Home / జన సేన / జ‌న‌సేన పార్టీలోకి మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. ముహుర్తం ఖ‌రారు..

జ‌న‌సేన పార్టీలోకి మాజీ స్పీక‌ర్ నాదెండ్ల మ‌నోహ‌ర్‌.. ముహుర్తం ఖ‌రారు..

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ మాజీ స్పీక‌ర్ నాదెండ్ల‌ మ‌నోహ‌ర్ జ‌న‌సేన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు. అక్టోబ‌ర్ 12 శుక్ర‌వారం అందుకు ముహుర్తం ఖ‌రార‌య్యింది. ఇప్ప‌టికే కాంగ్రెస్ పార్టీ స‌భ్య‌త్వానికి ఆయ‌న రాజీనామా చేశారు. జ‌న‌సేన అధ్య‌క్షులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో మ‌నోహ‌ర్‌ల మ‌ధ్య చిర‌కాలంగా స్నేహం కొన‌సాగుతోంది. జ‌న‌సేన పార్టీ ఆవిర్భావం నాటి నుంచి జ‌న‌సేన పార్టీకి సంబంధించిన సిద్ధాంత ప‌ర‌మైన విధానాల‌పై ఇరువురు నేత‌లు ప‌ర‌స్ప‌రం అభిప్రాయాలు పంచుకుంటూనే ఉన్నారు. గ‌డ‌చిన నాలుగేళ్ల కాలంలో జ‌న‌సేన పార్టీకి సంబంధించిన యాక్టివిటీతో పాటు స‌భ‌లు, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌సంగాల్ని ప‌రిశీలిస్తూ, త‌న అభిప్రాయాల్ని జ‌న‌సేనానితో పంచుకుంటూ వ‌స్తున్నారు. జ‌న‌సేన అధినేత బావ‌జాలం, నాదెండ్ల‌ రాజ‌కీయ ల‌క్ష్యాలు ఒకే విధంగా ఉండ‌డంతో, వీరిద్ద‌రి మ‌ధ్య‌ మైత్రీబంధం మ‌రింత బ‌ల‌ప‌డిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆయ‌న జ‌న‌సేన పార్టీలోకి ఇప్పుడు చేరుతున్న‌ప్ప‌టికీ మాన‌సికంగా ఎప్ప‌టి నుంచో జ‌న‌సేన‌తో మ‌మేక‌మై ఉన్నారు. రాజ‌కీయ విలువ‌లకి నిలువుట‌ద్దం లాంటి మ‌నోహ‌ర్ రాక‌ జ‌న‌సేన పార్టీ బ‌లోపేతానికి దోహ‌దం చేస్తుంద‌ని, పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. న‌వ‌త‌రం రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ను ఆంధ్రప్ర‌దేశ్‌తో పాటు దేశ వ్యాప్తంగా విస్త‌రింప చేయాల‌న్న ల‌క్ష్యంతో , ఆశ‌యంతో జ‌న‌సేనాని పార్టీని స్ధాపించారు.. నాదెండ్ల రాక‌తోఈ ఆశ‌యం మ‌రింత బ‌లంగా ప్ర‌జ‌ల్లోకి వెళ్తుంద‌న్న న‌మ్మ‌కం ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి ఉంది.. వ‌ర్థ‌మాన రాజ‌కీయాల్లో నిస్పాక్షిక రాజ‌కీయాలు నెర‌పిన నాయ‌కుడిగా మ‌నోహ‌ర్‌కి మంచి పేరు ఉంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ శాస‌న‌స‌భ‌కి స్పీక‌ర్‌గా ఆయ‌న ఎంతో హుందాగా, రాజ‌కీయ ప‌క్ష‌పాతాల‌కి అతీతంగా స‌భ‌ని న‌డిపార‌న్న పేరు ఉంది.. అసెంబ్లీ స్పీక‌ర్‌గా శ్రీ మ‌నోహ‌ర్ అధికార‌ప‌క్షంతో పాటు ప్ర‌తిప‌క్షం మ‌న్న‌న‌లు కూడా పొంద‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే నూత‌న రాజ‌కీయ వ్య‌వ‌స్థ నిర్మాణం దిశ‌గా పార్టీని ఎలా ముందుకి తీసుకువెళ్లాలి అనే అంశంపై ఇరువురు నేత‌ల మ‌ధ్య విస్తృతంగా చ‌ర్చ‌లు సాగాయి. రాష్ట్రంలో కులాల మ‌ధ్య స‌ఖ్య‌త సాధ‌న ల‌క్ష్యంతో కృషి చేయాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు స‌మాచారం.. ఈ ఇద్ద‌రి నేత‌ల క‌ల‌యిక తెలుగు రాష్ట్రాల‌తో పాటు యావ‌త్ భార‌త‌దేశంలోని యువ‌త‌కి స్ఫేర్తిదాయ‌కం అవుతుంద‌న్న న‌మ్మ‌కంతో పార్టీ శ్రేణులు ఉన్నాయి. జ‌న‌సేన పార్టీ భావ‌జాలం, కుల‌ర‌హిత న‌వ‌స‌మాజ నిర్మాణం ధ్యేయంగా ఇరువురు నేత‌లు ముందుకి సాగుతార‌న్న సంకేతాలు కూడా వెలువ‌డుతున్నాయి..

Share This:

1,273 views

About Syamkumar Lebaka

Check Also

బ‌ల‌స‌ల‌రేవు వంతెన సాధ‌న‌కు జ‌న‌సేనాని మ‌ద్ద‌తు.. ఇంత‌కీ ఆ వంతెన స్టోరీ ఏంటంటే..?

బ‌ల‌స‌ల‌రేవు వంతెన‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ర్య‌ట‌న‌తో ప్ర‌పంచం దృష్టికి వ‌చ్చిన మ‌రో అప‌రిష్కృత‌ ప్ర‌జా స‌మ‌స్య‌.. శ్రీకాకుళం జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

12 − 10 =