Home / జన సేన / టీడీపీపై కోపంతో హోదాని ఆపొద్దు.. బీజేపీకి జ‌న‌సేన అధినేత సూచ‌న‌..

టీడీపీపై కోపంతో హోదాని ఆపొద్దు.. బీజేపీకి జ‌న‌సేన అధినేత సూచ‌న‌..

పార్ల‌మెంటులో అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్బంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ట్విట్ట‌ర్ వేదిక‌గా టీడీపీ-బీజేపీల‌పై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.. ప్ర‌త్యేక హోదా అంశంపై సానుకూలంగా స్పందించాలంటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల త‌రుపున కేంద్రాన్ని కోరారు.. ప్ర‌త్యేక హోదా ఆంధ్రుల‌ హ‌క్కు అన్న జ‌న‌సేనాని., ప్ర‌జల ఆకాంక్షను కేంద్రం అర్ధం చేసుకోవ‌డానికి పార్ల‌మెంటుని మించిన వేదిక లేద‌న్నారు.. తెలుగుదేశం నాయ‌క‌త్వంపై కోపం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కి ప్ర‌త్యేక హోదా ఇవ్వ‌క‌పోవ‌డానికి కార‌ణ కారాదంటూ బీజేపీకి సూచించారు..

రాజ‌కీయాలు ప‌క్క‌న‌పెట్టి ప్ర‌జ‌ల త‌రుపున నిల‌బ‌డాల‌ని కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌నికి సూచించారు.. మీ చ‌ర్య‌ల వ‌ల్ల ప్ర‌జ‌ల స‌మ‌యం, డ‌బ్బు వృధా కావ‌డంతో పాటు ఆవేద‌న‌కు కార‌ణ‌మ‌య్యాయ‌న్నారు.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌లు ఇచ్చిన గొప్ప అవ‌కాశాన్ని టీడీపీ-బీజేపీలు వృధా చేశాయ‌ని మండిప‌డ్డారు.. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ విసిరిన తాజా ట్వీట్స్ చ‌ర్చ‌నీయాంశంగా మారాయి..

ప్ర‌త్యేక హోదా ఇస్తాన‌ని మోస‌గించిన కేంద్ర ప్ర‌భుత్వంపై మీరు అవిశ్వాస తీర్మానం ఎందుకు పెట్ట‌రు అన్న జ‌న‌సేన సూచ‌న‌తోనే నేడు పార్ల‌మెంటులో ఇంత చ‌ర్చ జ‌రుగుతుంద‌న్న విష‌యం అంద‌రికీ తెలిసిందే.. బ‌డ్జెట్ స‌మావేశాల‌కి ముందు జాయింట్ ఫ్యాక్ట్ ఫైండింగ్ క‌మిటీ నివేదిక సంద‌ర్బంగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌., టీడీపీ-వైసీపీల‌కు అవిశ్వాసం సూచ‌న ఇచ్చారు.. గ‌త సెష‌న్స్ మొత్తం అవిశ్వాసంపై ర‌చ్చ‌తోనే ముగియ‌గా., ఈ సారి టీడీపీ మ‌రోసారి జ‌న‌సేన సూచ‌న‌ను అమ‌ల్లో పెట్టింది.. జ‌న‌సేన పార్టీ దెబ్బ‌కి పూర్తిగా ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కాన్ని కోల్పోయిన సంద‌ర్బంలో టీడీపీ ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.. అందుకే జ‌న‌సేన అధినేత రాజ‌కీయాలు ప‌క్క‌న‌పెట్టి ప్ర‌జ‌ల త‌రుపున నిల‌బ‌డాల‌ని ట్విట్ట‌ర్‌లో సూచ‌న చేశారు..

శుక్ర‌వారం సంధించిన నాలుగు ట్వీట్ల‌లో టీడీపీ స‌ర్కారు చేప‌ట్టిన మ‌రో ఘ‌న‌కార్యాన్ని కూడా ఓ వెబ్‌పోర్ట‌ల్‌లో ప్ర‌చురిత‌మైన ఆర్టిక‌ల్ రూపంలో పోస్ట్ చేశారు.. సన్‌రైజ్ సిటీ పుణ్య‌మా అని అమ‌రావ‌తి చుట్టుప‌క్క‌ల రైతులు ఎలా రోడ్డున ప‌డ్డార‌నే విష‌యాన్ని విరించేదే ఆ పోస్ట్‌..

Share This:

1,796 views

About Syamkumar Lebaka

Check Also

క‌వాతు బ‌ల‌ప్ర‌ద‌ర్శ‌న కాదు.. బాధ్య‌త‌గా ఉండ‌మ‌ని హెచ్చ‌రిక‌-ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌.

ధ‌వ‌ళేశ్వ‌రం బ్యారేజీ క‌వాతు సూప‌ర్ స‌క్సెస్‌తో ఓ వైపు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు రేపుతుంటే., జ‌న‌సేనాని మాత్రం త‌న బాధ్య‌త‌ని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

one + 8 =