Home / జన సేన / జ‌న‌సేన పోరాట యాత్ర‌కి రంజాన్ బ్రేక్‌.. ఈద్ అనంత‌రం య‌ధావిధిగా యాత్ర‌..

జ‌న‌సేన పోరాట యాత్ర‌కి రంజాన్ బ్రేక్‌.. ఈద్ అనంత‌రం య‌ధావిధిగా యాత్ర‌..

విభ‌జ‌న హామీల అమ‌లు, ప్ర‌త్యేక హోదా సాధ‌న, ప్ర‌జా స‌మ‌స్య‌ల అధ్య‌య‌నం ల‌క్ష్యంగా జ‌నం మ‌ధ్య పోరాట యాత్ర మొద‌లుపెట్టిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్., త‌న టూర్‌కి స్వ‌ల్ప విరామం ప్ర‌క‌టించారు.. త‌న వ్య‌క్తిగ‌త సిబ్బందిలో ఎక్కువ మంది ముస్లిం సోద‌రులు ఉన్నందున‌, రంజాన్ పండుగ‌ని దృష్టిలో ఉంచుకుని ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకున్నారు.. ఈద్ అనంత‌రం విశాఖ జిల్లాలో జ‌న‌సేన పోరాట యాత్ర య‌ధావిధిగా కొన‌సాగుతుంద‌ని ఆ పార్టీ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.. నెల రోజుల క్రితం చిత్తూరు జిల్లాలో ప్రారంభ‌మైన జ‌న‌సేన పార్టీ పోరాట యాత్ర ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర‌లోని రెండు జిల్లాల్లో పూర్తి చేసుకుని, విశాఖ జిల్లాలో కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే..

ఉత్త‌రాంధ్ర మేధావుల‌తో జ‌న‌సేనాని స‌మాలోచ‌న‌లు.
శుక్ర‌వారం రాత్రి విశాఖ జిల్లా య‌ల‌మంచిలి నియోజ‌క‌వ‌ర్గ కేంద్రంలో నిర‌స‌న క‌వాతు, స‌భ‌ల అనంత‌రం విశాఖప‌ట్నానికి చేరుకున్న జ‌న‌సేనాని., శనివారం ఉద‌యం నుంచి విశాఖ‌కి చెందిన కొంద‌రు మేధావుల‌తో స‌మావేశమ‌వుతున్న‌ట్టు పార్టీ మీడియా విభాగం తెలిపింది.. ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుత‌నంపై అవిశ్రాంత పోరాటం చేస్తున్న కుప్పం యూనివ‌ర్శిటీ మాజీ వీసీ, యూనియ‌న్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌లో సేవ‌లు అందించిన ప్రొఫెస‌ర్ కె.ఎస్ చ‌లం లాంటి మేధావులు ప‌వ‌న్‌తో భేటీ అయిన వారిలో ఉన్నారు.. ఆది, సోమ‌వారాల్లో కూడా విశాఖ న‌గ‌రానికి చెందిన ప‌లువురితో జ‌న‌సేన అధినేత భేటీ అవుతారు.. ఉత్త‌రాంధ్ర వెనుక‌బాటుత‌నంపై వివిధ వ‌ర్గాల మేధావుల‌తో చ‌ర్చ‌ల‌ని, అక్క‌డ ప‌రిస్థితుల‌పై స‌నిశిత అధ్య‌య‌నానికి ఆయ‌న ఉప‌యోగించుకుంటున్న‌ట్టు తెలుస్తోంది.. ఉత్త‌రాంధ్ర‌లోని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌కి త‌మ ప్రాంత వెనుక‌బాటుపై పూర్తి స్థాయి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు గాను జ‌న‌సేనాని ప్ర‌ణాళిక‌ల రూప‌క‌ల్ప‌న‌లకి ఈ రెండు రోజుల స‌మ‌యాన్ని వినియోగించుకోనున్నారు.. సోమ‌వారం విశాఖ నుంచి ప‌వ‌న్‌క‌ళ్యాణ్ హైద‌రాబాద్‌కి ప‌య‌న‌మ‌వుతారు.. రంజాన్ అనంత‌రం తిరిగి విశాఖ‌కు చేరుకుంటారు..

Advertisement.

Share This:

1,757 views

About Syamkumar Lebaka

Check Also

డ‌ల్లాస్‌లో ప్ర‌వాస‌గ‌ర్జ‌నకి జ‌న‌సేన కీ నేత‌ల కిక్‌. అమెరికా అదిరిప‌డే రీతిలో స‌భ ఉండాల‌ని పిలుపు.

డ‌ల్లాస్ వేదిక‌గా నిర్వ‌హించ త‌ల‌పెట్టిన జ‌న‌సేన ప్ర‌వాస గ‌ర్జ‌న అమెరికా చ‌రిత్ర‌లోనే న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న స్థాయిలో ఉండాల‌ని పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

six − four =