Home / జన సేన / తిత్లీ నష్టం వాస్తవాలను వెల్లడించాలి.. సిఎం తీరుపై జ‌న‌సేన అధినేత అసంతృప్తి..

తిత్లీ నష్టం వాస్తవాలను వెల్లడించాలి.. సిఎం తీరుపై జ‌న‌సేన అధినేత అసంతృప్తి..

శ్రీకాకుళం జిల్లాను తిత్లీ తుపాన్ ఏ విధంగా, ఏ స్థాయిలో నష్టపరిచింది వాస్తవాలను వెల్లడించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు.. తుపాను దెబ్బ‌కి సిక్కోలు ప్ర‌జ‌లు ప‌డుతున్న పాట్లు బాహ్య ప్ర‌పంచానికి తెలిడ‌యం లేద‌ని మండిప‌డ్డారు.. తిత్లీ తీరాన్ని తాకాకా, పెద్ద న‌ష్టం జ‌ర‌గ‌లేదున్న ప్ర‌చ‌రంతో నిజాన్ని దాచేశార‌ని జ‌న‌సేనాని మండిప‌డ్డారు..కేంద్రం కూడా సిక్కోలు వాసుల క‌ష్టాల‌పై స్పందించే వ్య‌వ‌హారంలో వివ‌క్ష చూపుతోంద‌న్నారు..రాష్ట్ర ప్ర‌భుత్వంపై ఉన్న కోపాన్ని ప్ర‌జ‌ల‌పై చూపొద్ద‌ని కేంద్రానికి విజ్ఞ‌ప్తి చేశారు.. కేంద్ర రాష్ట్రాల మధ్య ప్రజలు నలిగిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ వేదిక‌గా జ‌రిగిన మీడియా స‌మావేశంలో తిత్లీ ప్ర‌భావిత ప్రాంతాల్లో ప‌ర్య‌ట‌న, క్షేత్ర స్థాయిలో చేప‌ట్టిన అధ్య‌య‌నం, ప్ర‌జ‌ల ఆవేద‌న‌, జ‌న‌సేన పార్టీ త‌రుపున చేప‌ట్టిన స‌హాక కార్య‌క్ర‌మాల‌ని వివ‌రించారు.. “ఉద్దానం మూడు పంటలు పండే పచ్చని ప్రాంతం. అక్కడే కిడ్నీ వ్యాధులు ఎక్కువ. వలసలూ ఎక్కువ. ఈ ప్రాంతంపై తిత్లీ తుపాన్ విరుచుకుపడి తీవ్ర నష్టాన్ని కలిగించిందన్నారు. 90 శాతం కొబ్బరి చెట్లు నేలకొరిగాయి. నిలబడ్డవాటిలో చాలా వరకూ మొవ్వు విరిగిపోయాయి. జీడీ మామిడికి తీవ్ర నష్టం కలిగింది. పశుసంపదను కోల్పోయారని తెలిపారు.. వరి, ఉద్యాన పంటలు దెబ్బ తిన్నాయ‌న్నారు..తుపాను ప్ర‌భావిత ప్రాంతాల‌కి సంపూర్ణ రుణ‌మాఫీ అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.. జీడి, కొబ్బ‌రి రైతుల‌కి ప‌దేళ్ల పాటు ఆర్ధిక భ‌రోసా ఇచ్చారు..

జీడి, మామిడి తోట‌ల‌కి హెక్టారుకి 50 వేల ప‌రిహారం ఇవ్వాలి..
రైతుల‌కి క‌ల్పించే న‌ష్ట‌ప‌రిహారం వ్య‌వ‌హారంలో ప్ర‌భుత్వం ఎద‌టు జ‌న‌సేన పార్టీ త‌రుపున ప‌లు డిమాండ్లు ఉంచారు.. పంట నష్ట పరిహారంగా హెక్టార్ వరికి రూ.40 వేలు, జీడీ మామిడి, మామిడి, అరటి తోటలకి రూ. 50 వేలు, కొబ్బరి చెట్టుకి రూ.మూడు వేలు, పాడి పశువు ఒక్కోదానికి రూ.40 వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.. కిరాణా షాపులు లాంటివి పెట్టుకున్న చిరు వ్యాపారులకు రూ.20 వేలు, వృత్తి ఆధారిత వ్యక్తులకు రూ.10 వేలు, గీత కార్మికులకు రూ.30 వేలు ఆర్ధిక సాయం చేయాల‌ని ప‌వ‌న్‌క‌ళ్యాణ్ డిమాండ్ చేశారు.. నష్టాన్ని ఫోటో తీసి పంపించమంటున్న అధికారుల తీరుపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.. అసలు కరెంట్ ఉండదు, ఫోన్‌కి ఛార్జింగ్ ఉండదు. ఇక ఎలా ఫోటో తీసిపెడతారు.? చనిపోయిన పశు కళేబరాలను ఫోటో కోసం ఉంచుకొంటే దుర్వాసన, రోగాల భయం. పూడ్చిపెడితే కుదరదట. ఇలాంటి సమయంలో మానవతా దృష్టితో చూడాలంటూ ప్ర‌భుత్వానికి సూచించారు..

మత్స్యకారులకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలి
తుపాన్ సమయాల్లో నష్టపోతున్న మత్స్యకారుల్ని ప్రత్యేక ప్యాకేజి ద్వారా ఆదుకోవాని జ‌న‌సేనాని కోరాఉ.. వారి వలలు ధ్వంసం అయ్యాయి. బోట్లు దెబ్బతిన్నాయి. సముద్రంలోకి వెళ్లి వేటపై జీవించే వీరికి సాయం విషయంలో ప్రత్యేక దృష్టి ఉండాల‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.. తీర ప్రాంతంలో తుపాన్ షెల్టర్లు పాడైపోయి ఉన్నాయి. తుపాను ముందు అప్రమత్తత విషయంలో ప్రభుత్వం విఫలమైందని విమ‌ర్శించారు.. హుద్ హుద్ సమయంలో ముందుగానే సన్నద్ధం చేయడంతో ప్రజలు జాగ్రత్త పడ్డారు. అదే రీతిలో తిత్లీ తుపాన్ సమయంలో కూడా చేస్తే కనీసం ఆహారం, నీళ్లు లాంటివి తీసుకొని కొన్ని జాగ్రత్తలు తీసుకొనేవారన్నారు… ఈ ఆరు రోజుల్లో 48 గ్రామాలు సందర్శించి అక్కడి నష్టాన్ని పరిశీలించిన‌ట్టు చెప్పిన ఆయ‌న‌, రోడ్డు పక్క ఊళ్ళకి విద్యుత్ పునరుద్ధరణ చేశారుగానీ లోపల ఉన్న ఊళ్ళవైపు చూడలేదని ఆరోపించారు… కనీసం ప్రజా ప్రతినిధులు, మంత్రులు ఊళ్ల‌లోకి అడుగుపెట్టిన దాఖ‌లాలు లేవంటూ అక్క‌డ ప‌రిస్థితుల్ని వివ‌రించారు.. ముఖ్యమంత్రి గారు తుపాన్ న‌ష్టం విషయంలో వాస్తవాలు చెప్పాలని డిమాండ్ చేశారు.. ఆయన నిజం చెప్పి, ఇదీ పరిస్థితి అంటే స్పందించేవారు చాలా మంది ఉన్నార‌న్న జ‌న‌సేన అధినేత‌., ఆయన మాత్రం రబ్బరు బోట్లలో తిరిగి ఫోటోలు తీయించుకోని అదో ప్రచార కార్యక్రమంలా చేశార‌ని ఎద్దేవా చేశారు.. ముఖ్య‌మంత్రి వ్య‌వ‌హారం శవాల మీద పేలాలు ఏరుకున్నట్లు ఉందన్నారు.. ఇదేమీ ఓ పార్టీ పని కాదు. ఓ ప్రాంతానికి జరిగిన నష్టం. అందరం రాజకీయాలకి అతీతంగా స్పందించి ఆదుకోవాలని కోరారు.. ముఖ్య‌మంత్రి అంతా అయిపోయింది అని చెబితే దానికి గ‌వ‌ర్న‌ర్ కూడా వంత‌పాఆర‌ని ఆరోపించారు.. ఆయ‌న‌కీ అవ‌గాహ‌న లేక‌పోవ‌డం బాధించే అంశ‌మ‌న్నారు.. మేము క్షేత్ర స్థాయి నష్టాలు, తుపానుకు ముందు ఈ ప్రాంతం ఎలా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా అయిపోయిందో తెలిపే నివేదికను సిద్ధం చేసి ప్రధానమంత్రికి అందచేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు… ఆ వివరాలను గవర్నర్ గారికీ ఇస్తామ‌న్నారు.. ఉద్దానం ప్రాంతాన్ని ప్రత్యేక దృష్టితో చూడాలని కోరారు.. కేంద్ర బృందాన్ని 15 రోజుల్లోగా పంపిస్తే ఇక్కడి వాస్తవ నష్టం తెలుస్తుందని అన్నారు..
వీధికో రకంగా సాయం ..
ప్రజలు ఇంకా కష్టాల్లో ఉంటే విజయోత్సవ ర్యాలీలు చేసి సత్కారాలు చేయడం ఏమిటి..? అంటూ ప్ర‌శ్నించారు..ముఖ్యమంత్రి గారు కూడా అధికారులతో రివ్యూలుపెట్టి వారిని చంపేయకుండా బయటకు పంపించి పని చేయనీవ్వ‌లాని సూచించారు..జన్మ భూమి కమిటీల తీరు దారుణంగా ఉంది. తెలుగు దేశంవాళ్ళు కాకపోతే సాయం చేయడం లేదని ఆరోపించారు.. ప్రభుత్వ విధానంపై ప్రజల్లో, యువతలో చాలా ఆవేశం, ఆవేదన ఉన్నాయి. సిక్కోలు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు అనే బాధ ఉందన్నారు.. ప‌ని చేయలేదని నిలదీస్తే బెదిరింపులకు దిగుతున్నారు. వీటిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకోవాలి. శ్రీకాకుళం జిల్లా నుంచి అచ్చెన్నాయుడు, కళా వెంకట్రావు గార్లు మంత్రులుగా ఉన్నా పట్టించుకోలేదు. విద్యుత్ పునరుద్ధరణే సక్రమంగా చేయలేదని ఆరోపించారు.. సహాయ కార్యక్రమాలు కూడా ఒక వీధికి ఒక రకంగా చేస్తున్నారంటూ మండిప‌డ్డారు..

Share This:

1,226 views

About Syamkumar Lebaka

Check Also

కేంద్ర బ‌డ్జెట్ నిరాశ ప‌ర్చింది.. ఏపీ స‌ర్కారు స్ప‌ష్ట‌త తీసుకోవాలి-జ‌న‌సేన పార్టీ

కేంద్ర బ‌డ్జెట్‌లో రెండు తెలుగు రాష్ట్రాల‌కు తీర‌ని అన్యాయం జ‌రిగింద‌ని జ‌న‌సేన పార్టీ ముఖ్య‌నేత మాదాసు గంగాధ‌రం స్ప‌ష్టం చేశారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

two × 5 =