Home / జన సేన / జ‌న‌సైన్య‌పు ఉడుకు ర‌క్తాన్ని ఉర‌క‌లెత్తిస్తున్న జ‌న‌సేన జెండా పాట‌.. లిరిక్స్‌-ట్యూన్ అదుర్స్‌..

జ‌న‌సైన్య‌పు ఉడుకు ర‌క్తాన్ని ఉర‌క‌లెత్తిస్తున్న జ‌న‌సేన జెండా పాట‌.. లిరిక్స్‌-ట్యూన్ అదుర్స్‌..

జెండ‌ర‌.. జెండ‌ర‌.. జెండ‌ర‌.. జెండా.. గ‌ర్జిస్తున్న‌ది జ‌న‌సేన జెండా.. అనే ప‌వ‌ర్‌ఫుల్ ప‌ల్ల‌వితో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ జ‌నంబాట ప‌ట్టే ముందు వ‌చ్చిన జ‌న‌సేన జెండా పాట‌., యువ‌త ర‌క్తాన్ని మ‌రింత మ‌రిగిస్తోంది.. జ‌న‌సేన సిద్ధాంతాలు జెండా ఆకృతిని వివ‌రిస్తూ అనంత శ్రీరాం అల్లిన ప‌దాలు., అనూప్ రూబెన్స్ అందించిన స్వ‌రాలు.. జ‌న‌సైనికుల్లో ఉరిమే ఉత్సాహాన్ని నింపుతున్నాయి.. తెల్లాతెల్ల‌ని జెండా తెలుగోడి జెండా.. అంటూ స‌న్న‌గా మొద‌లైనా., ఎర్ర‌టి గెండెల జెండా మ‌న ఎలుగెత్తే జెండా అంటూ యువ హృద‌యాల‌ను ఉర్రూత‌లూగిస్తున్నాయి.. అణ‌గారిన వ‌ర్గాల‌కు అండా దండ‌గా ఉంటామంటూ.. విన‌బ‌డే మ‌రో చ‌ర‌ణం.. జ‌నం మ‌ధ్య‌కు దూసుకువెళ్తున్నాయి.. జెండా ప‌ట్టు జెండా ప‌ట్టు జ‌న‌సైనికుడా.. ఎత్తిన జెండా దించ‌మాకు ఎపుడూ ఎక్క‌డా అనే కంక్లూజ‌న్‌కి అయితే యావ‌త్ జ‌న‌సైన్యం హ్యాట్సాఫ్ చెబుతోంది..

జెండా పాట‌లో మిగిలిన చ‌ర‌ణాలు జ‌న‌సేన సప్త సిద్ధాంతాల‌ను చాటుతూ ముందుకి సాగుతున్నాయి.. కులాల‌ని క‌లిపే జెండా.. మ‌తాల మాట ఎత్త‌ని జెండా.. ప్ర‌తి భాష‌ని కొలిచే జెండా.. ప్ర‌తి సంస్కృతి మ‌న‌ద‌నే జెండా.. ప్రాంతాల‌ను గౌర‌వించు జాతీయ‌వాదం.. ప్ర‌కృతినెపుడు ప్రేమించే ప్ర‌గ‌తి నినాదం.. అవినీతితో ఎల్ల‌పుడు అలుపెరుగ‌ని యుద్ధం.. ఈ ఏడు సైత్రాలు ఏడు అంగాలుగా క‌లిసి మధ్య అరుణ‌తార‌గా., ఎర్ర‌టి న‌క్షిత్రంగా మారి ప్ర‌జ‌ల జీవితాల్లో వెలుగులు వెద‌జ‌ల్లే జెండా అంటూ రాసిన ప‌దాలు పాట‌కే హైలెట్ అని చెప్పుకోవాలి..

జ‌న‌సేన జెండా పాట విడుద‌లైన కొద్ది గంట‌ల్లోనే కొన్ని ల‌క్ష‌ల మంది యూట్యూబ్‌లో వీక్షించ‌డంతో పాటు కొన్ని ల‌క్ష‌ల మంది పాట‌ను డౌన్లోడ్ చేశారు.. జెండా పాట కేవ‌లం జ‌న‌సేన కార్య‌క‌ర్త‌ల్ని మాత్ర‌మే కాదు.. య‌వాత్ ప్ర‌జానికాన్ని కూడా ఆక‌ట్టుకుంటోంది.. తూర్పుదిక్కు ఎరుపెక్కి అంటూ మొద‌ల‌య్యే జ‌న‌సేన థీమ్ సాంగ్‌కి జెండా పాట తోడుకానుంది.. జ‌న‌సేనుడి ప్ర‌జా యాత్ర‌కి ముందు ఇలాంటి ఉత్సాహాన్నిచ్చే పాట‌ని అందించినందుకు ర‌చ‌యిత-సంగీత ద‌ర్శ‌కుల‌కి జ‌న‌సైన్యం ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తోంది..

Share This:

About Syamkumar Lebaka

Check Also

ప‌లాస‌లో నేడు జ‌న‌సేన నిర‌స‌న క‌వాతు.. కాశీబుగ్గ బ‌స్టాండ్ వ‌ద్ద జ‌న‌సేనుడి గ‌ర్జ‌న‌..

విభ‌జ‌న‌తో వంచించ‌బ‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల త‌రుపున‌, ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కార‌మే ధ్యేయంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చేప‌ట్టిన పోరాట యాత్ర …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ten + 1 =

%d bloggers like this: