Home / పవన్ టుడే / టార్గెట్ జేడీ మిస్ ఫైర్‌.. టాపిక్ డైవ‌ర్ట్ చేసిన విజ‌య‌సాయి(ఏ2)..

టార్గెట్ జేడీ మిస్ ఫైర్‌.. టాపిక్ డైవ‌ర్ట్ చేసిన విజ‌య‌సాయి(ఏ2)..

వెనుక‌టికి ఒక‌మ్మ రంకు బ‌య‌ట‌ప‌డిందని బొంకు మొద‌లుపెట్టిందంట‌..! అలా ఉంది వైసీపీ త‌ప్పుడు లెక్క‌ల ఆడిట‌ర్ విజ‌య‌సాయిరెడ్డి ప‌రిస్థితి.. అధికారిగా పూర్తి నిజాయితీతో త‌న‌ ధ‌ర్మాన్ని తాను నిర్వ‌ర్తించిన పాపానికి జ‌న‌సేన విశాఖ ఎంపి అభ్య‌ర్ధి, సిబిఐ మాజీ జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌ను టార్గెట్ చేసే ప్ర‌య‌త్నం చేసి, త‌న చేత్తో త‌న చెంప‌లే వాయించుకున్నారు.. త‌నది త‌ప్పుడు లెక్క‌ల జాతేన‌ని జ‌నానికి తానే బ‌హిర్గతం చేసుకున్నారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక స‌మ‌రం ముగిసిన పిమ్మ‌ట ప్ర‌ధాన పార్టీల‌న్నీ మాకు ఇన్ని సీట్లు వ‌స్తాయి అంటే మాకు అన్ని సీట్లు వ‌స్తాయి అంటూ లెక్క‌లు ప్ర‌క‌ట‌న‌లు చేస్తూ వ‌చ్చాయి.. ప్ర‌త్య‌ర్ధులు వాటి మీద విమ‌ర్శ‌లు గుప్పిస్తూ వ‌స్తున్నారు కూడా.. అయితే చేతిదాకా వ‌చ్చిన విజ‌యం జ‌న‌సేన కార‌ణంగా మ‌రోసారి ఎక్క‌డ చేజారిపోతుందోన‌న్న దిగులులో ఉన్న వైసీపీ నేత‌ల విమ‌ర్శ‌లు కాస్త అదుపు త‌ప్పాయి.. ఓట‌మి భ‌యం వెన్నాడుతున్న నేప‌ధ్యంలో., పైకి మేక‌పోతుగాంభీర్యం ప్ర‌ద‌ర్శిస్తున్నా., లోప‌లు మాత్రం వ‌ణుకు మ్యూజిక్ వాయిస్తోంది.. ఈ వ‌ణుకులో విమ‌ర్శ‌ల్లో విజ్ఞ‌త లోపించి అదుపుత‌ప్పి మాట్లాడుతున్నారు.. ప్ర‌త్య‌ర్ధుల‌ను ఒక మాట అని నాలుగు పెట్టించుకుంటున్నారు.. ఈ వ‌రుస‌లో ల‌క్ష కోట్ల అక్ర‌మార్జ‌న కేసులో ఏ2 విజ‌య‌సాయిరెడ్డి కాస్త ముందు ఉన్నారు.. జ‌న‌సేన పార్టీ కూట‌మి ప‌క్ష‌ల‌తో క‌లిపి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో పోటీ చేసింది.. అందులో జ‌న‌సేన పార్టీ వాటా 140 స్థానాలు, సాక్షి స‌హా అన్ని ప‌త్రిక‌లు ఈ వార్త‌ను ప్ర‌ముఖంగా ప్ర‌చురించాయి కూడా.. ఈ 140 స్థానాల్లో 88 స్థానాలు జ‌న‌సేన పార్టీ విజ‌యం సాధిస్తుంద‌న్న న‌మ్మ‌కాన్ని జేడీ వ్య‌క్తం చేశారు.. త‌మ‌ను అరెస్టు చేశార‌న్న అక్క‌సు జేడీ మీద ఎలాగో ప్ర‌ద‌ర్శించాల‌ని భావించిన విజ‌య‌సాయిరెడ్డి., జ‌న‌సేన పోటీ చేసిన స్థానాల సంఖ్య‌ను త‌గ్గించి జేడీకి సెటైర్ వేస్తూ ఓ ట్వీట్ చేశారు.. ట్వీట్‌లో పార్టీ పోటీ చేసిన స్థానాల సంఖ్య త‌గ్గిస్తే త‌గ్గించారు గానీ, సిబిఐ ఆఫీస‌ర్‌గా జేడీ నిబ‌ద్ద‌త త‌ప్పుబ‌డుతూ చేసిన వ్యాఖ్య‌లు ల‌క్ష్మీనారాయ‌ణ‌కు చిర్రెత్తేలా చేశాయి.. జ‌న‌సేన పార్టీ బ‌రిలోకి దిగిన స్థానాల సంఖ్య‌, మిత్ర‌ప‌క్షాలు బ‌రిలోకి దిగిన స్థానాల సంఖ్య క‌లిపి తెలియ‌ప‌రుస్తూ., ముందు నీ దొంగ లెక్క‌లు స‌రిచేసుకోమంటూ జేడీ కూడా రిట‌ర్న్ పంచ్ విసిరారు..

త‌న ట్వీట్‌లో త‌ప్పుడు లెక్క ఉంద‌ని రియ‌లైజ్ అయిన విజ‌య‌సాయి., ఆ త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు మ‌రోసారి తిప్ప‌లు ప‌డ్డారు.. మీ బాస్ చెప్పిన‌ట్టు జ‌న‌సేన‌లో చేరారు అంటూ వ్య‌వ‌హారాన్ని త‌ప్పుదోవ ప‌ట్టించే ప్ర‌య‌త్నం చేశారు.. ఆ బాస్ చంద్ర‌బాబు అనే అర్ధం వ‌చ్చేలా ట్వీట్ పెట్టారు.. జేడీ అధికారిగా మిమ్మ‌ల్ని జైలుకు పంపిన‌ప్పుడు సోనియా పంపింద‌న్న మీరు, నేడు చంద్ర‌బాబు పంపారు అంటూ బుర‌ద చ‌ల్ల‌డంలో వింతా విడ్డూరం ఏమీ లేదు.. రెండు సార్లు జేడీ వల్ల మీకు న‌ష్టం జ‌రిగింది కాబ‌ట్టి అక్క‌సు వెళ్ల‌గ‌క్క‌డంలో త‌ప్పు లేదు.. అయితే వివి ల‌క్ష్మీనారాయ‌ణ‌-విజ‌య‌సాయిరెడ్డా.. ఇద్ద‌ర్లో ఎవ‌రు క‌రెక్ట్ అన్న‌దే ఇక్క‌డ అస‌లు పాయింటు.. మీకు మ‌ద్ద‌తిచ్చిన టిఆర్ఎస్ అనుంగ ప‌త్రిక రాసిన క‌థ‌నం ఆధారంగా జ‌న‌సేన పోటీ చేసింది 65 సీట్లే అని త‌ప్పుడు లెక్క‌లు చెప్పారు విజ‌య‌సాయి., మేం పోటీ చేసిన స్థానాల‌ లెక్క ఇదిగో అంటూ లెక్క చూపారు జేడీ.. త‌న లెక్క‌లో బొక్కులు తెలుసుకున్న ఆడిట‌ర్ ఏ2, త‌ప్పులో కాలేశాన‌న్న విష‌యం తెలుసుకుని, దాన్ని దారిమ‌ళ్లించేందుకు కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు.. జేడీని ఎవ‌రో జ‌న‌సేన‌లోకి పంపారంటూ.. మీరు చెప్పిన లెక్క‌ల్లో లేని నైతిక‌త చేస్తున్న‌ విమ‌ర్శ‌ల్లో మాత్రం ఉందా అన్న‌ది జ‌నం ప్ర‌శ్న‌.. మీరు చేసిన విమ‌ర్శ‌ల్లో నిజంగా నిబ‌ద్ద‌త ఉంటే., మీ జ‌గ‌న్ నెత్తి మీద చెయ్యిపెట్టి జేడీని జ‌న‌సేన‌లోకి ఎవ‌రో పంపార‌ని చెప్పండి.. చేసిన వ్యాఖ్య‌ల‌కు క‌ట్టుబ‌డి ఉంటే ధైర్యం, ద‌మ్ము జ‌న‌సేన అధినేత నుంచి కార్య‌క‌ర్త వ‌ర‌కు ఉన్నాయి.. మీకూ ఉంటే నీతిమాలిన రాజ‌కీయాలు ప‌క్క‌న‌పెట్టి నిజాలు మాట్లాడండి చూద్దాం.. మీ నుంచి జ‌నం కోరుకుంటోంది ఇదే..

Share This:

3,070 views

About Syamkumar Lebaka

Check Also

100 రోజుల పాలన పున: సమీక్షించుకోండి.. వైసిపి సర్కారుకి జనసేన నేతల హితవు..

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 100 రోజుల పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశం అనంతరం., జగన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

2 × 3 =