Home / పవన్ టుడే / టీమ్ జ‌న‌సేన‌లోకి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు హ‌రిప్ర‌సాద్‌.. మ‌రో ఇద్ద‌రికి తెలంగాణలో పార్టీ బాధ్య‌త‌లు..

టీమ్ జ‌న‌సేన‌లోకి సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు హ‌రిప్ర‌సాద్‌.. మ‌రో ఇద్ద‌రికి తెలంగాణలో పార్టీ బాధ్య‌త‌లు..

new-doc-46_1 new-doc-46_2

జ‌న‌సేనాని, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ పార్టీ సంస్థాగ‌త నిర్మాణంపై దృష్టి సారించారు.. పార్టీని మ‌రింత బ‌లోపేతం చేసే క్ర‌మంలో ముగ్గురికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌టిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.. అందులో పార్టీ మీడియా విభాగం అధిప‌తిగా సీనియ‌ర్ పాత్రికేయుడు పి.హ‌రిప్ర‌సాద్‌కి బాధ్య‌త‌లు అప్ప‌గించారు.. మూడు ద‌శాబ్దాలుగా ప్రింట్‌, ఎల‌క్ట్రానిక్ మీడియాల్లో రిపోర్ట‌ర్ నుంచి ఎడిట‌ర్ స్థాయి వ‌ర‌కు ప‌నిచేసిన ఆయ‌న‌కు నిబ‌ద్ద‌త క‌లిగిన జ‌ర్న‌లిస్టుగా పేరుంది.. మీడియా రంగంలో ఆయ‌న‌కు ఉన్న అనుభ‌వం పార్టీకి ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని భావించిన జ‌న‌సేనాని., హ‌రిప్ర‌సాద్‌కి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు..

shankargoud-pic mahendar-reddy-pc

హ‌రిప్ర‌సాద్‌తో పాటు తెలంగాణ‌లో పార్టీ కార్య‌వ‌ర్గానికి సంబంధించి ఇద్ద‌రిని జ‌న‌సేనాని త‌న టీమ్‌లోకి తీసుకున్నారు.. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ఆయ‌న‌కు వెన్నుద‌న్నుగా ఉన్న మ‌హేంద‌ర్‌రెడ్డి(పార్టీ ఉపాధ్య‌క్షులు)కి తెలంగాణ‌లో జ‌న‌సేన పార్టీ కార్య‌క్ర‌మాల స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించారు.. హైద‌రాబాద్‌కి చెందిన ప్ర‌ముఖ వ్యాపార‌వేత్త నేమూరి శంక‌ర్‌గౌడ్‌కి జ‌న‌సేన పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌గా ఎంపిక చేశారు.. రంగారెడ్డి జిల్లా పోచంప‌ల్లికి చెందిన శంక‌ర్‌గౌడ్‌, మ‌హేంద‌ర్‌రెడ్డి ఇద్ద‌రూ., ప‌వ‌ర్‌స్టార్ కామ‌న్‌మెన్ ప్రొటెక్ష‌న్ ఫోర్స్‌లో చురుకైన కార్య‌క‌ర్త‌లుగా ప‌నిచేశారు.. గ‌త 14 ఏళ్లుగా రాజ‌కీయ‌, సేవా రంగాల్లో జ‌న‌సేనాని అడుగు జాడ‌ల్లో న‌డుస్తూ వ‌చ్చారు.. దీంతో వారిపై న‌మ్మ‌కంతో జ‌న‌సేన పార్టీలో క్రియాశీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గిస్తున్న‌ట్టు ప‌వ‌ర్‌స్టార్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు..

Share This:

601 views

About Syamkumar Lebaka

Check Also

నిజ‌మైన స‌ర్వే చేద్దాం రండి.. ప‌చ్చ‌-ప్ర‌తి ప‌చ్చ‌(సాక్షి) మీడియాల‌కి ఓపెన్ ఛాలెంజ్‌..

తెలుగు రాష్ట్రాల్లో ఎన్నిక‌ల వేడి రాజుకున్న నేప‌ధ్యంలో.. స‌ర్వేలంటూ మీడియా హ‌డావిడి మొద‌లుపెట్టింది.. తెలంగాణ‌లో ప‌రిస్థితులు ఎలా వున్నా., ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

eight − seven =