Home / జన సేన / జ‌న‌సేన నంద్యాల ఎంపి అభ్య‌ర్ధి ఎస్పీవై రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం.. ప‌వ‌న్ దిగ్భ్రాంతి..

జ‌న‌సేన నంద్యాల ఎంపి అభ్య‌ర్ధి ఎస్పీవై రెడ్డి హ‌ఠాన్మ‌ర‌ణం.. ప‌వ‌న్ దిగ్భ్రాంతి..

నంద్యాల సిట్టింగ్ ఎంపి, జ‌న‌సేన పార్టీ ఎంపి అభ్య‌ర్ధి ఎస్పీవై రెడ్డి మృతి చెందారు.. కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధ ప‌డుతున్న ఆయ‌న మంగ‌ళ‌వారం రాత్రి తిరిగిరాని లోకాల‌కు పయన‌మ‌య్యారు.. వ‌య‌సు మీద ప‌డిన‌ప్ప‌టికీ మ‌రోసారి నంద్యాల ఎన్నిక‌ల బ‌రిలో నిల‌చిన ఆయ‌న‌, త‌న‌తో పాటు త‌న ప‌రిధిలో జ‌న‌సేన పార్టీ అభ్య‌ర్ధుల గెలుపు కోసం మండుటెండ‌ల‌ను సైతం లెక్క చేయ‌క ప్ర‌చారం చేశారు.. అదే స‌మ‌యంలో తీవ్ర అనారోగ్యానికి గురైన ఎస్పీవై రెడ్డి అప్ప‌టి నుంచి హైద‌రాబాద్‌లో చికిత్స పొందుతున్నారు.. క‌డ‌ప జిల్లా అంకాల‌మ్మ గూడూరు గ్రామంలో 1950లో జ‌న్మించిన ఎస్పీవైరెడ్డి నంద్యాల నుంచి మూడు సార్లు పార్ల‌మెంటు స‌భ్యుడిగా గెలుపొందారు.. పార్ల‌మెంటు స‌భ్యుడిగా కంటే నంది పైపుల అధినేత‌గా., సామాజిక‌వేత్త‌గా ఆయ‌న ఆ ప్రాంతానికి చేసిన సేవ‌లు నిరుప‌మానం.. ముఖ్యంగా పేద‌ల కోసం ఆయ‌న ప్ర‌వేశ‌పెట్టిన రూ.2 కే భోజ‌నం ప‌థ‌కం విప‌రీత‌మైన జ‌నాధ‌ర‌ణ పొందింది.. వ్యాపార‌వేత్త‌గా కూడా ఎంతో మంది జీవితాల్లో ఎస్పీవైరెడ్డి వెలుగులు నింపారు.. ముఖ్యంగా క‌రువు ప్రాంతాల్లో ఎస్పీవై సేవ‌లు ఆయ‌న్ని ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచేలా చేశాయి.. 2004 నుంచి వ‌రుస‌గా మూడు సార్లు నంద్యాల లోక్‌స‌భ స్థానం నుంచి ఎన్నిక‌య్యేలా చేసింది.. రాజ‌కీయ నాయ‌కుడిగా కంటే ప్ర‌జా సేవ‌కుడిగానే ఆయ‌న నంద్యాల వాసుల‌కు సుప‌రిచితులు.. ఇక ఆయ‌న బ్రాండ్ నంద్యాల నంది పైపులు దేశ వ్యాప్తంగా ఖ్యాతి గ‌డించాయి.. జ‌న‌సేన అధినేత సిద్ధాంతాలు ప‌ట్ల ఆక‌ర్షితులైన ఆయ‌న ఎన్నిక‌ల‌కు ముందు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో పార్టీలో చేరారు.. జ‌న‌సేనానితో మాట్లాడిన త‌ర్వాత ఇలాంటి నాయ‌కుల చేతిలో అధికారం ఉంటే ప్ర‌జ‌ల‌కు మేలు జ‌రుగుతుంది అన్న న‌మ్మ‌కంతో., నంద్యాల పార్ల‌మెంట్ ప‌రిధిలో శ‌క్తివంచ‌న లేకుండా పార్టీ గెలుపు కోసం త‌న వంతు ప్ర‌య‌త్నం చేశారు.. దుర‌దృష్ట వ‌శాత్తు ప్ర‌చారం స‌మ‌యంలోనే ఆయ‌న తీవ్ర అనారోగ్యానికి గుర‌య్యారు..

ఎస్.పి.వై.రెడ్డి మరణం బాధాకరం
నంద్యాల లోక్ సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీలో ఉన్న ఎస్.పి.వై.రెడ్డి గారు మరణం చాలా బాధాకరం అని పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు.. వారి కుటుంబానికి త‌న‌ తరఫున, జన సైనికుల తరఫున ప్రగాఢ సానుభూతి తెలియచేశారు.. రాజకీయాల్లో హుందాతనం పాటించిన నాయకుడ‌ని కొనియాడారు.. విద్యావంతుడు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్న ఆయన పారిశ్రామికవేత్తగా ఎన్నో విజయాలు సాధించడం, సామాజిక సేవలో నిమగ్నమైన తీరు, కరవు ప్రాంతాల్లో ప్రజలకు అందించిన చేయూత ఎన్నదగినవ‌న్నారు.. రాజకీయాల్లోకి రాకముందే పేదల ఆకలి తీరేలా రెండు రూపాయలకే ఆహారం అందించే కేంద్రాలు నెలకొల్పిన ఎస్.పి.వై.రెడ్డి మూడు దఫాలు లోక్ సభ సభ్యుడిగా నిరుపమానమైన సేవలందించార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. జనసేన పార్టీలోకి వచ్చినప్పుడు ఆయ‌న‌ అనుభవం, సేవాతత్పరత సమాజానికి ఎంతో దోహదపడుతాయని మనస్ఫూర్తిగా ఆహ్వానించిన‌ట్టు తెలిపారు.. నంద్యాల లోక్ సభ స్థానం నుంచి పోటీకి నిలిపాం. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలోనే వారు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరార‌ని., ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న‌ట్టు ప‌వ‌న్ తెలిపారు..

Share This:

557 views

About Syamkumar Lebaka

Check Also

కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

1 × three =