Home / జన సేన / జ‌న సేనాని అడుగు జాడ‌ల్లో సైన్యం..

జ‌న సేనాని అడుగు జాడ‌ల్లో సైన్యం..

img-20161127-wa0005

ఎదుటివాడి క‌ష్టాలు చూసి క‌రిగిపోవ‌డం కాదు.. ఆ క‌ష్టాలు తీర్చాలి.. హామీలు ఇవ్వ‌డం కాదు ఆచ‌ర‌న కావాలి.. ఇదే ప‌వ‌న్ ఇజం.. స‌మ‌స్య ఏదైనా అందుకు కార‌కులు ఎంత‌వార‌లైనా ఎదిరు నిల‌బ‌డ‌డం, నిల‌దీయ‌డం.. ప‌రిష్కార‌య‌మ్యే వ‌ర‌కు పోరాటం చేయ‌డం జ‌న‌సేనానికి తెలిసిన ప‌ని.. ప్ర‌స్తుతం పెద్ద నోట్ల ర‌ద్దు వ్య‌వ‌హారంలో ప్ర‌జ‌లు ప‌డుతున్న ఇక్క‌ట్ల‌ను చూసి చ‌లించిన ప‌వ‌న్‌., పాల‌కుల్ని నిల‌దీస్తుంటే., ఆయ‌న సైన్యం క‌ష్టాల్లో ఉన్న ఆప‌న్నుల‌ని ఆదుకునేందుకు ముందుకు వ‌స్తోంది.. త‌మ‌కు వీలైనంత‌, చేత‌నైనంత సాయం చేస్తూ సంతృప్తి ప‌డుతోంది.. మొన్న ఏటీఎంల‌ వ‌ద్ద ఎమ‌ర్జెన్సీ అన్న‌వారికి డ‌బ్బు పంచిన జ‌న‌సైన్యం., ఇప్పుడు ఆసుప‌త్రుల్లో రోగుల‌కు సేవ చేసేందుకు ముందుకు వ‌చ్చింది.. స‌ర్కారీ దావ‌ఖానల్లో ఎమ‌ర్జెన్సీ వార్డుల వ‌ద్ద‌., రోగుల అవ‌స‌రాలు తీర్చేందుకు క‌దిలింది.. త‌మ స్థోమ‌త మేర‌కు చిల్ల‌ర నోట్ల‌ను పోగేసి అత్య‌వ‌స‌రం ఉన్న వారికి., పాత పెద్ద నోట్లు మార‌క ఇబ్బందులు ప‌డే వారికి పంచింది..

img-20161127-wa0009

నిత్యం వంద‌లాది మంది రోగులు సంద‌ర్శించే నిమ్స్ ఆసుప‌త్రిని జ‌న‌సైన్యం త‌మ సేవ‌కు వేదిక‌గా ఎంచుకుంది.. ఇంటి పెద్ద చ‌నిపోయాడు శ‌వం తీసుకుపోదామంటే పెద్ద నోట్లు ప‌డ‌వంటున్నారు.. అన్నా ఆదుకోండి అంటున్న ఓ త‌మ్ముడికి చిల్ల‌ర నోట్లు ఇచ్చి సాయం చేసింది మ‌న సేన‌.. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయ‌ప‌డిన అన్న‌కు మందుల కోసం ఓ త‌మ్ముడు ప‌డుతున్న ఆవేధ‌న‌ను తీర్చింది.. ఏటీఎం వ‌ద్ద క్యూలో నిల్చున్నా., త‌న వంతు వ‌చ్చేస‌రికి డ‌బ్బు ఖాళీ అయి నిరాశ‌తో ఉన్న అత‌న్ని ప‌వ‌న్ సైన్యం అక్కున చేర్చుకుంది..

img-20161127-wa0003

ఓ బాలింత ఆక‌లి తీర్చేందుకు పాత పెద్ద నోట్ల‌ను మార్చి., చిల్ల‌ర నోట్లు అప్ప‌గించి సాయం చేసింది.. ఓ ప‌సిగుడ్డు గొంతులో పాలు పోసింది.. ప్ర‌భుత్వం పాల‌కులు విఫ‌ల‌మైన ప్ర‌తి చోట తాము నిల‌బ‌డ‌తామ‌న్న జ‌న‌సేనాని, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మాట‌ని నిల‌బెడుతూ ఆయ‌న సేన చేసిన సాయం చాల మంది నోట జ‌నం కోస‌మే ఈ జ‌న‌సేన పుట్టింది అన్న మాట‌లు విన‌బ‌డేలా చేసింది..

Share This:

494 views

About Syamkumar Lebaka

Check Also

చేయి చేయి క‌లిపిన ఎన్‌.ఆర్‌.ఐ జ‌న‌సైనికులు.. సాటి జ‌న‌సైనికుడికి ఆప‌న్న‌హ‌స్తం..

భావ‌న వెంక‌టేష్‌.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ వీరాభిమాని.. భ‌గ‌త్‌సింగ్ విద్యార్ధి విభాగం స‌భ్యుడు.. చిన్నత‌నంలోనే త‌ల్లిదండ్రుల్ని కోల్పోయిన వెంక‌టేష్‌కి అనుకోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − 10 =