Home / జన సేన / జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ముత్తంశెట్టి.. అధినేత న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాన‌న్న కృష్ణారావు..

జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ముత్తంశెట్టి.. అధినేత న‌మ్మ‌కాన్ని నిల‌బెడ‌తాన‌న్న కృష్ణారావు..

జ‌న‌సేన పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా ముత్తంశెట్టి కృష్ణారావుని నియ‌మితుల‌య్యారు.. శుక్ర‌వారం ఏలూరులో పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్వ‌యంగా ప్ర‌క‌టించ‌గా., శ‌నివారం అధికారికంగా ప్ర‌క‌ట‌న విడుద‌లైంది.. విజ‌య‌వాడ‌కి చెందిన ముత్తంశెట్టి ఇప్ప‌టికే పార్టీలో కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. సెంట్ర‌ల్ క‌మిటీ స‌భ్యుడిగా, కృష్ణా జిల్లా రీజియ‌న్ కో-ఆర్డినేట‌ర్‌గా పార్టీకి సేవ‌లు అందిస్తున్నారు.. పార్టీ అధినేత ప్ర‌క‌టించిన వెంట‌నే ముత్తంశెట్టి కృష్ణారావు ఆయ‌న్ని క‌లిసి ధ‌న్య‌వాదాలు తెలిపారు.. పార్టీ అధినేత త‌న‌పై ఉంచిన న‌మ్మ‌కాన్ని నిల‌బెట్టుకుంటాన‌ని, పార్టీ బ‌లోపేతానికి త‌న‌వంతు కృషి చేస్తాన‌ని కృష్ణారావు వెల్ల‌డించారు..

తెలుగు రాష్ట్రాల్లో ప్ర‌ముఖ విద్యావేత్త‌గా, సీనియ‌ర్ పొలిటీషియ‌న్‌గా ముత్తంశెట్టి సుప‌రిచితుడు.. రాజ‌కీయాల మీద మ‌క్కువ‌తో చిన్న వ‌య‌సులోనే అరంగేట్రం చేశారు.. జాతీయ‌-ప్రాంతీయ పార్టీల రెండింటిలో త‌న‌దైన ముద్ర వేశారు.. 2014 ఎన్నిక‌ల్లో టీడీపీ విజ‌యంలో కీల‌క పాత్ర పోషించిన ఆయ‌న‌కి, విశాఖ‌ప‌ట్నంతో పాటు ప‌శ్చిమ‌గోదావ‌రి, కృష్ణా జిల్లాల్లో మంచి ప‌ట్టు ఉంది.. ముఖ్యంగా ఈ రెండు జిల్లా ప‌రిష‌త్‌లు టీడీపీ ప‌రం కావ‌డంలో ముత్తంశెట్టిదే కీ రోల్‌.. అయితే మొద‌టి నుంచి మెగా కుటుంబం మీద ఉన్న అభిమానం, జ‌న‌సేనాని మీద ఉన్న ప్ర‌త్యేక అనుబంధం దృష్ట్యా కృష్ణారావు ఈ ఏడాది ఆరంభంలో జ‌న‌సేన పార్టీలో చేరారు.. కృష్ణారావు ఆస‌క్తిని గ‌మ‌నించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., రాక‌తోనే సెంట్ర‌ల్ కమిటీలోకి తీసుకోవ‌డంతో పాటు ఇప్పుడు ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప‌ద‌విని కూడా క‌ట్ట‌బెట్టారు..

Advertisement.

Advertisement.

Share This:

1,198 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేన సిద్దాంతాలు విని అధికార ప్ర‌తినిధి అద్దేప‌ల్లికి షాక్ ఇచ్చిన ఎన్‌.ఆర్‌.ఐ..

తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ సంచ‌ల‌నానికి తెర‌లేపిన జ‌న‌సేన త‌రంగం కార్య‌క్ర‌మం ప్ర‌తి గ‌డ‌ప‌కి జ‌న‌సేన సిద్ధాంతాల‌ను తీసుకెళ్లే దిశ‌గా వ‌డివ‌డిగా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

17 + 10 =