Home / జన సేన / డిబేట్‌కి రండి.. ఎవ‌రి స‌త్తా ఏంటో తేల్చుకుందాం.. బాబు,లోకేష్‌, జ‌గ‌న్‌ల‌కి జ‌న‌సేనుడి ఛాలెంజ్‌..

డిబేట్‌కి రండి.. ఎవ‌రి స‌త్తా ఏంటో తేల్చుకుందాం.. బాబు,లోకేష్‌, జ‌గ‌న్‌ల‌కి జ‌న‌సేనుడి ఛాలెంజ్‌..

ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి రాజ‌కీయాలు తెలియ‌వు.. అనుభ‌వం లేదు.. అంటూ అధికార ప్ర‌తిప‌క్ష నాయ‌కుల నుంచి వ‌స్తున్న విమ‌ర్శ‌ల‌కి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ మ‌రోసారి గూబ‌గుయ్యి మ‌నే కౌంట‌ర్ ఇచ్చారు.. రాజ‌కీయం అంటే కేవ‌లం ప్ర‌జా సేవ‌, ప్ర‌జా స‌మ‌స్య‌లు తీర్చ‌డం మాత్ర‌మే అని భావించే జ‌న‌సేనాని., అనుభ‌వం-రాజ‌కీయ ప‌రిజ్ఞానం అనే అంశాల‌పై ఓపెన్ డిబేట్‌కి రావాల‌ని ప్ర‌త్య‌ర్ధుల‌కి స‌వాలు విసిరారు.. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేష్‌ల‌తో పాటు ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్‌ల‌కు ఈ ఛాలెంజ్ విసిరారు.. పైగా మీరు ముగ్గురు మీ అనుచ‌రుల‌తో క‌ల‌సి రండి, నేను ఒక్క‌డినే వ‌స్తా.., ఏ అంశంపై అయినా, ఏ పాల‌సీపై అయినా చ‌ర్చ‌కు ర‌మ్మ‌న్నారు.. ఎవ‌రి ప‌రిజ్ఞానం ఏంటో ప్ర‌జ‌ల ముందు తేలిపోతుంద‌ని స‌వాలు విసిరారు..

2014 ఎన్నిక‌ల్లో ఓ మార్పుని ఆశించి 18 శాతం ఓట్లు వేయిస్తే., వాళ్లు ప్ర‌జ‌ల‌కి చేసింది మాత్రం శూన్య‌మ‌ని ఎద్దేవా చేశారు.. 65 ఏళ్ళ వ‌య‌సులో కూడా చంద్ర‌బాబుకి డ‌బ్బు-ప‌ద‌వుల‌పై ఆశ చావ‌లేదంటూ ఎద్దేవా చేశారు.. టీడీపీ పాల‌న‌లో ఉత్త‌రాంధ్ర ప్ర‌తి మూలా స‌మ‌స్య‌ల మ‌యంగా మారింద‌న్న ఆయ‌న‌., శ్రీకాకుళం జిల్లా నుంచి అందుబాటులో ఉన్న, వినియోగంలో లేని వ‌న‌రుల లెక్క చెప్పుకొచ్చారు.. ఒక్క విజ‌య‌న‌గ‌రం జిల్లా నుంచే 44 వేల మంది వ‌ల‌స పోవ‌డానికి కార‌ణం ఎవ్వ‌రంటూ నిల‌దీశారు.. 16 న‌దులు, పుష్క‌ల‌మైన ప్ర‌కృతి వ‌న‌రులు అందుబాటులో జ‌నం వ‌ల‌స‌ల బాట ప‌డుతున్నారంటే., ఆ దుస్థితికి కార‌ణం మీ పాల‌న కాదా అంటూ జ‌న‌సేనాని ప్ర‌శ్నించారు.. మాట్లాడితే ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌కి రాజ‌కీయ అనుభ‌వం లేదంటారు.. ఎవ‌రి అనుభ‌వం ఏంటో తేల్చుకుందాం., ఏ పాల‌సీ పైనైనా డిబేట్‌కి ర‌మ్మంటూ స‌వాలు చేశారు..

జ‌న‌సేన‌కు ఓ ఖ‌చ్చిత‌మైన భావ‌జాలం ఉంద‌న్న ప‌వ‌న్‌., టీడీపీ-వైసీపీల‌కు మాత్రం అది ఒక్క శాతం కూడా లేద‌న్నారు.. అదే ఉంటే హోదా నుంచి చ‌క్కెర ఫ్యాక్ట‌రీ వ‌ర‌కు ప‌వ‌న్‌క‌ళ్యాణ్ చెబితేగాని ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు ఎందుకు గుర్తించ‌లేర‌ని నిల‌దీశారు.. 2019లో జ‌న‌సేన ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి, రాజ‌కీయాల్లో స‌మూల మార్పు తీసుకువ‌స్తామ‌ని ధీమా వ్య‌క్తం చేశారు..

మ‌రి జ‌న‌సేన అధినేత చేసిన ఓపెన్ ఛాలెంజ్‌ని అధికార‌-ప్ర‌తిప‌క్షాలు స్వీక‌రిస్తాయా..? ప‌వ‌న్‌క‌ళ్యాణ్‌తో ఎదురుప‌డ‌గ‌ల స‌త్తా చంద్ర‌బాబు-లోకేష్‌-జ‌గ‌న్‌ల‌లో ఉన్నాయా..? సైద్ధాంతిక బ‌లం, ప్ర‌జా ప్ర‌యోజ‌న పాల‌సీల‌పై నిజంగా అవ‌గాహ‌న ఉంటే., మ‌రి ప‌వ‌న్ ఏం మాట్లాడినా..? ఏ నేతా ఎందుకు బ‌దులివ్వ‌డం లేదు.. జ‌న‌సేన‌ని చూసి భ‌య‌ప‌డుతున్నారా..? ఇప్ప‌టికే జ‌నం ముందు చుల‌క‌నైపోయాం..? ప‌వ‌న్‌తో త‌ల‌ప‌డి ఓడిపోతే అన్న భ‌యం ఛాలెంజ్ స్వీక‌రించ‌డానికి ఆలోచింప చేస్తుందా..? ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే చ‌ర్చ సాగుతోంది.. జ‌నం కోసం ట్రాక్ ఎక్కుదాం ర‌మ్మ‌న్నారు.. మాట్లాడ‌లా.. ఇప్పుడు మాట్లాడుకుందా ర‌మ్మంటున్నారు.. ఇప్పుడూ మాట్లాడ‌డంలా.. వారి భ‌యం ఏంటో భ‌గ‌వంతుడికే తెలియాలి..

Share This:

1,954 views

About Syamkumar Lebaka

Check Also

పెనుగొండ‌ని శ్రీ వాస‌వీ క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ‌గా మారుస్తాం-జ‌న‌సేనాని..

జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక పెనుగొండ ఊరి పేరును ‘శ్రీ వాస‌వి క‌న్య‌కాప‌ర‌మేశ్వ‌రి పెనుగొండ’గా మారుస్తామ‌ని జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

three × four =