Home / ప‌వ‌ర్‌ పంచ్‌ / జ‌ర్న‌లిస్టు హ‌త్య‌పై స్పందించిన జ‌న‌సేనుడు.. కోడి గుడ్డుపై ఈక‌లు పీకిన సాచ్చీ(క్షీ) అండ్ కో..

జ‌ర్న‌లిస్టు హ‌త్య‌పై స్పందించిన జ‌న‌సేనుడు.. కోడి గుడ్డుపై ఈక‌లు పీకిన సాచ్చీ(క్షీ) అండ్ కో..

జ‌ర్న‌లిస్టు గౌరీ లంకేశ్ హ‌త్య దేశ వ్యాప్తంగా ప్ర‌కంప‌న‌లు రేపిన విష‌యం అంద‌రికీ తెలిసిందే.. సామాజిక స్పృహ‌తో త‌న బాధ్య‌త‌ను నిర్వ‌హిస్తున్న ఓ పాత్రికేయురాలి గొంతు బ‌ల‌వంతంగా నొక్క‌డం ప‌ట్ల జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ తీవ్రంగా స్పందించారు.. భావ‌ప్ర‌క‌ట‌నా స్వేచ్చ‌ను భ‌గ్నం చేయ‌డం ప‌ట్ల అసంతృప్తి వ్య‌క్తం చేశారు.. భిన్న‌త్వంలో ఏక‌త్వాన్ని పాటించే భార‌త దేశంలో ఎదుటి వ్య‌క్తి అభిప్రాయాలు మ‌న‌కి న‌చ్చ‌న‌ప్పుడు., వారిని హ‌త‌మార్చి తమ అభిప్రాయాల‌ను బ‌ల‌ప‌ర్చుకోవాల‌నుకోవ‌డం దారుణ‌మ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. హ‌త్య వెనుక వాస్త‌వాలు తెలుసుకోకుండా., దాన్ని హిందూత్వ శ‌క్తుల‌కి ఆపాదించ‌న‌ని తేల్చారు.. ఈ హ‌త్య త‌న‌కు ఎలా తోచిందో చెప్పే క్ర‌మంలో పెరూకి చెందిన ప్ర‌ముఖ ర‌చ‌యిత ఫెర్నాండో డిసోటో వ్యాఖ్య‌ల‌ని గుర్తు చేశారు.. ప్ర‌త్య‌ర్ధితో చ‌ర్చించే అంశాలు క‌రువైన‌ప్పుడే మందుగుండు అవ‌స‌రం ఏర్పాడుతుంద‌న్న‌దే ఆ మాట‌.. అదే ఇప్పుడు ఓ నిజాయితీ గ‌ల జ‌ర్న‌లిస్టు ప్రాణాలు తీసింద‌న్నారు.. ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టుని హ‌త‌మార్చ గెలిచేశాం అనుకుంటే పప్పులో కాలేసిన‌ట్టేన‌న్నారు.. వంద మంది గౌరీ లంకేశ్‌లు ఇటువంటి పిరికి చ‌ర్య‌ల‌ను ప్ర‌తిఘ‌టించేందుకు సిద్ధంగా ఉంటార‌న్నారు.. ఇటు వంటి పిరికి చ‌ర్య‌లు దోషుల ఉనికినే ప్ర‌శ్నార్ధ‌కంగా మారుస్తాయ‌న్నారు.. గౌరీ లంకేశ్ ఆత్మ‌కి శాంతి చేకూరాల‌ని భ‌గ‌వంతుని ప్రార్ధించారు..

జ‌న‌సేనుడు ఇంత సీరియ‌స్‌గా హ‌త్యపై స్పందిస్తే., ప్ర‌తిప‌చ్చ ప‌త్రిక సాచ్చీ., సోష‌ల్ మీడియాలో దాని అనుబంధ మిత్రవ‌ర్గం. కోడిగుడ్డుపై ఈక‌లు పీకే ప‌నిని మొద‌లుపెట్టారు.. సాచ్చీ గౌరీ లంకేశ్‌ను బై మిస్టేక్ గౌరీ శంక‌ర్ అని రాసిన ట్వీట్‌ను బ‌య‌ట‌కి తీసి., ఓ ప్ర‌ధాన సంచిక‌లో వార్త‌గా మ‌ల‌చేసింది.. ఈ త‌ర్వాత జ‌న‌సేనుడు చేసిన స‌వ‌ర‌ణ ట్వీట్‌ని వీరు చూడ‌లేదు కాబోలు.. లేదంటే కేవ‌లం జ‌న‌సేనానికి జ‌నంలో వ్య‌తిరేక‌త రేపే ప్ర‌య‌త్నం చేయ‌డం ఎంటి..? ఇంత‌కీ మీరు జ‌నానికి ఏం చెప్ప‌ద‌ల‌చుకున్నారు.. ఉద్దానం ప‌తాక శీర్ష‌క అంశం కాదా., కేవ‌లం ప‌వ‌న్ పొర‌పాటున పెట్టిన ఒక్క అక్ష‌రాన్ని ప‌ట్టుకుని సాగ‌దీస్తారా..?   పైగా వార్త మీ పెయిడ్ ఆర్టిస్టుల‌తో రాయించి., దాన్ని నెటిజ‌న్ల‌పైకి నెట్ట‌డం చీ…. మీ…. బుద్ది మార‌దా..?  స్పందించ‌క‌పోతే స్పందించ‌లేదంటారు.. స్పందిస్తే ఆల‌స్యంగా స్పందించారు అంటారు.. మ‌రి అస‌లు స్పందించ‌ని మీ నేత‌ల గురించి లేదా రాయడానికి ఏమీ..?

ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప‌ట్ల వ్య‌తిరేక‌తో ఎవ‌రు ఉన్నారు..? ఎందుకు ఉన్నారు..? అని ప‌ట్టుకుని మ‌రీ సోష‌ల్ మీడియాలో కామెంట్లు చేయిస్తున్నారు.. విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు.. మంచి చేస్తే చెప్పుకోలేరు.. చెడు ఉంటే మాత్రం ప్ర‌చార సాధ‌నం ఇదిగో అంటూ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నారు.. మీరు శంక‌ర్ అని రాస్తే త‌ప్పులేదు గానీ., జ‌న‌సేనాని పొర‌పాటుగా రాస్తే మాత్రం అది మ‌ర్డ‌ర్ చేసినంత త‌ప్పు.. రాష్ట్రాన్ని తాక‌ట్టు పెట్టేసిన‌ట్టో., అమ్మేసిన‌ట్టే ఫీల‌వుతూ ఉంటారు.. ఇప్ప‌టికే ఎల‌క్ట్రానిక్ మీడియా అనే పాయింట్‌ని జ‌నం మ‌ర‌చిపోయారు.. ఇప్పుడు మీ త‌ప్పుడు రాత‌ల‌తో జ‌నంలో అస‌హ‌నం పెరిగిపోతోంది.. మీ ప‌త్రిక ప‌ది కాలాల‌పాటు ప‌చ్చ‌గా ఉండాలా.. ఇలాంటి చీప్ ట్రిక్స్‌ని ప్లే చేసే వాళ్ల‌కి మాత్రం త‌లొగ్గే ప‌రిస్థితి ఉండ‌దు.. జ‌న స‌మూహం అనే అర్ధం వ‌చ్చే జ‌న‌సేనకి త‌గ్గ‌ట్టు ప‌నిచేసేందుకు రెడీ అన్నారు.. అయితే సేవాద‌ళ్‌ని విస్త్రుత ప‌రిచే క్ర‌మంలో సేవ‌లు మ‌రింత విస్త‌రించాల్సిన అవ‌స‌రం ఉంది.. ఇప్ప‌టికే ఉభ‌య రాష్ట్రాల్లో ప్ర‌ధాన ప్ర‌త్య‌ర్ధిగా భావించే అంతా జ‌న‌సేన‌పై ప్ర‌త్యేక దృష్టి సారించారు.. కానీ ప‌వ‌న్ బ‌లం, బ‌లగం ముందు ఏవీ నిల‌బ‌వ‌ని మ‌రోసారి తేలిపోయింది..

Share This:

6,299 views

About Syamkumar Lebaka

Check Also

జ‌న‌సేనాని వ‌ల్లే టీడీపీ గెలిచింది.. ఆ విష‌యం అంద‌రికీ తెలుసు.. ప‌చ్చ నేత‌ల‌కి గృహిణి కౌంట‌ర్‌.

మేం ఎప్పుడు టీడీపీకి ఓటు వేసి ఎరుగం.. మీరు చెప్ప‌డం వ‌ల్లే ఓటు వేశామ‌ని ఓ గృహిణి జ‌న‌సేనానికి చెప్పింది.. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

16 + nineteen =