Home / సేన సేవ / జ‌య‌హో ప‌వ‌న్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌.. ఇంకొంచెం హెల్ప్ ప్లీజ్‌..

జ‌య‌హో ప‌వ‌న్‌కళ్యాణ్ ఫ్యాన్స్‌.. ఇంకొంచెం హెల్ప్ ప్లీజ్‌..

img-20170106-wa0028 img-20170106-wa0033

జ్వ‌రం వ‌చ్చింద‌ని ఆసుప‌త్రికి వెళ్తే., ఓ వైద్యుడి నిర్ల‌క్ష్యం 12 సంవ‌త్స‌రాల ఫ‌ణీంద్ర అనే ఈ బాబు ఆరోగ్యాన్ని కాటేసింది.. అంతుతెలియ‌ని రోగం ఆవ‌హించి., రోజు రోజుకీ బాబుని జీవ‌శ్చ‌వంలా మార్చింది.. 2014లో జ‌రిగిన ఈ ఘోరంపై స‌ద‌రు వైద్యుడ్ని నిల‌దీసినా ఫ‌లితం ద‌క్క‌లేదు.. అయితే త‌మ బాబుని కాపాడుకునేందుకు ఆ త‌ల్లిదండ్రులు ఎంతో మంది డాక్ట‌ర్ల‌కు చూపించారు.. డాక్ట‌ర్ అలోక్‌శ‌ర్మ ఫ‌ణీంద్ర‌కు ట్రీట్‌మెంట్ ఇచ్చేందుకు ముందుకి వ‌చ్చారు., అయితే స్టెమ్ సెల్ థెర‌పీ ద్వారా చేసే ఈ వైద్యం చాలా ఖ‌ర్చుతో కూడుకున్న‌ద‌ని చెప్పారు..

ఖ‌మ్మంలో శ్రీజ అనే పాప‌కి జ‌న‌సేనాని, ప‌వ‌న్‌క‌ళ్యాణ్ సాయం చేశార‌ని తెలిసి., ఫ‌ణీంద్ర‌త‌ల్లి ఆయ‌న్ని క‌లిసే ప్ర‌య‌త్నం చేసింది.. ఆయ‌న అందుబాటులో లేర‌ని తెలిసి వెనుదిర‌గ‌బోతున్న ఆమెకు., జ‌న‌సేనాని అభిమానులు దేవుడు పంపిన దూత‌ల్లా తార‌స‌ప‌డ్డారు.. ఆమె బాధ తెలుసుకుని., ఫ‌ణీంద్ర‌ని ఆదుకునేందుకు ముందుకి వ‌చ్చారు.. అత‌ని వైద్యానికి అయ్యే ఖ‌ర్చులు, మందుల‌కు, ప్రొటీన్స్ ఇచ్చేందుకు అయ్యే మొత్తాన్ని సాయం చేస్తూ వ‌చ్చారు.. ఒక్కో సిట్టింగ్ మూడు ల‌క్ష‌ల వ‌ర‌కు ఖ‌ర్చు అవుతున్న నేప‌ధ్యంలో ఇత‌ర దేశాల్లో ఉంటున్నా జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు కూడా ఫ‌ణీంద్ర‌కి హెల్ప్ చేస్తామంటూ ముందుకి వ‌చ్చారు.. కువైట్ జ‌న‌సేన స‌భ్యుల‌తో పాటు యూకేకి చెందిన శ్రీధ‌ర్‌, నాగేంద‌ర్‌, యూఎస్‌కి చెందిన సందీప్ ఫ్రెండ్స్ కొంత మొత్తాన్ని బాధితుడి అకౌంట్లో జ‌మ చేశారు.. అభాగ్యుల‌ను ఆదుకునేందుకు జ‌న‌సేనాని చూపిన బాట‌లో తామూ న‌డుస్తామ‌ని చాటారు…

జ‌న‌సైన్యం పుణ్య‌మా అని ఫ‌ణీంద్ర స్టెమ్ సెల్ థెర‌పీలో మూడు సిట్టింగ్‌లు పూర్త‌య్యాయి.. మ‌రో మూడు సిట్టింగ్‌లు బాకీ ఉన్నాయి.. త‌దుప‌రి స్టెమ్ సెల్ థెర‌పీ ఈ ఏడాది మార్చ్ రెండో వారంలో చేయాల్సి ఉంది.. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సైనికుల సాయంతో నెట్టుకు వ‌చ్చిన ఫ‌ణీంద్ర త‌ల్లిదండ్రులు., ప్ర‌స్తుతం అత‌నికి ఫిజియో థెర‌పీ కూడా చేయించ‌లేని స్థితికి వ‌చ్చారు.. గ‌డ‌చిన 15 రోజులుగా ఎలాంటి వైద్యం చేయించ‌లేదు.. త‌మ కుమారుడు కొంచెం కొంచెం కోలుకుంటున్నందుకు ఆనందించాలో., త‌దుప‌రి వైద్యం ఖ‌ర్చుల‌కి డ‌బ్బు లేనందుకు ఏడ‌వాలో తెలియ‌ని ప‌రిస్థితిలో ఫ‌ణీంద్ర త‌ల్లి ఉంది… త‌న‌కు అండ‌గా నిల‌చిన ప‌వ‌న్ అభిమానులు., మ‌రికొన్ని రోజులు సాయం చేసి., త‌న‌కు పుత్ర భిక్ష పెట్ట‌మ‌ని వేడుకుంటోంది..

img-20170106-wa0024

జ‌న‌సేనాని అభిమానుల సాయం మృత్యుముఖాన్ని చూసిన ఆ బాలుడికి తిరిగి ఊపిరి పోసింది.. ఆ ఊపిరి గ‌ట్టిది కావాలంటే., మ‌రికొంత సాయం అవ‌స‌రం., ఎవ‌రైనా ఫ‌ణీంద్ర‌కి సాయం చేయ‌ద‌లుచుకుంటే కింది అకౌంట్ల ద్వారా మీ సాయాన్ని అందించండి.. జైహింద్‌…

NGO Current Account –
name – AWAKE (association Of Welfare Awareness Knowledge Equality) Account Number – 31185572840 ,
IFSC Code – SBIN0013229
Nagayalanka Branch, Krishna Dist
521120;
for NRI Transactions
Savings account Number –
ICICI Bank ,
Account – 602601547236
Name – Venkata Ramana B, IFSC – ICIC0006026,
Tnagar Branch, Chennai – 600017.
please see the health update in this playlist videos.
With best regards,
Team AWAKE.
+91 9515022848

Share This:

1,858 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేవ‌కి క‌దిలిన జ‌న‌సైన్య‌పు స‌మూహం.. విశాఖ తీరంలో భ‌క్తుల‌కి ప్ర‌సాద విత‌ర‌ణ‌..

మార్పు రావాలంటే ఓ స‌మూహం ఒక్క‌టై ముందుకి క‌ద‌లాలి.. నిబ‌ద్ద‌త‌తో ప‌ని చేయాలి.. అప్పుడే ఎంత‌టి క‌ష్ట‌మైన ప‌నిలో అయినా …

One comment

  1. ధన్యవాదాలు సార్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

4 × 1 =