రాంతాలే వారికి ఆవాసాలు.. స‌ముద్రంతో తుపానుల‌తో పోరాటం.. న‌దుల్లో పోటుపాటుల ఎదురీత వారి జీవ‌న గ‌మ‌నం.. కుల వృత్తిని న‌మ్ముకున్న మ‌త్స్య‌కారుల బ‌తుకు చిత్రం ఇది.. చేప‌ల వేట ముఖ్యఆదాయ వ‌న‌రుగా ఉన్న వీరు., అన్ని ర‌కాలుగా చాలా వెనుక‌బ‌డి ఉన్నారు.. దీంతో మ‌త్స్య‌కారుల్ని ఎస్టీల్లో చేర్చాల‌న్న డిమాండ్ ఒక‌ప్పుడు దేశ వ్యాప్తంగా హ‌ల్ చ‌ల్ చేసింది.. కొన్ని రాష్ట్రాలు అవ‌కాశాన్ని భ‌ట్టి ఎస్టీలుగా, కొన్ని ఎస్సీలుగా గుర్తించాయి.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మాత్రం పాల‌కులు క‌నిక‌రించ‌డం లేదు.. కుల వృత్తిని న‌మ్ముకున్న మ‌త్స్య‌కారులు ఖ‌చ్చితంగా ఎస్టీ జాభితాకి అర్హుల‌న్న‌ది వారి డిమాండ్‌.. పైగా టీడీపీ అధినేత, సిఎం చంద్ర‌బాబు దాదాపు వంద సార్లు ఇదే హామీని ప్ర‌స్తావించ‌డం, హామీల రూపంలో గుప్పించ‌డం వంటివీ చేశారు.. అయితే మ్యానిఫ‌స్టోలో పెట్టిన ఈ అంశాన్ని పూర్తిగా విస్మ‌రించారు.. దీంతో ఇచ్చిన హామీని నిల‌బెట్టుకోవాలంటూ 53 రోజులుగా రిలే నిరాహార దీక్ష‌లు చేస్తున్న మ‌త్స్య‌కారులు., త‌మ స‌మ‌స్య ప‌రిష్కార బాధ్యత‌ను ఇప్పుడు జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేతుల్లో పెట్టారు..

నాలుగు అంశాల‌తో కూడిన నివేదిక క‌మ్ విజ్ఞాప‌న ప‌త్రాన్ని జ‌న‌సేన అధినేత చేతుల్లో పెట్టారు.. మ‌త్స్య‌కారుల్ని ఎస్టీల్లో చేర్చే అంశంపై కమిటీ వేయాలి.. అధ్య‌య‌నం అనంత‌రం రిపోర్టుపై అసెంబ్లీ తీర్మానం చేసి., కేంద్రానికి పంపాలి.. అభివృద్ది, టూరిజంల ముసుగులో జ‌రుగుతున్న జ‌ల కాలుష్యాన్ని నివారించాలి.. మ‌త్స్య‌కారుల్ని దూరంగా త‌ర‌మ‌డానికి వీల్లేదు.. 45 ల‌క్ష‌ల జ‌నాభా ఉన్న మ‌త్స్య‌కారుల‌కి త‌గిన రాజ‌కీయ ప్రాధాన్య‌త ఇవ్వాలి.. మ‌త్స్య‌కారుల‌కి ఇచ్చే నిధులు, సౌక‌ర్యాల విష‌యంలో త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలి..

ఇక ఇదే అంశంపై మ‌త్స్య‌కారుల త‌రుపున మాట్లాడేందుకు వ‌చ్చిన పాండిచ్చెరి మంత్రి మ‌ల్లాడి కృష్ణారావు.. ఒక మ‌త్స్య‌కారుడిగా త‌న‌వ‌ర్గం ప‌డుతున్న బాధ‌ల నుంచి విముక్తి క‌లిగించేందుకు జ‌న‌సేన అధినేత స‌హాయ స‌హ‌కారాల్ని కోరారు.. ఆయ‌న మంత్రి ., సీనియ‌ర్ మంత్రి., కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి.. రాజ‌కీయాల్లో ఎంతో అనుభ‌వం క‌లిగిన వ్య‌క్తి కూడా.. అయినా ఆయ‌న సైతం స‌మ‌స్య‌ల ప‌రిష్కారం విష‌యంలో జ‌న‌సేనుడి బ‌లంపై న‌మ్మ‌కంతో., జ‌న‌సేన పార్టీ కార్యాల‌యానికి వ‌చ్చారు..

ఒక మంత్రి అనే విష‌యాన్ని ప‌క్క‌న‌పెట్టి., ద‌క్షిణాది రాష్ట్రాల్లో మ‌త్స్య‌కారుల‌కి ఉండే స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం చేస్తున్న ప్ర‌య‌త్నంలో భాగంగా తాను ఇక్క‌డికి వ‌చ్చిన విష‌యాన్ని ముందే ఒప్పుకున్నారు.. ఇందిరాగాంధీ హ‌యాంలోనే బిల్లు పెట్టాల్సి ఉన్నా., బిల్ పాస‌వ‌డానికి త‌గిన మెజార్టీ లేక ఆగిపోయింద‌న్నారు.. ఖ‌చ్చితంగా కుల‌వృత్తిపై ఆధార‌ప‌డి జీవ‌నం కొన‌సాగించే మ‌త్స్య‌కారుల్ని ఎస్టీల్లో చేర్చి తీరాల్సిందేనిని అందుకు స‌హ‌క‌రించాల‌ని జ‌న‌సేనుడికి మ‌ల్లాడి విజ్ఞ‌ప్తి చేశారు.. త‌మ జాతి ఓటు బ్యాంకులో 75-80 శాతం ఒకే పార్టీకి ప‌డిపోతాయ‌న్న ఆయ‌న‌., ఎన్టీఆర్ హ‌యాం నుంచి టీడీపీకి అండ‌గా ఉంటున్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు.. అయితే సిఎం చంద్ర‌బాబు ఇప్ప‌టి వ‌ర‌కు వంద సార్లు ఇదే అంశాన్ని మీటింగుల్లో మాత్ర‌మే ప్ర‌స్థావించి వ‌దిలేశార‌ని మ‌ల్లాడి ఆరోపించారు.. ప్ర‌స్తుత శ్రీకాకుళంలో ఉద్య‌మం మొద‌లైంది.. నెమ్మ‌ది కోస్తాంధ్ర మొత్తానికి విస్త‌రిస్తోంది.. ఇది కేవ‌లం వారి ఆక‌లి మంటేన‌ని., ఆధిప‌త్యం కోసం మాత్రం కాద‌ని ఆయ‌న అన్నారు..

ఒక్క‌సారి ఈ నెల‌లో శ్రీకాకుళం జిల్లా రావాల‌ని., మ‌త్య్స‌కారులు ప‌డుతున్న వెత‌లు క‌ళ్లారా చూడాల‌ని., వారి ఉద్య‌మానికి మ‌ద్ద‌తు తెల‌పాల‌ని పాండిచ్చెరి మంత్రి మ‌ల్లాడి జ‌న‌సేనుడికి విజ్ఞ‌ప్తి చేశారు.. సానుకూలంగా స్పందించిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., ప‌లానా రోజు వ‌స్తాన‌ని., మ‌త్స్య‌కారుల వెత‌లు అధ్య‌య‌నం చేసి., వారికి అండ‌గా పోరాడుతాన‌ని ప్ర‌క‌టించారు.. స‌మస్య ఏదైనా., ఎవ‌రిదైనా ప‌రిష్కారం కోసం వెత‌క‌డంలోగాని, పోరాటం చేయ‌డంలో గానీ జ‌న‌సేనాని ఓ అడుగు ముందే ఉంటారు.. మ‌రి ఆయ‌న ఉద్దేశంలో రాజ‌కీయం అంటే ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కార వేదిక క‌దా మ‌రి..

Share This:

710 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 − three =