పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన అధినేత పవన్కళ్యాణ్ చివరి విడత పోరాట యాత్ర ముగించుకుని, తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించనున్న నేపధ్యంలో కొవ్వూరు నుంచి రాజమండ్రి వరకు గోదావరి రైల్ కమ్ రోడ్డు బ్రిడ్జి మీద నిర్వహించ తలపెట్టిన కవాతు వాయిదా పడే అవకాశాలు కనబతున్నాయి.. ఉభయ గోదావరి జిల్లాల నాయకుల అభ్యర్ధన మేరకు జనసేనాని వాయిదాకి మొగ్గు చూపే అవకాశాలు కనబడుతున్నాయి.. బ్రిడ్జి కవాతు వాయిదా వెనుక రెండు, మూడు కారణాలు బలంగా వినబడుతున్నాయి.. అందులో ముఖ్యమైనది రాజమండ్రి పాతవంతెన కెపాసిటీ.. ఈ రైల్ కమ్ రోడ్డు వంతెన కేవలం 25 వేల మందికి మాత్రమే సరిపోతుంది.. అయితే జనసేన కవాతుకి ఉభయ గోదావరి జిల్లాల నుంచే లక్ష మందికి పైగా జనసైనికులు సిద్ధమయ్యారన్నది ఓ అంచనా.. అటు కృష్ణాతో పాటు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున కవాతుకి తరలి వచ్చేందుకు ఎవరికి వారు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు జనసేన కార్యాలయానికి సమాచారం అందుతోంది.. దీంతో పాటు సరిహద్దు జిల్లా ఖమ్మం నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనసైనికులు కవాతుకి సిద్ధమవుతున్నట్టు సంకేతాలు పంపారు.. ఈ నేపధ్యంతో సాంకేతిక కారణాల దృష్ట్యా, గోదావరి పాత బ్రిడ్జి నుంచి వేదికని మార్చాల్సిన అవసరం ఉందని గోదావరి జిల్లాల నాయకులు జనసేన అధినేతకి సూచించినట్టు సమాచారం.. దీంతో పాటు ఇన్ని లక్షల మందికి ఏర్పాట్లు చేయడానికి సమయం తక్కువగా ఉండడం.. దీంతో పాటు 9వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కాబోతుండడంతో., ప్రజలంతా ఉత్సవాత హడావిడిలో ఉండనున్నారు.. పై కారణాల దృష్ట్యా ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న రాజమండ్రి బ్రిడ్జి కవాతుకి మరింత సమయం కేటాయించాలన్న విజ్ఞాపనల నేపధ్యంలో పవన్కళ్యాణ్ పునరాలోచనలో పడ్డారు.. దాదాపుగా కవాతు వాయిదాకే మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి..
దీంతో పాటు ఇప్పటికే ఏడు జిల్లాలకి జిల్లాకి ముగ్గురు చొప్పున రెస్పాన్స్బుల్ కమిటీలను నియమించిన జనసేన అధినేత., మిగిలిన ఆరు జిల్లాలకు కమిటీల నిమాయక ప్రక్రియ పూర్తి చేయనున్నారు.. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, కర్నూలు, అనంత జిల్లాలకు కమిటీలను సిద్ధం చేశారు. అదే సమయంలో ప్రస్తుతం ఏర్పాటు చేసిన రెస్పాన్స్బుల్ కమిటీల పని తీరు ఆశించిన స్థాయిలో లేదన్న అసంతృప్తి కూడా కనబడుతోంది.. దీంతో కమిటీల పనితీరుపై పునః సమీక్షించాల్సిన బాధ్యతను జనసేన అధినేత పవన్కళ్యాణ్ గుర్తించారు.. అందుకోసం అన్ని జిల్లాల కమిటీలతో జనసేన అధినేత స్వయంగా సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.. రానున్న కాలంలో పార్టీ నిర్మాణం, క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు అవసరమైన వ్యూహాలతో జిల్లాల బాధ్యులకి పవన్ దిశా నిర్ధేశం గావించనున్నారు..
జనసేన పోరాట యాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు పూర్తి చేసుకుని, తూర్పుగోదావరి జిల్లాలో ప్రవేశించనున్న నేపధ్యంలో., ముందుగా ఆ జిల్లా నేతలతో జనసేన అధినేత సమావేశం అవనున్నారు.. శుక్రవారం విజయవాడకి రానున్న పవన్కళ్యాణ్, మధ్యాహ్నం 3-4 ప్రాంతంలో తూర్పు గోదావరి జిల్లా నేతలతో సమావేశం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి.. యాత్ర షెడ్యూల్తో పాటు పార్టీ నిర్మాణం, కవాతు నిర్వహణ తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.. అయితే ముందుగా ప్రతి జిల్లా కమిటీతో, కమిటీ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు చోటు చేసుకున్న పురోగతిపై కూడా జనసేనాని సమీక్షలు నిర్వహించనున్నారు..