Home / జన సేన / జ‌న‌సేన విజ‌యం కోసం జ‌ల‌దీశ్వ‌రుడికి యాగం

జ‌న‌సేన విజ‌యం కోసం జ‌ల‌దీశ్వ‌రుడికి యాగం

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో నిజాయితీతో కూడిన పోరాటం చేసిన జ‌న‌సేన పార్టీ విజ‌యం సాధించాల‌నీ, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క‌పాత్ర పోషించాల‌ని కాంక్షిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా శైవ‌క్షేత్రాల్లో పార్టీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హిస్తున్నారు.. అవ‌నిగ‌డ్డ నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని స్వ‌యంభువు లింగంగా పేరున్న ఘంట‌సాల బాల‌ప‌ర‌మేశ్వ‌రి స‌మేత జ‌ల‌దీశ్వ‌ర‌స్వామి ఆల‌యంలో పార్టీ అభ్య‌ర్ధి ముత్తంశెట్టి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.. పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఫోటో ముద్రించిన కండువాలు, జెండాల‌తో స్వామి అనుగ్ర‌హం కోరుతూ ఆల‌య ఘ‌నాపాటి స‌మ‌క్షంలో అర్చ‌న‌లు, అభిషేకాలు చేయించారు.. అనంత‌రం ఆల‌య ప్రాంగ‌ణంలో స్థానిక జ‌న‌సైనికుల‌తో క‌ల‌సి యాగం నిర్వ‌హించారు.. పోలింగ్ ప్ర‌క్రియ పూర్త‌యిన త‌ర్వాత ప్ర‌త్య‌ర్ధులు చ‌డీచ‌ప్పుడు లేకుండా విశ్రాంతి తీసుకుంటుంటే., ముత్తంశెట్టి మాత్రం విస్తృతంగా నియోజ‌క‌వ‌ర్గంలో ప‌ర్య‌టిస్తూనే ఉన్నారు.. ఓట్లు, గెలుపు అనే అంశాలు పక్క‌న‌పెట్టి ప్ర‌జా స‌మ‌స్య‌ల మీద పోరాటం మొద‌లు పెట్టారు.. ఎక్క‌డ ఎవ‌రికి స‌మ‌స్య ఉన్నా రెక్క‌లు కట్టుకుని వాలిపోతున్నారు.. ప్ర‌స్తుతం అవ‌నిగ‌డ్డ, కోడూరు, నాగాయ‌లంక మండలాల్లో నెల‌కొన్న నీటి ఎద్ద‌డిపై ముత్తంశెట్టి స్థానిక నేత‌ల‌తో క‌ల‌సి పోరాడుతున్నారు.. ఇప్ప‌టికే నీటిపారుద‌ల శాఖ అధికారుల‌తో పాటు క‌లెక్ట‌ర్‌కు కాలువ ద్వారా నీరు విడుద‌ల చేసి గ్రామాల్లో చెరువులు నింపాల‌ని ప‌లుమార్లు లిఖిల పూర్వ‌క విజ్ఞాప‌న‌లు స‌మ‌ర్పించారు.. అవ‌స‌రం అయితే పోరుబాట‌కు సిద్ధం అవుతున్నారు.. ఫ‌లితం అనుకూలంగా వ‌స్తుందా.? లేదా అన్న విష‌యం ప‌క్క‌న‌పెట్టి ముత్తంశెట్టి నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటున్న తీరు ప‌ట్ల స‌ర్వ‌త్ర హ‌ర్షాతిరేకాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.. ఇక జ‌ల‌దీశ్వ‌రుడి స‌మ‌క్షంలో యాగం చేస్తే., నీటి స‌మృద్ది క‌లుగుతుంద‌న్న వేద‌పండితుల సూచ‌న‌తో పార్టీ గెలుపు కోసం నిర్వ‌హించిన పూజ‌ల అనంత‌రం అప్ప‌టిక‌ప్పుడు ఏర్పాట్లు చేయించి వ‌ర్షం కోసం యాగం నిర్వ‌హించారు.. ఒక్క రోజులో ఫ‌లితం వ‌స్తుంద‌న్న టెన్ష‌న్ కంటే., ప్ర‌జ‌లు నీటికోసం అల్లాడుతున్నార‌న్న బాధ త‌న‌ను వేధిస్తుంద‌న్న ముత్తంశెట్టి మాట‌లు జ‌న‌సేన అధినేత అభ్య‌ర్ధుల్లో ఏ స్థాయి స్ఫూర్తి నింపారో చెప్ప‌క‌నే చెబుతున్నాయి..

Share This:

627 views

About Syamkumar Lebaka

Check Also

ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్ ఛార్జ్‌ల‌ను ప్ర‌క‌టించిన జ‌న‌సేన‌

పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గాల స‌మావేశాల అనంత‌రం కృష్ణా జిల్లాకి సంబంధించి రెండు పార్ల‌మెంట్ సెగ్మెంట్‌ల ప‌రిధిలోని ఆరు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఇన్‌ఛార్జ్‌ల‌ను …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

fifteen + nine =