Home / జన సేన / జ‌న‌సేన దృష్టికి ఆక్వా రైతుల స‌మ‌స్య‌లు.. విద్యుత్ స‌బ్సిడి అమ‌లుకి డిమాండ్‌..

జ‌న‌సేన దృష్టికి ఆక్వా రైతుల స‌మ‌స్య‌లు.. విద్యుత్ స‌బ్సిడి అమ‌లుకి డిమాండ్‌..

రాష్ట్రానికి సుమారు 25 వేల కోట్ల ఆదాయం అందిస్తున్న ఆక్వా రైతుల ప‌ట్ల ప్ర‌భుత్వం చిన్న చూపుతో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని జ‌న‌సేన పార్టీ ఆరోపిస్తోంది.. ఓ వైపు గిట్టుబాటు ధ‌ర లేక‌, మ‌రోవైపు ప్ర‌భుత్వం ఇచ్చిన హామీలు గాలికి వ‌దిలేయ‌డంతో, రొయ్య‌లు, చేప‌ల సాగు రైతులు జ‌న‌సేన పార్టీకి త‌మ గోడు వెళ్ల‌బోసుకున్నారు.. పంట నీటిలో వేశాక, చేతికి వ‌చ్చే వ‌ర‌కు ప్ర‌తి క్ష‌ణం ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని బ‌త‌కాల్సిందేన‌ని., ఏ మాత్రం తేడా వ‌చ్చిన పెట్టిన ఖ‌ర్చు మొత్తం గంగ‌పాలైన‌ట్టేన‌ని అక్వా రైతులు త‌మ క‌ష్టాలు వెళ్ల‌బోసుకున్నారు.. తీరా క‌ష్ట‌ప‌డి, ల‌క్ష‌ల రూపాయిలు పెట్టుబ‌డి పెట్టి మంచి కౌంట్ వ‌చ్చే వ‌ర‌కు పెంచితే, అదే స‌మ‌యంలో ధ‌ర‌లు ఉండ‌క న‌ష్ట‌పోతున్నామంటున్నారు.. ఆక్వా ఉత్ప‌త్తుల‌కి సంబంధించి కొనుగోళ్ల‌కి ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి చ‌ర్య‌లు ఉండ‌వ‌న్న‌ది వారి ఆరోప‌ణ.. దీంతో పాటు ఈ ఏడాది మే 26వ తేదీన ఆక్వా రైతుల్ని, ప‌రిశ్ర‌మ‌పై ఆధార‌ప‌డి ఉన్న పారిశ్రిమిక వ‌ర్గాల‌ని పిలిపించి మాట్లాడిన ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు., ఆక్వా సాగుకి రెండు రూపాయిల‌కి యూనిట్ విద్యుత్ ఇస్తాన‌ని శ‌ప‌దం చేశారు.. గిట్టుబాటు క‌ల్పిస్తామ‌న్నారు.. అయితే ఇందులో ఏ హామీ కూడా నెర‌వేర‌లేదు.. గ‌తంలో రైతులు హ‌డావిడి చేసిన స‌మ‌యంలో క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఫిక్స్ చేసినా., అది ద‌క్కిన దాఖ‌లాలు కూడా చాలా అరుదు.. దీంతో తమ క‌ష్టాలు తీర్చ‌మంటూ కోస్తా ప్రాంతం నుంచి 200 మంది రైతులు జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్ని క‌ల‌సి త‌మ బాధ‌లు వెళ్ల‌బోసుకున్నారు..

రంగంలోకి దిగిన జ‌న‌సేన పార్టీ అమ‌రావ‌తి విభాగం, అక్వా రైతుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఓ కార్యాచ‌ర‌ణ రూపొందించుకున్నారు.. ఈ వివ‌రాల‌ను బెజ‌వాడ‌లోనిపార్టీ తాత్కాలిక కార్యాల‌యంలో స్పీక‌ర్ ప్యాన‌ల్ స‌భ్యుడు మండ‌లి రాజేష్ వెల్ల‌డించారు.. మే 26వ తేదీన స‌చివాల‌యం సాక్షిగా ఆక్వా రైతుల‌కి ఏదైతే హామీ ఇచ్చారో., అదే విద్యుత్ స‌బ్సిడి ధ‌ర‌ని వెంట‌నే అమ‌ల్లోకి తేవాల‌ని విద్యుత్ మంత్రిని డిమాండ్ చేశారు.. లేని ఎడ‌ల ఈ నెల 26 త‌ర్వాత ఆక్వా రైతుల‌తో క‌ల‌సి ఆందోళ‌న‌కి దిగుతామ‌ని హెచ్చ‌రించారు.. 27వ తారీఖు ఏకంగా క‌రెంటు మంత్రి క‌ళావెంక‌ట్రావు ఇంటిని ముట్ట‌డిస్తామ‌ని చెప్పారు.. ఇంత‌కీ క‌రెంటు మంత్రికి ఈ క‌రెంటు స‌బ్సిడీ హామీ ఇచ్చిన విష‌యం తెలుసా..? అంటూ ఒక‌దాని వెంట ఒక‌ట ప్ర‌శ్న‌ల‌తో జ‌న‌సేన నాయ‌కులు ఉక్కిరి భిక్కిరి చేశారు..

ఆక్వా ఉత్ప‌త్తుల‌కి గిట్టుబాటు ధ‌ర విష‌యంలో వ్య‌వ‌సాయ మంత్రి ఆదినారాయ‌ణ‌రెడ్డికి కూడా హెచ్చ‌రిక‌లు పంపారు.. వంద కౌంట్ రొయ్య‌ల ధ‌ర అప్ప‌ట్లో 170 రూపాయిలు ఉండ‌గా., మ‌రో 30 పెంచి మ‌ద్ద‌తు ధ‌ర‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని ప్ర‌భుత్వం సూచించింది.. ప్ర‌భుత్వ సూచ‌న మేర‌కు 100 కౌంట్ 200 రూపాయిలు ఉండాల్సి ఉండ‌గా., ఇప్ప‌టికీ అదే 170కి అమ్ముతున్నారు.. మంత్రిగారు ధ‌ర పెంచ‌మ‌ని చెప్పిన‌ప్పుడు మాత్ర‌మే కేవ‌లం ఓ వారం రోజులు ధ‌ర పెంచి, మ‌ళ్లీ య‌ధాస్థానానికి దించేశారు.. ధ‌ర‌లు మ‌ళ్లీ త‌గ్గినా, వ్య‌వ‌సాయ మంత్రితో పాటు సిఎం త‌న‌యుడు లోకేష్ కి సూట్ కేసులు అంద‌డంలో, రైతులు న‌ష్ట‌పోతున్నా , పాల‌కులు మాత్రం ప‌ట్టించుకోవడం లేద‌న్న‌ది స్పీక‌ర్ ప్యాన‌ల్ స‌భ్యుడు మండ‌లి రాజేష్ ఆరోప‌ణ‌.. రైతుల‌కి జ‌న‌సేన పార్టీ అండ ఉంటుంద‌ని, డెడ్ లైన్‌లోపు విద్యుత్ స‌బ్సిడి, మ‌ద్ద‌తు ధ‌ర‌ల అంశాల్లో ప్ర‌భుత్వం స్పందించ‌ని ప‌క్షంలో, ఇక ప్ర‌త్య‌క్ష కార్యాచ‌ర‌ణ ఉంటుంద‌న్నారు.. ప్ర‌జ‌ల త‌రుపున పోరాటం చేసేందుకు జ‌న‌సైన్యం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుద‌ని తెలిపారు.. రాజేష్‌తో పాటు మైల‌వ‌రంకి చెందిన కృష్ణ‌రాయ‌ల్‌, లీగ‌ల్‌సెల్ త‌రుపున వెన్నా య‌తేంద్ర‌లు రైతుల‌కి మ‌ద్ద‌తుగా జ‌రిగిన మీడియా స‌మావేశంలో పాల్గొన్నారు.. మ‌రి జ‌న‌సేన డెడ్‌లైన్‌ని ప్ర‌భుత్వం ప‌ట్టించుకుంటుందా..? లేదా అన్న‌ది వేచిచూడాల్సిన అంశం..

Share This:

2,058 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 × one =