Home / ఎడిటోరియల్స్ / జ‌న‌సైనికులారా.. ఇదే ఆఖ‌రి అవ‌కాశం.. మిస్స‌య్యామ‌ని బాధ ప‌డుతున్నారా.. బెజ‌వాడ రండి..

జ‌న‌సైనికులారా.. ఇదే ఆఖ‌రి అవ‌కాశం.. మిస్స‌య్యామ‌ని బాధ ప‌డుతున్నారా.. బెజ‌వాడ రండి..

రాజ‌కీయాల ప‌ర‌మార్ధం ప్ర‌జా సేవ‌.. దేశానికి స్వతంత్రం వ‌చ్చిన తొలి నాళ్ల‌లో నాయ‌కుల థియ‌రీ ఇదే.. రాను రాను రాజ‌కీయం స్వార్ధ‌పు రంగు పులుముకుంది.. ప్ర‌జా సేవ అన్న ప‌దం ప‌క్క‌కి పోయి.. స్వ సేవ‌.. అయినవారి సేవ అన్న ప‌దాలు తెర‌పైకి వ‌చ్చాయి.. ప‌ద‌వీ వ్యామోహం.. త‌రాల త‌ర‌బ‌డి అనుభ‌వించే విధంగా వార‌స‌త్వపు వాస‌న‌లు.. అందుకోసం చేయ‌రాని., చేయ‌కూడ‌ని ప‌నుల‌న్నీ చేయ‌డం.. రాజ‌కీయం పేరు చెబితేనే జ‌నాల‌కి ఎబ్బెట్టు పుట్టేసింది.. ఇలాంటి ప‌రిస్థితుల్లో భ్ర‌ష్టు ప‌ట్టిన రాజ‌కీయ వ్య‌వ‌స్థ‌ని గాడిన పెట్టేందుకు చీక‌ట్లో చిరుదివ్వెలా తెర పైకి వ‌చ్చింది జ‌న‌సేన‌.. ఓ స‌రికొత్త ఆలోచ‌న‌.. స్వ‌తంత్ర భార‌తం తొలి నాళ్ల‌లో మ‌హా నాయ‌కుల థియ‌రీ., అదే రాజ‌కీయాల‌కి ప‌ర‌మార్ధం ప్ర‌జా సేవ‌.. ప్ర‌జ‌ల్ని స‌మ‌స్య‌ల నుంచి దూరం చేయ‌డం.. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సిద్ధాంతం ఇదే.. తొలుత తాను ఆచ‌రించ‌డం.. ప‌ది మందితో ఆచ‌రింప‌చేయ‌డం.. మ‌రో ప‌ది మందిలో స్ఫూర్తిని నింప‌డం.. ప్ర‌జా బ‌లం ఉన్నా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లో పోటీ చేయ‌లేదు.. చేతిలో ఎలాంటి అధికారం లేదు.. ప‌ద‌వులూ లేవు.. అయినా అనుకున్న ల‌క్ష్యం వైపు దూసుకుపోతూనే ఉన్నారు..

నిత్యం ప్ర‌జా స‌మ‌స్య‌లపైనే ఆయ‌న ఆలోచ‌న‌.. ప‌రిష్కారం వైపే ఆయ‌న చూపు.. ఇలాంటి ఆలోచ‌న చాలా మందికి ఉంటుంది.. రాజ‌కీయాల్ని మార్చేయాల‌నీ., రాజ‌కీయాల్లోకి వ‌చ్చి ప్ర‌జ‌ల‌కి ఏదో చేయాల‌నీ.. అయితే ప్ర‌స్థుత రాజ‌కీయ వ్య‌వ‌స్థ మాత్రం అందుకు అనుకూలంగా లేదు.. మ‌రి ఏం చేయాలి.. ఇలాంటి వారి కోసం., దేశంలోనే తొలిసారి ఓ సాహ‌సోపేత నిర్ణ‌యం తీసుకున్నారు జ‌న‌సేన పార్టీ అధినేత‌.. ఔత్సాహికుల్ని వేదిక ఎక్కించాల‌ని నిర్ణ‌యించుకున్నారు.. చావ క‌లిగిన యువ‌కుల్ని., మేధ‌స్సు క‌లిగిన మేధావుల‌ని రాజ‌కీయాల్లో భాగస్వాములుగా చేయ‌డంతో పాటు సామాజిక బాధ్య‌త క‌లిగిన ప్ర‌తి ఒక్క‌రి సేవ‌లు ప్ర‌జ‌ల‌కి ఉప‌యోగ‌ప‌డేలా త‌న వంతు ప్ర‌య‌త్నం ప్రారంభించారు.. ఓ మ‌హాయ‌జ్ఞానికి రూపం ఇచ్చారు.. జ‌న‌సేన ఔత్సాహికుల వేదిక పేరిట ప్ర‌తి జిల్లాలో శిభిరాలు నిర్వ‌హించారు.. వేలాది మంది రాజ‌కీయ ఔత్సాహికుల ప్ర‌తిభ‌కి ప‌రీక్ష పెట్టారు.. ఎంద‌రు పాస్ అయ్యారు అనే ల‌క్ష్యాన్ని ప‌క్క‌న పెట్టి.. ఎంత మంది పార్టీ కోసం ముందుకి వ‌చ్చారు.. పార్టీ నిర్మాణంలో ఎవ‌రి స్థానం ఏంటి అన్న ఆలోచ‌న‌తో ముంద‌డుగు వేశారు..

పూర్తి నిబ‌ద్ద‌త‌తో ఈ మ‌హాయ‌జ్ఞాన్ని జ‌న‌సేన టీం ముందుకి న‌డిపించింది.. ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తులు., వ‌చ్చిన అంద‌రికీ అవ‌కాశం ఇవ్వ‌డం., ప్ర‌తిభ ఉన్న‌వారిని గుర్తించ‌డం.. పార్టీ అధినేత త‌మ భుజ‌స్కందాల‌పై ఉంచిన బాధ్య‌త‌ల్ని ఎలాంటి విమ‌ర్శ‌లు, వివాదాలు లేకుండా మోశారు.. ఇప్పుడు ఈ మ‌హాయ‌జ్ఞం ముగింపు ద‌శ‌కి వ‌చ్చింది.. జ‌న‌సేన చివ‌రి ఔత్సాహికుల వేదిక బెజ‌వాడ గ‌డ్డ‌పై జ‌ర‌గ‌నుంది.. ఈ నెల 7,8 తేదీల్లో.. దీంతో ఈ య‌జ్ఞం ముగుస్తుంది..

ఆశ‌., ఆస‌క్తి ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో చాలామంది వివిధ కార‌ణాల రిత్యా ఈ య‌జ్ఞంలో పాలుపంచుకోలేక పోయారు.. అలాంటి వారంతా ఈ చివ‌రి అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌చ్చు.. ఇరు రాష్ట్రాల నుంచి ఆస‌క్తి ఉండి., ఆయా జిల్లాల్లో ప్ర‌తిభాన్వేష‌న జ‌రిగిన స‌మ‌యంలో పాలుపంచుకోలేక పోయిన ఔత్సాహికులంతా విజ‌య‌వాడ వేదిక‌గా జ‌రిగే చివ‌రి శిభిరంలో పాల్గొన‌వ‌చ్చు.. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల నుంచి కొంత మంది మా జిల్లా కాదుగా., అక్క‌డికి మేం రావ‌చ్చా.. మాట్లాడ వ‌చ్చా ..? అన్న సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు.. జ‌న‌సేనుడికి కులం, మతం, ప్రాంతం అన్న బేధాలు లేవు.. అదే స‌మ‌యంలో జ‌న‌సైన్యానికి కూడా.. ఇలాంటి సామాజిక రుగ్మ‌త‌ల‌కి అతీతం జ‌రుగుతున్న ఈ య‌జ్ఞంలో 7,8 తేదీల్లో ఎవ‌రైనా నేరుగా శిభిరం వ‌ద్ద‌కి వ‌చ్చి., ద‌ర‌ఖాస్తు నింపి., త‌మ ప్ర‌తిభ‌ని ప‌రీక్షించుకోవ‌చ్చు.. ఎవ్వ‌రూ మీకు అడ్డు చెప్ప‌రు..

ఇక బెజ‌వాడ లారీ ఓన‌ర్స్ అసోసియేష‌న్ హాల్‌లో జ‌రిగే ఈ చివ‌రి వేదిక‌కు త‌ర‌లివ‌చ్చే ఔత్సాహికుల‌కి ఎలాంటి ఇబ్బందులూ క‌లుగ‌కుండా సేవాద‌ళ్ స‌భ్యులు ఏర్పాట్లు కూడా చేస్తున్నారు.. ఇప్ప‌టికే ఓ స‌మావేశం నిర్వ‌హించి., కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేసేందుకు అవ‌స‌ర‌మైన స‌ల‌హాలు, సూచ‌న‌లు జిల్లా స‌భ్యుల నుంచి స్వీక‌రించారు.. ఇక మ‌రికొన్ని గంట‌లు మాత్ర‌మే స‌మ‌యం ఉంది.. మీ జిల్లాల్లో వీలు ప‌డ‌ని వారు., శిభిరం ఉంద‌ని తెలియ‌క మిస్స‌యిన వారు.. ఇప్పుడు కొత్త‌గా జ‌న‌సేన ప‌ట్ల ఆస‌క్తి వ‌చ్చిన వారు.. ఎవ్వ‌రైనా ఇక్క‌డికి రావ‌చ్చు..

Share This:

1,346 views

About Syamkumar Lebaka

Check Also

ప్ర‌భుత్వ వైఫ‌ల్యాలే టార్గెట్‌.. ఓట్లు వేయ‌మ‌ని అడిగిన చోటే నిల‌దీస్తున్న జ‌న‌సేనాని..

అడుగ‌డుగునా వైఫ‌ల్యాలు.. ప్ర‌జ‌ల్ని మోసం చేస్తూ.. దోపిడీ చేస్తున్న పాల‌నా వ్య‌వ‌స్థ‌.. ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరిగిన ప్ర‌తి సారీ అదే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + four =