Home / పవన్ టుడే / జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మ స్ఫూర్తితో ప్ర‌త్యేక హోదా సాధిద్దాం- ఆంధ్రుల‌కు జ‌న‌సేనాని పిలుపు..

జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మ స్ఫూర్తితో ప్ర‌త్యేక హోదా సాధిద్దాం- ఆంధ్రుల‌కు జ‌న‌సేనాని పిలుపు..

img_9015 img_9016

త‌మ సంప్ర‌దాయంపై దెబ్బ‌కొట్టాల‌ని చూసిన కేంద్రంపై త‌మిళ తంబిలు తిర‌గ‌బ‌డ్డారు.. విభేదాలు ప‌క్క‌న‌పెట్టి ఒక్క‌టిగా అడుగు వేశారు.. ఫ‌లితం జల్లిక‌ట్టుపై నిషేధం అన్న కేంద్రం వెన‌క్కిత‌గ్గింది.. ఈ విష‌యంలో త‌మిళుల త‌రుపున తాను సైతం ఓ గొంతు క‌లిపిన‌., జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., జిల్లిక‌ట్టుపై ఆర్డినెన్స్ జారీ చేయాల‌ని కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని పార్టీ త‌రుపున స్వాగ‌తించారు.. ప‌రిస్థితి చేయి దాట‌క‌ముందే స‌రైన స‌మ‌యంలో స‌ముచిత నిర్ణ‌యం తీసుకున్నార‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. జ‌ల్లిక‌ట్టు నిషేధంపై త‌మిళ‌నాట అంకురించిన ఉద్య‌మం., గ‌తంలో జ‌రిగిన హిందీ వ్య‌తిరేక ఉద్య‌మంలా మార‌క‌ముందే కేంద్రం విజ్ఞ‌త ప్ర‌ద‌ర్శించ‌డంతో., దేశ స‌మ‌గ్ర‌త‌కు భంగం క‌లిగే ప‌రిస్థితి త‌ప్పింద‌ని ప‌వ‌న్ అన్నారు.. భార‌త సంస్కృతి సంప్ర‌దాయాల వైవిద్యాన్ని మున్ముందు గౌర‌వించ‌క‌పోతే., ఇటువంటి ఆందోళ‌న‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించారు..

img_9017img_9019

త‌మ సంస్కృతిని కాపాడుకునేందుకు త‌మిళులు చేసిన పోరాటాన్ని జ‌న‌సేనాని వేనోళ్ల కొనియాడారు.. త‌మిళుల పోరాట‌ప‌టిమ‌ను ఈ ఉద్య‌మం ప్ర‌తిభింబించిద‌ని ప‌వ‌న్ అభిప్రాయ‌ప‌డ్డారు.. కుల‌మ‌తాల‌కు అతీతంగా త‌మిళులంతా ఏక‌మై జ‌ల్లిక‌ట్టుకు నిన‌ధించ‌డం స్ఫూర్తిదాయ‌క‌మ‌న్నారు.. జ‌ల్లిక‌ట్టుపై నిషేధానికి నిర‌స‌న‌గా ల‌క్ష‌లాది మంది మెరీనా బీచ్‌కి చేరిన‌ప్ప‌టికీ., ఎక్క‌డా ఎలాంటి అసాంఘీక సంఘ‌ట‌న‌లు చోటు చేసుకోక‌పోవ‌డం అంతా హ‌ర్షించ‌ద‌గ్గ విష‌య‌మ‌న్నారు.. త‌మిళుల సంఘ‌టిత శ‌క్తి., అహింసాయుత‌మైన ప‌ద్ద‌తి త‌న‌ను క‌దిలించాయ‌ని ప‌వ‌న్ చెప్పారు.. మ‌న ద్ర‌విడ సంస్కృతిపై త‌మిళుల ముక్కువ‌., వారు దాన్ని కాపాడుకున్న వైనాన్ని జ‌న‌సేనాని కొనియాడారు..

img_9018

త‌మిళ‌నాడులో జ‌రిగిన జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మం నుంచి ఆంధ్రులు నేర్చుకోవ‌ల్సింది ఎంతైనా ఉంద‌న్న విష‌యాన్ని జ‌న‌సేనుడు గుర్తుచేశారు.. మ‌న రాజ‌కీయ నాయ‌కులు సైతం ఇటువంటి సంఘీభావాన్ని ప్ర‌ద‌ర్శించాల‌ని కోరారు.. జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మ‌స్ఫూర్తితో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా సాధించాల‌ని ప‌వ‌న్ పిలుపునిచ్చారు.. అయితే వ్యాపార అవ‌స‌రాలు ఎక్కువ‌గా ఉండి., రాజ‌కీయ నిబ‌ద్ద‌తి త‌క్కువ‌గా ఉండే మ‌న రాజ‌కీయ నేత‌లు త‌మిళ ఉద్య‌మం నుంచి ఎంత వ‌ర‌కు స్ఫూర్తి పొందుతార‌నే అంశంపై ఆయ‌న అనుమానం వ్య‌క్తం చేశారు.. అయితే ప్ర‌త్యేక హోదా సాధించే విష‌యంలో రాజ‌కీయ నేత‌లు రాజీ ప‌డినా., ప్ర‌జ‌లు మాత్రం రాజీప‌డ‌ర‌న్న న‌మ్మ‌కాన్ని ప‌వ‌ర్‌స్టార్ వ్య‌క్తం చేశారు..

మ‌రి మ‌న రాష్ట్రం కోసం., రాష్ట్ర ప్ర‌జ‌ల కోసం నాయ‌కులు ఏం చేస్తారో..? వారికి ఓట్లు వేసిన జ‌నం ఏం చేస్తారో..? చూద్దాం.. జ‌న‌సేనుడి ఉద్య‌మంలో అంతా క‌ల‌సివ‌స్తారో.., జ‌నంతో క‌లిసి జ‌న‌సేనాని ఒక్క‌డే పోరాడాలంటారో కూడా చూడాలి.. హోదా కోసం ఎలాంటి అడుగు ప‌డినా., అది జ‌ల్లిక‌ట్టు ఉద్య‌మం లాంటిది కావాల‌ని కోరుకుందాం..

Share This:

1,925 views

About Syamkumar Lebaka

Check Also

ధర్మవరంలో జనసైనికులపై పెట్టిన అక్రమ కేసులు రద్దు చేయాలి-పవన్ డిమాండ్

తిరునాళ్ల ఉత్సవాల్లో భాగంగా ఓ సాంఘీక నాటక ప్రదర్శనలో జనసేన పార్టీ జెండాలు ప్రదర్శించినందుకు దుర్గి ఎస్సై గ్రామస్తుల మీద …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eighteen + seventeen =