Home / జన సేన / జ‌న‌సేవ‌కి క‌దిలిన జ‌న‌సైన్య‌పు స‌మూహం.. విశాఖ తీరంలో భ‌క్తుల‌కి ప్ర‌సాద విత‌ర‌ణ‌..

జ‌న‌సేవ‌కి క‌దిలిన జ‌న‌సైన్య‌పు స‌మూహం.. విశాఖ తీరంలో భ‌క్తుల‌కి ప్ర‌సాద విత‌ర‌ణ‌..

మార్పు రావాలంటే ఓ స‌మూహం ఒక్క‌టై ముందుకి క‌ద‌లాలి.. నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేయాలి.. అప్పుడే ఎంత‌టి క‌ష్ట‌మైన ప‌నిలో అయినా విజ‌యం సిద్ధించి తీరుతుంది.. జ‌న‌సేనాని మాట‌లు ఇచ్చిన‌ ప్రేర‌ణ‌, చేత‌ల్లో చూపే స్ఫూర్తి శివ‌రాత్రి మ‌రుస‌టి రోజు విశాఖ తీరంలో ఆవిష్కృత‌మ‌య్యాయి.. NRITrishul Team(ఎన్‌.ఆర్‌.ఐ త్రిశూల్ టీం), New Zealand Janasena team( న్యూజిల్యాండ్ జ‌న‌సేన టీం)ల ఆద్వ‌ర్యంలో జ‌న‌సేన పార్టీ, జ‌న‌సేనాని వృద్దిని కాంక్షిస్తూ నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం హైలెట్ అయ్యింది.. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల‌తో పాటు నాయ‌కులు సైతం ఉత్సాహంగా ప‌ని చేయ‌డం గ‌మ‌నార్హం.. శివ‌రాత్రి ప‌ర్వ‌దినం సంద‌ర్బంగా జ‌న‌సేన‌, జ‌న‌సేనానికి మంచి జ‌ర‌గాల‌ని కాంక్షిస్తూ అన్ని శైవ క్షేత్రాల్లో పూజ‌లు నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు.. అయితే మాన‌వ‌సేవే మాధ‌వ‌సేవ అని భావించిన జ‌న‌సైనికులు జ‌న‌సేనాని క్షేమం కోరుతూ శివ‌రాత్రి మ‌రుస‌టిరోజు విశాఖ తీరంలో సంప్ర‌దాయ బ‌ద్దంగా నిర్వ‌హించే పుణ్య స్నానాల‌ని జ‌న‌సేవ‌కి వినియోగించారు..

విశాఖ సాగ‌ర‌తీరంలో బీచ్ రోడ్ వైఎంసిఎ, కాళికామాత ఆల‌యం, పాండురంగ‌స్వామి ఆల‌యాల స‌మీపంలో పుణ్య‌స్నానాలు ఆచ‌రించేందుకు వ‌చ్చే వేలాది మంది భ‌క్తుల‌కి అల్పాహారం అందించారు.. శివ‌రాత్రి ప‌ర్వ‌దినాన రోజు మొత్తం ఉప‌వాస దీక్ష‌లో ఉండ‌డంతో పాటు రాత్రి జాగారం త‌ర్వాత భ‌క్తులు స‌ముద్ర‌స్నానాలు చేసిన అనంత‌రం అల్పాహారం స్వీక‌రిస్తారు.. NRITrishul Team(ఎన్‌.ఆర్‌.ఐ త్రిశూల్ టీం), New Zealand Janasena team( న్యూజిల్యాండ్ జ‌న‌సేన టీం)ల స‌హ‌కారంతో విశాఖ వీర‌మ‌హిళా విభాగం, ఫ్యూచ‌ర్ లీడ‌ర్స్ టీమ్, గాజువాక‌, ఇచ్చాపురం త్రిశూల్ టీమ్స్ స‌భ్యులు ఈ సేవా కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.. మాజీ మంత్రి, జ‌న‌సేన ముఖ్య‌నేత ప‌సుపులేటి బాల‌రాజు లాంటి వారు సైతం విత‌ర‌ణకు మ‌ద్ద‌తుగా త‌ర‌లివ‌చ్చారు.. వీర మ‌హిళా విభాగానికి చెందిన‌ ఉష శ్రీ, ఎన్‌.ఆర్‌.ఐ వీర‌మ‌హిళ సౌజ‌న్య గోక్యాడ‌, డా. సునిథి, ప‌సుపులేటి ఉషాకిర‌ణ్‌, కిర‌ణ్ రాణి, సౌజ‌న్య‌, జ్యోత్స్న కొఠారి… జ‌న‌నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు మోల‌బ‌త్తిన రాఘ‌వ‌య్య , బి.సురేష్‌, పి వి సురేష్‌, మ‌హేష్ పోటు, ఉమా మ‌హేష్‌, శ్రీను, బాలాజీ, త‌దిత‌రులు టెంట్ల వ‌ద్ద నిల‌బ‌డి భ‌క్తుల‌కి అల్పాహారాన్ని అందించారు.. ఈ సేవా కార్య‌క్ర‌మం కోసం జ‌న‌సేన శ్రేణులు అర్ధ‌రాత్రి నుంచే రోడ్డు మీదికి వ‌చ్చి వంట‌ల‌తో స‌హా, ప్ర‌తి ప‌నిని ద‌గ్గ‌రుండి ప‌ర్య‌వేక్షించారు.. ఏ టెంట్ వ‌ద్ద జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు పార్టీ జెండాల‌ని కూడా వినియోగించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.. ఓట్లు…నోట్ల రాజ‌కీయాల‌కి దూరంగా., ప్ర‌జాసేవ చేయాల‌న్న సంక‌ల్పంతో చేసిన ఈ కార్య‌క్ర‌మానికి మంచి స్పంద‌న వ‌చ్చింది..

===================================

Share This:

653 views

About Syamkumar Lebaka

Check Also

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

13 + 11 =