Home / జన సేన / జ‌న‌సేన నిర‌స‌న‌లు ఒక్క రోజుతో ఆగ‌వు.. రాష్ట్రానికి న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడుతామ‌న్న జ‌న‌సేనాని..

జ‌న‌సేన నిర‌స‌న‌లు ఒక్క రోజుతో ఆగ‌వు.. రాష్ట్రానికి న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాడుతామ‌న్న జ‌న‌సేనాని..

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌త్యేక హోదా అంశం పార్ల‌మెంటులో అవిశ్వాసంతో హాట్ టాపిక్‌గా మారిన నేప‌ధ్యంలో., జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ కూడా అంతే ఘాటుగా స్పందించారు.. ప్ర‌త్యేక హోదా కోసం మూడేళ్లుగా మ‌డ‌మ తిప్ప‌ని పోరాటం చేస్తున్న జ‌న‌సేనాని., హోదా విష‌యంలో కేంద్రంతో పాటు రాష్ట్రంలోని అధికార‌-ప్ర‌తిప‌క్షాల తీరు ప‌ట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.. రాష్ట్ర విభ‌జ‌న‌తో న‌ష్ట‌పోయిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కి న్యాయం జ‌రిగే వ‌ర‌కు పోరాటం చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించారు.. ఒక రోజు బంద్‌తోనో, కాగ‌డాల తాము స‌రిపెట్టుకోలేమ‌ని తెగేసి చెప్పారు.. ప్ర‌త్యేక హోదా సాధ‌న‌, విభ‌జ‌న హామీల అమ‌లుకు నిరంత‌ర పోరాటం చేయాల్సిందేన‌న్న ఆయ‌న‌., జ‌న‌సేన పార్టీ పోరాట యాత్ర అందులో భాగ‌మేన‌ని తెలిపారు..

ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గ‌గ కేంద్రం నుంచి ప్ర‌జ‌ల గ‌ళాన్ని, ప్ర‌త్యేక హోదా కోసం ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల్ని ఈ యాత్ర‌లో వినిపిస్తామ‌న్న ఆయ‌న‌, పాల‌క ప‌క్షాలు విభ‌జ‌న స‌మ‌యంలో ప్ర‌జ‌ల్ని మాయ మాట‌ల‌తో ఏ విధంగా వంచించాయో చాటుతామ‌న్నారు.. నాటి చ‌ట్టంలో పేర్కొన్న వాటిని అమ‌లు చేయాల్సిన బాధ్య‌త ఉన్న నేటి పాల‌కులు., రాష్ట్రాన్ని ఎలా అన్యాయం చేస్తున్నారో ప్ర‌జ‌లు గ్ర‌హిస్తున్నార‌న్నారు.. పాల‌క ప‌క్షాల ద్వంద్వ వైఖ‌రిని, ప్ర‌జ‌ల్ని మోసం చేస్తున్న తీరునీ ఖండిస్తూ నిర‌స‌న క‌వాతులు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.. ఐదు కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష ఢిల్లీకి వినిపించే వ‌ర‌కు జ‌న‌సేన పార్టీ మ‌డ‌మ తిప్ప‌ని పోరాటం చేస్తుంద‌ని తెలిపారు.. రాష్ట్రానికి న్యాయం జ‌రిగే వ‌ర‌కు జ‌న‌సేన ముందుకి వెళ్తుంద‌ని ఓ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు..

పాలికులే విభ‌జ‌న హామీల అమ‌లు విష‌యంలో ద్వంద్వ వేఖ‌రి అవ‌లంబిస్తున్నార‌ని టీడీపీ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.. వారి రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల‌కు అనువుగా మాట‌లు మారుస్తున్నార‌నేది వాస్త‌వ‌మంటూ మండిపడ్డారు.. ప్ర‌త్యేక హోదా విష‌యంలో కేంద్రోల ఉన్న భార‌తీయ జ‌న‌తా పార్టీతో స‌మానంగా రాష్ట్రంలోని తెలుగుదేశం పార్టీ అంతే దారుణంగా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసింద‌న్నారు.. ప్ర‌జ‌ల్ని రెండు పార్టీలు మోసం చేశాయ‌ని, వంచించాయ‌ని ఆరోపించారు.. ఒక వైపు టీడీపీ ఎంపిలు బీజేపీని తిడ‌తార‌ని, మ‌రోవైపు బీజేపీ కాళ్లు మొక్కుతార‌న్నారు.. ఈ ద్వంద్వ వైఖ‌రిని ఎలా అర్ధం చేసుకోవాలంటూ ప్ర‌శ్నించారు..

పార్ల‌మెంట్‌లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాంధ్‌సింగ్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి మా మిత్రుడే అంటూ చేసిన వ్యాఖ్యాల్ని ప్ర‌స్తావించిన ఆయ‌న‌., అలాంట‌ప్పుడు ముఖ్య‌మంత్రి చేస్తున్న పోరాటం ధ‌ర్మ పోరాటం అని ఎలా న‌మ్మ‌గ‌లం అంటూ నిల‌దీశారు.. అవిశ్వాసంపై చ‌ర్చ మొద‌లు కాక ముందు నుంచి తెలుగుదేశం పార్టీ ఆడుతున్న డ్రామాల‌ను ట్విట్ట‌ర్ వేదిక‌గా ఎండ‌గ‌డుతూ వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., తాను మాత్రం రాజీలేని పోరాటం చేస్తాన‌ని చెబుతూ వ‌స్తున్నారు..

Share This:

920 views

About Syamkumar Lebaka

Check Also

మ‌రో జాబితా విడుద‌ల చేసిన జ‌న‌సేన‌.. 4 లోక్‌స‌భ‌, 16 అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్ధుల ఖ‌రారు..

============================= ఇప్ప‌టికే పొత్తులు పోను సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో పోటీ చేసే అభ్య‌ర్ధుల జాబితాను మూడు వంతులు పైగా ప్ర‌క‌టించేసిన జ‌న‌సేన‌.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

thirteen − 2 =