Home / సేన సేవ / జ‌య‌హో జ‌న‌సేనాని.. త‌మ బ్రాండ్ అంబాసిడ‌ర్‌కు నేత‌న్న‌ల జేజేలు..

జ‌య‌హో జ‌న‌సేనాని.. త‌మ బ్రాండ్ అంబాసిడ‌ర్‌కు నేత‌న్న‌ల జేజేలు..

img-20170116-wa0070-copy

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ డ‌బ్బు కోసం ఓ బ్రాండ్‌ని ప్ర‌మోట్ చేయ‌డం వంటి వాటికి దూరంగా ఉన్నారు.. కోట్ల‌కు కోట్లు సంపాద‌న వ‌చ్చే అవ‌కాశం ఉన్నా., ఏనాడూ, ఏ ఎండార్స్‌మెంట్ మీదా సంత‌కం చేయ‌లేదు.. అయితే దేశ సంప‌ద అయిన చేనేత కార్మికుల్ని క‌పాడేందుకు., వారి క‌ష్టాల‌ను క‌డ‌తేర్చేందుకు., నేత‌న్న బ్రాండ్‌ని భుజాన వేసుకున్నారు.. చేనేత‌ల స‌మ‌స్య‌ల‌కు చ‌లించిన ఆయ‌న వారికి బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా ఉండేందుకు స్వ‌చ్చందంగా ముందుకు వ‌చ్చారు.. జ‌న‌సేనుడు, ప‌వ‌ర్‌స్టార్ ఓ బ్రాండ్ ప్ర‌మోట‌ర్‌గా ఉంటే., ఆ బ్రాండ్ వాల్యూ., ఏ రేంజ్‌లో ఉంటుందో వేరే చెప్ప‌న‌వ‌స‌రం లేదు.. ఇప్ప‌టికే తెలుగు రాష్ట్రాల్లో విదేశీ వ‌ద్దు., చేనేతే ముద్దు అంటూ ఉద్య‌మం మొద‌లైంది.. జ‌న‌సైనికులతో పాటు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభిమానులు సైతం ఇప్ప‌టికే ఖాదీ వాడ‌కం మొద‌లుపెట్టేశారు…

చేనేత వాడ‌కం దిశ‌గా జ‌నాన్ని క‌దిలించేందుకు త‌మ‌కు ఎవ‌రి ప్ర‌య‌త్నాలు వారు ప్రారంభించేశారు.. ప‌ద్యాల రూపంలో., ప‌ద క‌విత‌ల రూపంలో జ‌న‌సేనుడికి మ‌ద్ద‌తుగా చేనేత కార్మికుల్ని ప్ర‌మోట్ చేస్తున్నారు..

ఇక జ‌న‌సేనుడే స్వ‌యంగా త‌మ‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా దొర‌క‌డం ప‌ట్ల నేత‌న్న‌లు కూడా సంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు.. జ‌య‌హో జ‌న‌సేనాని అని వేనోళ్ల పొగుడుతున్నారు.. ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌కీయ నాయ‌కులంతా., త‌మ ఓట్ల‌తో గెల‌వ‌డ‌మే గాని., త‌మ‌కు చేసింది ఏమీ లేదంటున్న చేనేత‌లు., పార్టీ పెట్టిన రెండేళ్ల‌లోనే త‌మ క‌ష్టాలు గ్ర‌హించి., త‌మను ఆదుకునేందుకు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ స్వ‌చ్చందంగా ముందుకి రావ‌డం ప‌ట్ల హ‌ర్షాతిరేకాలు వ్య‌క్తం చేస్తున్నారు..

ఎలాంటి ప‌ద‌వులు లేక‌పోయినా., త‌మ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి త‌న వంతు సాయం చేసిన ప‌వ‌న్‌., నాయ‌కుడైతే మ‌రింత మేలు చేస్తార‌ని న‌మ్మ‌కాన్ని వ్య‌క్తం చేస్తున్నారు..

చేనేత సంఘాల నాయ‌కులు ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌ని క‌ల‌వ‌క‌ముందే., అనంత‌పురం జిల్లాకి చెందిన జ‌న‌సైనికులు ప‌సుపులేటి సందీప్‌, ప‌వ‌నిజం రాజు యాదికి సునీల్ త‌దిత‌రులు చేనేత‌ల క‌ష్టాల‌పై ఓ డాక్యుమెంట‌రీ రూపొందించారు.. స్థానిక నేత‌ల్లో క‌ద‌లిక తెచ్చారు.. ఇప్పుడు త‌మ దేవుడే చేనేత‌ల క‌ష్టాలు తీర్చేందుకు ముందుకి రావ‌డంతో., త‌మ కృషి ఫ‌లించిన‌ట్టేన‌ని భావిస్తున్నారు..

 

 

Share This:

1,873 views

About Syamkumar Lebaka

Check Also

విజ‌యం వ‌రిస్తుందో.? లేదో.? తెలియ‌దు.. ప‌ని మాత్రం మొద‌లెట్టేశాడు.. ద‌టీజ్‌ జ‌న‌సేన‌..

సామాజిక మాధ్య‌మాల్లో మూడు లైన్ల పోస్టు ఓ రేంజ్‌లో వైర‌ల్ అవుతోంది.. తిరిగి అధికారంలోకి రాక‌పోతే టీడీపీ అధినేత చంద్ర‌బాబు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

19 + 6 =