Home / ఎడిటోరియల్స్ / ఢిల్లీలో ఆప్ మాదిరి ఏపీలో జ‌న‌సేన సంచ‌ల‌నం సృష్టిస్తుందా..? పొలిటిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్ డా. పి.పుల్లారావు మాట‌ల్లో..

ఢిల్లీలో ఆప్ మాదిరి ఏపీలో జ‌న‌సేన సంచ‌ల‌నం సృష్టిస్తుందా..? పొలిటిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్ డా. పి.పుల్లారావు మాట‌ల్లో..

ఆంధ్ర‌ప్ర‌భ శుక్ర‌వారం ఎడిష‌న్‌లో రాష్ట్రానికి ”కొత్త దిక్సూచి కావాలి” అన్న పేరుతో ఓ అద్భుత వ్యాసం ప్ర‌చురించింది.. ఈ వ్యాసాన్ని చ‌దివిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ర‌చ‌యిత‌, పొలిటిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్ డా. పి.పుల్లారావుకి కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డంతో పాటు ప్ర‌తి ఒక్క జ‌న‌సైనికుడు ఈ వ్యాసాన్ని చ‌దవాలంటూ ట్విట్ట‌ర్ వేదిక‌గా విజ్ఞ‌ప్తి చేశారు.. రాజ‌కీయాల్లో జ‌వాబుదారీత‌నం తీసుకురావ‌డ‌మే జ‌న‌సేన ల‌క్ష్య‌మంటూ ముగించారు.. జ‌న‌సేనాని అంత ప్ర‌త్యేకంగా చెప్ప‌డానికి కార‌ణం ఏంటి..? ఆ వ్యాసంలో అంద‌రూ చ‌ద‌వాల్సిన అంత ప్ర‌త్యేక‌త ఏముంది..? అంటే…. ”కొత్త దిక్సూచి కావాలి” అంటూ ప్ర‌చురిత‌మైన ఆ వ్యాసం చ‌దివిన ప్ర‌తి జ‌న‌సైనికుడు., మ‌రో ప‌ది మందితో చ‌దివించాలి అని నేనంటాను..

ఇంత‌కీ డా.పి.పుల్లారావు ఆ వ్యాసంలో ఏం రాశారంటే.. ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్ కొత్త పార్టీ పెట్టి అధికారంలోకి వ‌చ్చిన తీరు., జ‌న‌సేన‌కి ఢిల్లీ ప్ర‌స్థుత పాల‌క ప‌క్షం ఆప్‌కీ మ‌ధ్య ఉన్న సారూప్యాన్ని, అదే స‌మ‌యంలో పీఆర్పీ వైఫ‌ల్యానికి కార‌ణాలు, జ‌న‌సేన, జ‌న‌సైనికులు అనుస‌రించాల్సిన వ్యూహాల‌ను చాలా చక్క‌గా వివ‌రించారు..

ఓ స్టేట‌స్ ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి ప్ర‌జ‌ల హ‌క్కుల కోసం కేజ్రివాల్ పోరాటం చేసిన చందం.. అదే స‌మ‌యంలో ప్ర‌జా స‌మ‌స్య‌లు గాలికి వ‌దిలి అధికారమే ధ్యేయంగా కాంగ్రెస్‌-బీజేపీలు కుస్తీ ప‌ట్టిన విధానం.. కేజ్రివాల్‌కి క‌లిసొచ్చిన అంశాన్ని వ్యాసంలో ప్ర‌స్తావించారు.. ప్ర‌స్తుతం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ఎదుట కూడా అలాంటి ప‌రిస్థితులో ఉన్నాయ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. కోట్ల రూపాయిల సంపాద‌న వ‌దులుకుని ప‌వ‌న్ కూడా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాడుతూ పార్టీని బ‌లోపేతం చేసిన తీరు కూడా అందుకు అద్దం ప‌డుతుంద‌న్న అభిప్రాయాన్ని పుల్లారావు వెలిబుచ్చారు..
NRIల మ‌ద్ద‌తు..!!                                                                                      Advertisement.
అప్ప‌ట్లో కేజ్రివాల్ రాజ‌కీయ పార్టీల అవినీతిపై పోరాటం చేస్తాన‌న‌గానే ప్ర‌వాస భార‌తీయులు పెద్ద సంఖ్య‌లో ఆయ‌న‌కి మ‌ద్ద‌తు ప‌లికారు.. మాతృదేశాన్ని ప్రేమిస్తున్న అంశాన్ని ప్ర‌స్థావించారు.. వేలాది మంది NRIలు స్వ‌దేశానికి వ‌చ్చి నిధులు ఇవ్వ‌డంతో పాటు ప్ర‌చారం చేసిన విష‌యాన్ని వ్యాసంలో ఉంచారు.. జ‌న‌సేన‌కి కూడా అలాంటి మ‌ద్ద‌తే ఉంద‌న్నారు.. దీంతో పాటు విదేశాల్లో ఉన్న NRI సంఘాల్లో అగ్ర‌వ‌ర్ణాల‌కి అమ‌రావ‌తి అభివృద్దిని చూపుతూ భారీగా భూముల‌పై ప్ర‌భుత్వం పెట్టుబ‌డులు పెట్టించిన విష‌యాన్ని., అమ‌రావ‌తి విఫ‌లంతో వారిలో ఏర్ప‌డిన వ్య‌తిరేక‌త‌తో వారిని ర‌క్షించుకునేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాల‌ను ఎత్తి చూపారు.. వారంద‌రి మ‌ద్ద‌తు జ‌న‌సేన కూడ‌గ‌ట్టాల‌ని సూచించారు..

కేజ్రివాల్ నుంచి మంచి విష‌యాల‌న్ని తీసుకోవ‌చ్చు..!!!
ఆప్ విజ‌యానికి కేజ్రివాల్ పాటించిన మంచి విష‌యాల్ని జ‌న‌సేన కూడా పాటించ‌వ‌చ్చ‌ని డాక్ట‌ర్ పుల్లారావు స్ప‌ష్టం చేశారు.. కేజ్రివాల్ బంధువులు-మిత్రుల్ని ధ‌రిచేర‌నివ్వ‌ని అంశాన్ని ప్ర‌స్థావించారు.. ద్వారాల వ‌ద్ద కుటుంబ మిత్రుల‌ను నియ‌మిస్తే వారు ప్ర‌జ‌ల్ని త‌రిమేస్తారని తెలిపారు.. గోదావ‌రి, ఉత్త‌రాంధ్ర జిల్లాల్లో చిరంజీవితో సాన్నిహిత్యం ఉన్న‌వారు ప్ర‌జారాజ్యాన్ని గుప్పెట పెట్టుకున్న విష‌యాన్ని, జాల్లా అధ్య‌క్షల‌వ‌డం, టిక్కెట్లు అమ్ముకున్న విష‌యాల్ని కూడా వ్యాసంలో ప్ర‌స్థావించారు.. చిరంజీవి ఓట‌మితో వారంతా అజ్ఞాతంలోకి వెళ్లిన విష‌యాన్ని వెల్ల‌డించిన ఈ పొలిటిక‌ల్ ఎక్స్‌ప‌ర్ట్‌., అవ‌స‌రం అనుకుంటే వారి నుంచి స‌ల‌హాలు తీసుకోవ‌చ్చు గానీ., నెత్తిన మాత్రం పెట్టుకోవ‌ద్ద‌ని సూచ‌న చేశారు..
చివ‌రి నిమిషం వ‌ర‌కు టిక్కెట్ల‌పై తేల్చొద్దు..!!
కొత్త పార్టీల విధానాలు కొత్త‌గానే ఉండాల‌న్న డాక్ట‌ర్ పుల్లారావు., చివ‌రి క్ష‌ణం వ‌ర‌కు టిక్కెట్ల‌కి సంబంధించి ఏ ఒక్క‌రికీ హామీలు ఇవ్వొద్ద‌ని., పేర్లు ప్ర‌క‌టించ వ‌ద్ద‌ని సూచించారు.. కొత్త పార్టీ నాయ‌కుల‌కి రోల్ మోడ‌ల్ విన్‌స్ట‌న్ చ‌ర్చిల్ మాదిరి ఉండాల‌న్నారు.. త‌గిన స‌మ‌యం వ‌చ్చే వ‌ర‌కు వేచి ఉండాల‌న్నారు.. పాత పార్టీల మూస ప‌ద్ద‌తులు, ఓకే రంగు యూనిఫాం దుస్తుల ధార‌ణ‌, ఏసీ గ‌దుల్లో చ‌ర్చ‌లు లాంటి ప్ర‌జ‌ల్ని ఆశ్చర్యానికి గురిచేసే ప‌నులు చేయ‌క‌., కేజ్రివాల్ మాదిరి మంచి ప్ర‌త్నామ్నాయం అనిపిస్తే ప్ర‌జ‌లు మొగ్గు చూపుతార‌న్న ఈ రాజ‌కీయ విశ్లేష‌కుడు., ముందుగా కేజ్రివాల్ ఎలా అధికారం సాధించారో తెలుసుకోవాల‌న్నారు.. ఈ సూచ‌న జ‌న‌సైనికులంద‌రికీ.. అందుకే ఈ వ్యాసాన్ని చ‌ద‌వ మ‌ని జ‌న‌సేన అధినేత సూచించారు..

Advertisement..

Share This:

3,206 views

About Syamkumar Lebaka

Check Also

సేనాని బాటే నా మాట‌.. అసెంబ్లీలో ప్ర‌యాణంపై జ‌న‌సేన ఎమ్మెల్యే రాపాక‌..

సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న‌సేన పార్టీ త‌ర‌ఫున శాస‌న‌స‌భ‌కు ఎన్నికయిన రాపాక వ‌ర‌ప్ర‌సాద్‌కు పార్టీ అధినేత ప‌వ‌న్‌క‌ళ్యాణ్ అభినంద‌న‌లు తెలియ‌చేశారు.. తూర్పుగోదావ‌రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine + 9 =